Pro-wrestling league-2
-
పంజాబ్ రాయల్స్‌కు టైటిల్
ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో పంజాబ్ రాయల్స్ జట్టు విజేతగా అవతరించింది. సెమీస్‌లో డిఫెండింగ్ చాంప్ ముంబైని మట్టికరిపించిన పంజాబ్... ఫైనల్లో ఈ సీజన్ లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన హరియాణా హ్యామర్స్‌పై 5–4తో విజయాన్ని సాధించింది. పంజాబ్ తరఫున వ్లాదిమర్ కించెగషి్వలి (57 కేజీలు), వసిలిసా మర్జలిక్ (75 కేజీలు), ఇలియాస్ (65 కేజీలు), నిర్మలా దేవి (48 కేజీలు), జితేంద్ర (74 కేజీలు) విజయాలు సాధించారు. హరియాణా జట్టులో అబ్దుసలామ్ గడిసోవ్ (97 కేజీలు), మర్వా అమ్రి (58 కేజీలు), మజోమెడ్ కుర్బనలివ్ (70 కేజీలు), సోఫియా మాట్సన్ (53 కేజీలు) గెలుపొందారు. విజేతగా నిలిచిన పంజాబ్‌కు రూ. కోటీ 90 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది. -
సెమీస్‌లో ముంబై మహారథి
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో ముంబై మహారథి జట్టు సెమీస్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై మహారథి జట్టు 4–3 తేడాతో ఢిల్లీ సుల్తాన్స్పై గెలుపొందింది. ముంబైతోపాటు ఇప్పటికే హరియాణా, జైపూర్, పంజాబ్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ సీజన్లో ఢిల్లీ, యూపీ దంగల్ జట్లు ఆడిన నాలుగేసి మ్యాచ్‌ల్లో ఓడిపోయి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. ముంబై జట్టులో హసనోవ్ (74 కేజీలు), వికాస్ (65 కేజీలు), ఎరీకా వీబ్ (75 కేజీలు), పావ్లో ఓలియ్‌నిక్ (97 కేజీలు) గెలిచారు. ఢిల్లీ జట్టులో డేవిడ్ (70 కేజీలు), మరియా స్టడ్‌నిక్ (48 కేజీలు), సాక్షి మలిక్ (58 కేజీలు) విజయం సాధించారు. శనివారం జరిగే పోరులో హరియాణా హ్యామర్స్ జట్టు జైపూర్ నింజాస్‌తో తలపడుతుంది. -
దంగల్ పరాజయాల బాట
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో యూపీ దంగల్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ నింజాస్ జట్టు 4–3తో యూపీ దంగల్ జట్టుపై విజయం సాధించింది. ఈ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ యూపీ దంగల్ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథి జట్టు, కలర్స్ ఢిల్లీ సుల్తాన్స్ జట్టుతో తలపడుతుంది. -
ముంబై చేతిలో జైపూర్‌కు షాక్
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో జైపూర్ నింజాస్ జట్టు తొలి పరాజయాన్ని చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై మహారథి జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 3–4 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నీ ఆరంభంలో రెండు వరుస పరాజయాలను మూటగట్టుకున్న ముంబై... ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. ముంబై మహారథి జట్టు తరఫున హసనోవ్ (74 కేజీలు), వికాస్ (65 కేజీలు), రాహుల్ అవారే (57 కేజీలు), ఎరీకా వీబ్ (75 కేజీలు) విజయం సాధించారు. జైపూర్ జట్టులో రీతూ ఫోగట్ (48 కేజీలు), బెట్జబెత్ (53 కేజీలు), ఎలిజ్బర్ (97 కేజీలు) గెలిచారు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఎన్సీఆర్ పంజాబ్ రాయల్స్ జట్టు, యూపీ దంగల్‌తో తలపడుతుంది. -
ఢిల్లీ సుల్తాన్స్‌కు మరో పరాజయం
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ సారథ్యంలోని ఢిల్లీ సుల్తాన్స్ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎన్సీఆర్ పంజాబ్ రాయల్స్ జట్టు 5–2 తేడాతో ఢిల్లీ సుల్తాన్స్పై గెలిచి రెండో విజయాన్ని అందుకుంది. రాయల్స్ జట్టు తరఫున వ్లాదిమర్ కిన్చెగశ్విల్ (57 కేజీలు) 8–1తో పంకజ్‌పై, జితేంద్ర (74 కేజీలు) 5–4తో ప్రవీణ్ రాణాపై, ఒడునాయో (53 కేజీలు) 15–0తో సంగీత ఫోగట్‌పై, అస్గరోవ్ (65 కేజీలు) 6–0తో సుర్జీత్‌పై, మర్జలిక్ (75 కేజీలు) 2–1తో అలీనాపై విజయం సాధించారు. ఢిల్లీ జట్టులో సత్యవర్త్ కడియన్ (97 కేజీలు) 14–4తో క్రిషన్ కుమార్‌పై, సాక్షి (58 కేజీలు) 10–0తో మంజు కుమారిపై గెలుపొందారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథి జట్టు జైపూర్ నింజాస్‌తో ఆడుతుంది. మరోవైపు యూపీ దంగల్ తరఫున ఆడుతున్న ‘ఫోగట్ సిస్టర్స్’ గీత, బబితా గాయాల కారణంగా ఈ లీగ్ మధ్యలో నుంచి వైదొలిగారు. -
ముంబైకి మరో పరాజయం
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2 లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై మహారథి జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎన్సీఆర్ పంజాబ్ రాయల్స్ జట్టు 4–3 తేడాతో ముంబైపై గెలిచి ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన ముంబై 53 కేజీ మహిళల విభాగాన్ని రద్దు చేయగా... పంజాబ్ 74 కేజీ పురుషుల విభాగాన్ని బ్లాక్ చేసింది. పంజాబ్ రాయల్స్ జట్టు తరఫున వ్లాదిమర్ (57 కేజీ) 7–3తో రాహుల్‌పై, పంకజ్ రాణా (70 కేజీ) 9–8తో ప్రీతమ్‌పై, నిర్మలా దేవి (48 కేజీ) 4–0తో కరోలినా కస్టిలోపై, టోగ్రుల్ అస్గరోవ్ (65 కేజీ) 7–3తో వికాస్ కుమార్‌పై గెలుపొందారు. ముంబై జట్టులో ఎరీకా వీబ్ (75 కేజీ) 4–2తో వసిలిసా మార్జలిక్పై, సరిత 2–1తో ముంజు కుమారిపై, పావ్లో ఓలినిక్ 2–0తో కృషన్ కుమార్‌పై విజయం సాధించారు. -
హ్యామర్స్ జోరు
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2 లో హరియాణా హ్యామర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 5–2తో యూపీ దంగల్ జట్టును చిత్తుగా ఓడించింది. హరియాణా తరఫున మజోమెడ్ కుర్బనలివ్ (70 కేజీలు), రజనీశ్ (65 కేజీలు), గడిసోవ్ (97 కేజీలు), సందీప్ తోమర్ (57 కేజీలు), సోఫియా మాట్సన్ (53 కేజీలు) గెలుపొందారు. యూపీ దంగల్ తరఫున ఎలిట్సా యన్కోవా (48 కేజీలు), మారియా మమషుక్ (75 కేజీలు) తమ ప్రత్యర్థులను ఓడించారు. గురువారం జరిగే మ్యాచ్‌లో ముంబై మహారథితో ఎన్సీఆర్ పంజాబ్ రాయల్స్ తలపడుతుంది. -
జైపూర్ జయహో
న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో జైపూర్ నింజాస్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జైపూర్ నింజాస్ 5–2తో పంజాబ్ రాయల్స్ జట్టును ఓడించింది. జైపూర్ తరఫున జాకబ్ మకరష్విలి (74 కేజీలు), పూజా ధండా (58 కేజీలు), జెన్నీ ఫ్రాన్సన్ (75 కేజీలు), వినోద్ కుమార్ ఓంప్రకాశ్ (70 కేజీలు), ఎలిజ్బార్ ఒలికద్జే (97 కేజీలు) తమ బౌట్లలో గెలుపొందారు. పంజాబ్ జట్టుకు ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్ వ్లాదిమిర్ ఖిన్చెగష్విలి (57 కేజీలు), ఒడునాయో అడెకురోయె (53 కేజీలు) విజయాలను అందించారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో యూపీ దంగల్‌తో హరియాణా హ్యామర్స్ తలపడుతుంది.