pro kabaddi 2017
-
తమిళ్ తలైవాస్ గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 35–34తో విజయం సాధించింది. చివరి క్షణాల్లో తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ మూడు రైడింగ్ పాయింట్లు సాధించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36–34తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్; యూపీ యోధాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
2 నిమిషాల్లో తారుమారు
న్యూఢిల్లీ: మ్యాచ్ ముగిసేందుకు ఇక రెండే నిమిషాలు మిగిలుంది. దబంగ్ ఢిల్లీ 28–26తో ఆధిక్యంలో ఉంది. కానీ రెండు నిమిషాల వ్యవధిలో ఆధిక్యం చేతులు మారింది. విజయం యు ముంబాను వరించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో యు ముంబా 30–28 స్కోరుతో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. ఈ మ్యాచ్‌లో రైడర్ శ్రీకాంత్ జాదవ్ (11) రాణించాడు. 20 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను పది పాయింట్లు తెచ్చిపెట్టాడు. టాకిల్‌లో మరో పాయింట్ చేశాడు. కశ్‌లింగ్ అడకె 7, అనూప్ కుమార్ 3 పాయింట్లు సాధించారు. దబంగ్ ఢిల్లీ తరఫున అబొల్ ఫజల్ 6, రోహిత్ బలియాన్, మిరాజ్ షేక్ చెరో 4 పాయింట్లు చేశారు. సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆట ఆరంభం నుంచి ఆధిపత్యం చాటిన ఢిల్లీ... ఒకానొక దశలో 12–3తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. చాలా ఆలస్యంగా పుంజుకున్న యు ముంబా చక్కని రైడింగ్‌లతో ప్రత్యర్థి జట్టుకు సవాల్ విసిరింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ముంబా 16–17తో ఒక పాయింట్‌తో వెనుకబడింది. తర్వాత ద్వితీయార్ధంలో మ్యాచ్ ముగిసే దశలో మెరుపు రైడింగ్‌లతో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. లీగ్‌లో ఢిల్లీకిది ఎనిమిదో పరాభవం కాగా... యు ముంబాకు ఎనిమిదో విజయం. శనివారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో బెంగాల్ వారియర్స్; దబంగ్ ఢిల్లీతో పుణేరి పల్టన్ తలపడతాయి. -
గుజరాత్ జెయింట్స్‌కు ఝలక్
కోల్‌కతా: వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో అపజయమనేదే లేకుండా దూసుకెళుతున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జోరుకు అడ్డుకట్ట పడింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 42–36 తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధించింది. ప్రశాంత్ కుమార్ రాయ్ 14 రైడింగ్ పాయింట్లతో అదరగొట్టగా... గుజరాత్ నుంచి సచిన్ 13 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగంలో గుజరాత్ ఏడు పాయింట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నా చివరి ఎనిమిది నిమిషాల్లో హర్యానా పుంజుకుంది. ఇక హోరాహోరీగా సాగిన బెంగాల్ వారియర్స్, యూపీ యోధ మ్యాచ్ 26–26తో టైగా ముగిసింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్... తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ఘనంగా ప్రో కబడ్డీ లీగ్