
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ జట్టు 35–34తో విజయం సాధించింది. చివరి క్షణాల్లో తలైవాస్ కెప్టెన్ అజయ్ ఠాకూర్ మూడు రైడింగ్ పాయింట్లు సాధించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36–34తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్; యూపీ యోధాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి.