పంజాబ్‌ రాయల్స్‌కు టైటిల్‌ | PWL 2017: Punjab Royals Edge Out Haryana Hammers to Win Title | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ రాయల్స్‌కు టైటిల్‌

Published Fri, Jan 20 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

పంజాబ్‌ రాయల్స్‌కు టైటిల్‌

పంజాబ్‌ రాయల్స్‌కు టైటిల్‌

ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో పంజాబ్‌ రాయల్స్‌ జట్టు విజేతగా అవతరించింది. సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ ముంబైని మట్టికరిపించిన పంజాబ్‌... ఫైనల్లో ఈ సీజన్ లో లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన హరియాణా హ్యామర్స్‌పై 5–4తో విజయాన్ని సాధించింది. పంజాబ్‌ తరఫున వ్లాదిమర్‌ కించెగషి్వలి (57 కేజీలు), వసిలిసా మర్జలిక్‌ (75 కేజీలు), ఇలియాస్‌ (65 కేజీలు), నిర్మలా దేవి (48 కేజీలు), జితేంద్ర (74 కేజీలు) విజయాలు సాధించారు.

హరియాణా జట్టులో అబ్దుసలామ్‌ గడిసోవ్‌ (97 కేజీలు), మర్వా అమ్రి (58 కేజీలు), మజోమెడ్‌ కుర్బనలివ్‌ (70 కేజీలు), సోఫియా మాట్సన్  (53 కేజీలు) గెలుపొందారు. విజేతగా నిలిచిన పంజాబ్‌కు రూ. కోటీ 90 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement