యోధాస్‌పై తలైవాస్‌ పైచేయి | Tamil Thalaivas win over UP Yoddhas | Sakshi
Sakshi News home page

యోధాస్‌పై తలైవాస్‌ పైచేయి

Published Wed, Nov 27 2024 4:27 AM | Last Updated on Wed, Nov 27 2024 4:27 AM

Tamil Thalaivas win over UP Yoddhas

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తమిళ్‌ తలైవాస్‌ వరుస పరాజయాలకు బ్రేక్‌ వేస్తూ ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన పోరులో తలైవాస్‌ 40–26 స్కోరుతో యూపీ యోధాస్‌పై ఘనవిజయం సాధించింది. డిఫెండర్‌ మొయిన్‌ షఫాగి (8 పాయింట్లు) అదరగొట్టగా, రెయిడర్లు  నరేందర్‌ ఖండోలా (6), మసన ముత్తు (6) రాణించారు. డిఫెండర్లు రోనక్, ఆశిష్, నితీశ్, అమిర్‌ హుస్సేన్‌ తలా 2 పాయింట్లు చేశారు.

యూపీ తరఫున గగన్‌ గౌడ 8, అశు సింగ్‌ 5, భవానీ రాజ్‌పుత్‌ 3 పాయింట్లు సాధించారు. నిజానికి తొలి అర్ధభాగంలో చకచకా పాయింట్లు సాధించిన యోధాస్‌ రెండో అర్ధభాగంలో తేలిపోయింది. 17–12తో పైచేయి సాధించిన యూపీ ద్వితీయార్ధంలో మరో 9 పాయింట్లే చేసి ఏకంగా 28 పాయింట్లను సమర్పించుకుంది. తొలి అర్ధభాగంలో తలైవాస్‌ ఒకసారి ఆలౌట్‌ కాగా, రెండో అర్ధభాగంలో తలైవాస్‌ ఆటగాళ్ల దూకుడుకు యూపీ యోధాస్‌ ఏకంగా మూడు సార్లు ఆలౌట్‌ కావడం విశేషం. 

మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ, పట్నా పైరేట్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 39–39తో ‘టై’ అయ్యింది. పట్నా రెయిడర్‌ దేవాంక్‌ (15) క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టగా, డిఫెండర్‌ దీపక్‌ (7) ఆకట్టుకున్నాడు. దబంగ్‌ జట్టులో రెయిడర్‌ అశు మలిక్‌ (11), ఆల్‌రౌండర్‌ ఆశిష్‌ (7), రెయిడర్‌ నవీన్‌ కుమార్‌ (6) రాణించారు. నేడు జరిగే పోటీల్లో హరియాణా స్టీలర్స్‌తో పుణేరి పల్టన్‌... బెంగాల్‌ వారియర్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ తలపడనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement