న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2 లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై మహారథి జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎన్‌సీఆర్ పంజాబ్ రాయల్స్ జట్టు 4–3 తేడాతో ముంబైపై గెలిచి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన ముంబై 53 కేజీ మహిళల విభాగాన్ని రద్దు చేయగా... పంజాబ్ 74 కేజీ పురుషుల విభాగాన్ని బ్లాక్ చేసింది.
పంజాబ్ రాయల్స్ జట్టు తరఫున వ్లాదిమర్ (57 కేజీ) 7–3తో రాహుల్‌పై, పంకజ్ రాణా (70 కేజీ) 9–8తో ప్రీతమ్‌పై, నిర్మలా దేవి (48 కేజీ) 4–0తో కరోలినా కస్టిలోపై, టోగ్రుల్ అస్గరోవ్ (65 కేజీ) 7–3తో వికాస్ కుమార్‌పై గెలుపొందారు. ముంబై జట్టులో ఎరీకా వీబ్ (75 కేజీ) 4–2తో వసిలిసా మార్జలిక్‌పై, సరిత 2–1తో ముంజు కుమారిపై, పావ్లో ఓలినిక్ 2–0తో కృషన్ కుమార్‌పై విజయం సాధించారు.
ముంబైకి మరో పరాజయం
Published Fri, Jan 6 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
Advertisement
Advertisement