న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో జైపూర్ నింజాస్ జట్టు తొలి పరాజయాన్ని చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై మహారథి జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 3–4 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టోర్నీ ఆరంభంలో రెండు వరుస పరాజయాలను మూటగట్టుకున్న ముంబై... ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ల్లో గెలిచి ఫామ్లోకి వచ్చింది. ముంబై మహారథి జట్టు తరఫున హసనోవ్ (74 కేజీలు), వికాస్ (65 కేజీలు), రాహుల్ అవారే (57 కేజీలు), ఎరీకా వీబ్ (75 కేజీలు) విజయం సాధించారు. జైపూర్ జట్టులో రీతూ ఫోగట్ (48 కేజీలు), బెట్జబెత్ (53 కేజీలు), ఎలిజ్బర్ (97 కేజీలు) గెలిచారు. మంగళవారం జరిగే మ్యాచ్లో ఎన్సీఆర్ పంజాబ్ రాయల్స్ జట్టు, యూపీ దంగల్తో తలపడుతుంది.