
గుజరాత్ జెయింట్స్‌కు ఝలక్
కోల్‌కతా: వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో అపజయమనేదే లేకుండా దూసుకెళుతున్న గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జోరుకు అడ్డుకట్ట పడింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 42–36 తేడాతో గుజరాత్‌పై ఘనవిజయం సాధించింది. ప్రశాంత్ కుమార్ రాయ్ 14 రైడింగ్ పాయింట్లతో అదరగొట్టగా... గుజరాత్ నుంచి సచిన్ 13 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. తొలి అర్ధభాగంలో గుజరాత్ ఏడు పాయింట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నా చివరి ఎనిమిది నిమిషాల్లో హర్యానా పుంజుకుంది. ఇక హోరాహోరీగా సాగిన బెంగాల్ వారియర్స్, యూపీ యోధ మ్యాచ్ 26–26తో టైగా ముగిసింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్... తమిళ్ తలైవాస్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి.