Problems of people
-
ప్రేమించడమే నిజమైన జాతీయవాదం
అమేథీ/రాయ్‌బరేలీ: దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన జాతీయవాదమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తూర్పు యూపీ ఇన్చార్జ్ ప్రియాంకా గాంధీ తెలిపారు. కానీ దేశంపై గౌరవం, దేశ ప్రజలపై ప్రేమ బీజేపీలో తనకు ఏమాత్రం కన్పించడం లేదన్నారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, అవినీతి, పేదరికం వంటి నిజమైన సమస్యలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ప్రియాంక విమర్శించారు. ప్రజల గొంతుకను, అభిప్రాయాలను అణచివేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ(సోనియా గాంధీ), అమేథీ (రాహల్ గాంధీ) లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయవాదానికి కొత్త నిర్వచనం.. ‘దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన దేశభక్తి అని నేను నమ్ముతా. కానీ బీజేపీ నేతలు చేస్తున్న పనుల్లో ఇది నాకెక్కడా కన్పించడం లేదు. జాతీయవాదం అంటే ప్రజలు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం. నిజమైన దేశభక్తి అంటే ప్రజల బాధలను సావధానంగా వినడం. అంతేతప్ప దేశంలోని వ్యవస్థలను, రాజ్యాంగబద్ధమైన సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చడం కాదు. మోదీ కావొచ్చు, మరే నేతయినా కావచ్చు.. ప్రజాగ్రహాన్ని పట్టించుకోకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఏటా 12 వేల మంది రైతుల ఆత్మహత్య.. ‘ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజలంతా ప్రేమించే భారత్‌ను కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.10,000–రూ.20,000 అప్పు తీర్చలేక ఏటా 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి వారి బ్యాంకు ఖాతాలకు రూ.2 వేలు పంపి మోసం చేయొచ్చని మోదీ భావిస్తున్నారు. ఇది నిజంగా రైతులను అవమానించడమే’ అని ప్రియాంక స్పష్టం చేశారు. నేను ఎవ్వరికీ భయపడను.. ‘నేను ఎవ్వరికీ భయపడను. పార్టీ ఆదేశాల మేరకే వారణాసి నుంచి నేను పోటీ చేయలేదు. యూపీలో పార్టీ పటిష్టత కోసమే ప్రచారం చేస్తున్నా. నా కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. అది వారి రాజకీయంలో భాగమే. స్కూలు టీచర్ లేక ప్రతిపక్ష నేత ఎవరైనా సరే వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే లక్ష్యంగా చేసుకుంటారు’ అని అన్నారు. పాములతో ప్రియాంక ఆటలు ప్రియాంక ప్రచారంలో భాగంగా కుచరియా గ్రామంలో పాములోళ్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె ఒక పామును చేతిలోకి తీసుకుని ఆడించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్త అని హెచ్చరించినప్పటికీ ‘ఏం పర్లేదు’ అని జవాబిచ్చారు. అక్కడి పాములోళ్లతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. తన తల్లి సోనియాగాంధీ హయాంలో రాయ్‌బరేలీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, 15 ఏళ్లుగా సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. రాయ్‌బరేలీలో సోనియా బీజేపీ అభ్యర్థి దినేశ్ప్రతాప్సింగ్తో పోటీ పడుతున్నారు. -
వేధిస్తున్న సిబ్బంది కొరత
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత వేధిస్తుంది. ఏడాది కాలంగా సరిపడా సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో చోటు చేసుకునే సమస్యలపై స్పందించే వారు కరువయ్యారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ, ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుల్స్, 21 మంది కానిస్టేబుల్స్ కలిపి మొత్తం 28 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 13 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా అరకొర సిబ్బందితో ఉన్న వారిపై పనిభారం పెరిగుతుందని పలువురు వాపోతున్నారు. స్టేషన్ పరిస్థితి ఇలా.. పోలీస్‌స్టేషన్ పరిధిలో 22 గ్రామపంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. కాగా స్టేషన్లో 21 మంది కానిస్టేబుళ్లకు ఉండాల్సి ఉండగా కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. 8 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 13 మందిలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఇటీవల క్రమశిక్షణ చర్యల కింద భువనగిరి హెడ్‌క్వాటర్స్‌కు అటాచ్ చేశారు. ఒకరు సీఐ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తుండగా, మరొకరు రోడ్డు ప్రమాదంలో గాయపడి సెలవుల్లో ఉన్నారు. వీరు పోను మిగిలిన 9 మందిలో ఒకరు రైటర్ కాగ, మరొకరు ప్రతిరోజు కోర్టు డ్యూటీకి వెళ్తారు. మరో ఇద్దరికి రెగ్యులర్‌గా స్టేషన్ వాచ్ డ్యూటీ ఉంటుంది. మిగిలిన ఐదుగురు సిబ్బంది మండలంలో శాంతిభద్రతల విధులతో పాటు, ఇటు ప్రముఖుల బందోబస్తు, హైవేపై చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహించాల్సి వస్తుంది. స్టేషన్లో ఉన్న ఇద్దరు హోంగార్డులు జీపు డ్రైవర్లుగా ఉన్నారు. స్టేషన్లో కనీస సిబ్బంది లేకపోవడంతో సమస్యల పరిష్కారం సైతం మందకోడిగా జరుగుతుందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సరిపడా సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. కనిపించని గ్రామ పోలీస్.. గతంలో ప్రతి గ్రామానికి ఓ పోలీస్ అధికారిని అధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. దీంతో పల్లెల్లో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా గ్రామాధికారులు పరిష్కరించే వారు. సిబ్బంది కొరతతో గ్రామ పోలీస్ అధికారులు లేకుండా పోయారు. ప్రతి చిన్న సమస్యకు ప్రజలు మండల కేంద్రంలోని స్టేషన్‌కు తప్పడం లేదు. -
సమస్యలు ఫుల్.. సౌకర్యాలు నిల్
సాక్షి, సింగరాయకొండ(ప్రకాశం): అభివృద్ధి అనేది ఆ కాలనీలో బూతద్దం వేసి వెతికినా కనిపించదు. నాలుగు తాటాకులతో వేసిన చిన్న చిన్న పూరి గుడిసెలు, ఏళ్ల తరబడి పూడుపోయిన మురుగు కాలువలు, మంచినీటి కోసం కిలోమీటర్ దూరం ప్రయాణం..ఇదీ ఊళ్లపాలెం ఎస్టీ కాలనీ దుస్థితి. ఏళ్ల తరబడి కనీస వసతులు కరువై కాలనీవాసులు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. మౌలిక వసతులు మృగ్యం.. ఎస్టీ కాలనీలో సుమారు 100 వరకు పక్కా గృహాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ఎస్టీలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు. వీరికి చదువు లేకపోవడంతో పాటు ప్రజాసాధికారిక సర్వేలో నమోదు కాక ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం లేదు. వీరు కూలినాలి చేసుకుని జీవిస్తుంటారు. తాగునీటికి తిప్పలు కాలనీవాసులు తీవ్ర తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి సుమారు అరకిలోమీటర్ దూరంలోని కొత్తపాలెం ఎన్టీఆర్ సుజల వాటర్‌ప్లాంట్ నుంచి 20 లీటర్ల క్యాన్ రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాడుకనీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నాలుగురోజులకు ఒకసారి మాత్రమే కుళాయిల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా కాలనీకి మాత్రం ట్యాంకర్లు సక్రమంగా రావడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీలోని మురుగుకాలువలను ఏళ్ల తరబడి పూడిక తీయలేదు. దీంతో మురుగునీరు పారే అవకాశం లేకుండా పోయింది. పూరి గుడిసెలే శరణ్యం.. బేస్మెంట్ దశలో నిలిచిపోయిన పక్కా గృహం కాలనీవాసులకు గతంలో సునామీ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పక్కా గృహాలు నిర్మించారు. ఇంకా చాలా మంది నేటికి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇటీవల సుమారు 30 మందికి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద పక్కా గృహాలు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.2.25 లక్షల ఆర్థిక సహాయం చేస్తోంది. అయితే వీరికి ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరికి ఇళ్లు కట్టిస్తానని ముందుకు వచ్చి కొంతమందికి పునాదుల కోసం గుంటలు తవ్వి వదిలేయగా, మరి కొంతమందికి బేస్మెంటు వేసి వదిలేశారు. అదేమంటే ఇటుకరాయి కావాలి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంతమొత్తం ఇచ్చుకునే స్థోమత లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని కాలనీవాసులు వాపోయారు. మరి కొంతమంది అయితే నివాసముంటున్న పూరి గుడిసె పూర్తిగా దెబ్బతినడంతో గత్యంతరం లేక స్వచ్ఛభారత్ కింద నిర్మించిన మరుగుదొడ్లలో నివాసం ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోనూ సమస్యలే కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు వాడుకనీటి కోసం నాలుగురోజులకు ఒకసారి వచ్చే రక్షితమంచినీటి పథకం కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. పాఠశాలలో బోరు మరమ్మతులకు గురైనా పట్టించుకునే వారే కరువయ్యారు. మరుగుదొడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇబ్బందులు తీర్చి కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
నెక్కొండలోని తండాకి తప్పని తంటాలు..
సాక్షి, చెన్నారావుపేట: హైటెక్ యుగంలా రోజు రోజుకూ పల్లెటూళ్లు సైతం పట్టణాల వసతులతో అభివృద్ధి చెందుతున్నాయి. కానీ నెక్కొండకు కూత వేటు దూరంలో ఉన్న ఆ తండా మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎన్నికల వేళ అభివృద్ధి చేస్తామని వచ్చిన ప్రజాప్రతినిధులు ఎన్నికల అనంతరం అటు వైపుగా కూడా చూడకపోవడంతో ఆ తండా అభివృద్ధికి నోచుకోలేదు. ఆస్పత్రికి వెళ్లాలన్నా, విద్యార్థులు చదువుకు పోవాలన్నా.. ఎరువులు, పురుగుల మందలు, కిరాణం సమాను తెచ్చుకోవాలన్నా వారి కష్టాలు అంతా ఇంతా కాదు. మా ఓట్లు వారికి కావాలే కానీ మా బాగోగులు వారికి పట్టడం లేదని తండా ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని సూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మంగల్ తండాలో 52 ఇండ్లు ఉన్నాయి. సుమారుగా 200 పైగా జనాభా ఉంది. మహిళా ఓటర్లు 43 మంది, పురుషులు 36 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి ఓట్లు వేస్తే తండాలో మౌళిక వసతులు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. ఓట్లు వేసుకున్నాక మళ్లీ కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరపల్లికి వెళ్లి రేషన్, తెచ్చుకోవాలన్న, గ్రామ పంచాయతీ పనుల కోసం వెళ్లాలన్నా ట్యూబ్‌ల సహాయంతో వాగు దాటుతున్నామని చెప్పారు. వ్యవసాయ పనులకు వెళ్లాలన్న వాగు దాటాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు.. సోలర్ వాటర్ ట్యాంకు కొన్ని పనిచేసి మరమ్మతులకు గురైంది. దానిని బాగు చేసే వారు లేరు. 30 కి.మీ తిరిగి రావాల్సిందే.. పిల్లలతో వాగు దాటలేని పరిస్థితి.. వాగు ఉధృతిగా ఉన్నప్పుడు రేషన్ సరుకులు, ఇతర పనులకు కోసం నెక్కొండ మీదుగా 30 కిలోమీటర్లు తిరిగి సూరుపల్లికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోడ్డు కూడా గుంతలతో ప్రమాదకరంగా ఉంది. బైక్, సైకిళ్లు, కాలినడకన మాత్రమే తండాకు పోవా ల్సి ఉంటుంది. నాలుగు చక్రాల వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. చదువుకోవడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యాలకు గురైనప్పుడు పరిస్థితి కష్టతరంగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఏది ఏమైన నెక్కొండ పట్టణానికి ఆమడ దూరంలో ఉండి కూ డా అభివృద్ధి చెందలేదంటే ప్రజాప్రతినిధులు, అ ధికారుల పనితీరు ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఒకే తండా రెండు గ్రామ పంచాయతీలు.. తండాలో 52 ఇండ్లు ఉన్నాయి. అందులో రోడ్డుకు ఓ వైపు సుమారుగా 40 వరకు ఇండ్లు సూరుపల్లి గ్రామ పంచాయతీలో ఉంటే మరో వైపు 12 ఇండ్లు మడిపల్లి గ్రామ పంచాయతీకి వెళ్లింది. ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. రోడ్డు బాగాలేదు.. కంట్రోల్ బియ్యం తెచ్చుకోవాలంటే సూరుపల్లికి పోవాలి. ఓటు వేయాలన్నా సూరుపల్లికి పోవాలి. జ్వరం వస్తే నెక్కొం డకు పోవాలి. కానీ రోడ్డు బాగాలేదు. ఆటోలు రావు. ఎవరికైనా బండి ఉంటే తీసుకెళ్తారు.. లేదంటే నడిచి వెళ్తాం. ఇప్పటికైనా పట్టించుకోని మాకు రోడ్డు వేయాలి.– బానోతు లక్ష్మీ, మంగల్ తండా వాసి వాగుపై వంతెన కట్టాలి.. మాకు సూరుపల్లి గ్రామ పంచాయతీ ఉంది. అక్కడికి పోవాలంటే వాగును ట్యూబ్‌లతో దాటుతున్నాం. ఇబ్బందిగా ఉంది. తండాలో కొన్ని ఇండ్లు మడిపెల్లిలో కలిపారు. అన్ని మడిపెల్లిలో కలపాలి. లేదంటే వాగుపై వంతెన నిర్మించాలి. తండాలో అన్నీ ఇబ్బందులే. ఎవరూ పట్టించుకోరు. ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారో వారికే ఓటు వేస్తాం. – గుగులోతు కున్నా, తండా వాసి -
ప్రజలతో మమేకమై...
సాక్షి, అగనంపూడి (గాజువాక) : జీవీఎంసీ 55వ వార్డు పెదగంట్యాడ మండల శివారు గ్రామాల్లో రాజ్య సభ సభ్యులు, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బైక్‌ర్యాలీగా వెళ్లి గ్రా మాల్లోని పెద్దలు, మహిళలు, గ్రామ నాయకులతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హా మీ ఇచ్చారు. మెడ్‌టెక్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన పర్యటన మదీనాబాగ్, ఇస్లామ్పే ట, పెదపాలెం, చినపాలెం, పిట్టవానిపాలెం, మరడదాసుడుపేట, దేవాడ, ఒనుముదొడ్డి, యల మంచిలిదొడ్డి, నమ్మిదొడ్డి, ఈసరవానిపాలెం, గొరుసువాని పాలెం, భూసదొడ్డి, పాలవలస, మురిభాయి, చేపలపాలెం (అప్పికొండ) సోమేశ్వరస్వామి గుడి, అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో వరకు సాగింది. ముందుగా మెడ్‌టెక్ భూ సమస్య, ఉపాధిపై విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎండీ దావూద్, పెదపాలెం, చినపాలెం గ్రామపెద్దలు మదీనా వ ల్లీ, బాదుల్, సన్నా, అన్వర్, ఆదిల్, బాబాలు వినతిపత్రాలు అందించారు. ఇస్లామ్పేటకు చెందిన 162 మంది ఎక్స్‌సర్వీస్ మెన్లకు చెందిన భూములను మెడ్‌టెక్ కోసం సేకరించి కనీసం నష్ట పరి హారం కూడా చెల్లించకపోడంపై స్థానికులు ఆవేదన చెందారు. సర్దార్ మాస్టర్, మహమ్మద్ ముస్తాఫాల సారధ్యంలో వీరు వినతిపత్రాన్ని అందించారు. మసీదుకు ట్రాన్స్ఫార్మర్, జనరేటర్లు కావాలని కోరడంతో విజయసాయిరెడ్డి స్పందించి జనరేటర్‌ను తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇస్లామ్‌పేట, పెదపాలెం, చినపాలెంకు చెంది న 5380 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములకు ఈనా మ్ చట్టం ప్రకారం పట్టాలిచ్చి రద్దుచేశారు. పాత రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. పిట్టవానిపాలెంలో ఎన్టీపీసీ ఫ్లయాస్ వల్ల పడుతున్న ఇబ్బందులను గ్రామస్తులు విజయసాయి రెడ్డికి పిట్టా సింహాచలం, బొట్ట అప్పలరెడ్డి, బట్టు వెంకటరెడ్డి, సావిత్రి విజయసాయిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. హిందూజా రైలు పట్టాల కోసం సేకరించిన భూములకు సంబంధించి నష్ట పరిహారం చెల్లించలేదని పి.నాగేశ్వరరావు, వి.వెంకటరావు, సోంబాబు, నౌషద్ తదితరులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. హుద్‌హుద్ తుఫాన్ వల్ల ఈసరపువానిపాలెంలో సామాజిక భవనం దెబ్బతిందని, నేటికీ వాటిని పునర్నించమంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఈసరపు వెంకటరావు, దాకారపు అప్పారావు, జగ్గారావు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. గొరుసువానిపాలెంలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యలపై మద్ది అప్పారావు, రమణ, అప్పలనాయుడు, కనకరెడ్డి, బసా రమణరెడ్డి తదితరులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరంఎంపీ విజయసాయిరెడ్డిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. భూసదొడ్డిలోని అమ్మవారి ఆలయంలో విజయసాయిరెడ్డి పూజలు చేసిన అనంతరం పాలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా హిందూజా పవర్‌ప్లాంట్ డ్రైనేజీ తవ్వడంతో వర్షాలకు ఇబ్బందులు పడుతున్నామని మద్ది పైడిరెడ్డి, రావాడ అప్పలరెడ్డి, వెంపాడ పైడిరెడ్డి తదితరులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మురుభాయి గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో భూములన్నీ స్టీల్‌ప్లాంట్ ఆధీనంలో ఉన్నాయి. గ్రామం అడుగుపెట్టాలాన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించాలని నాయకులు దేముడు, గౌరేష్, తాతారావు వేడుకున్నారు. అప్పికొండ (చేపలపాలెం)లోని సోమేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. స్టీల్‌ప్లాంట్ కలుషిత జలాలను సముద్రంలోకి వదిలేస్తుందని, శుద్ధి చేసి నీటిని వదలాల్సి ఉండగా, వ్యర్థ నీటినే వదులుతుండంతో స్థానికులు ¿¶ఆందోళన చెందుతున్నామని నాయకులు పంది అప్పారావు, దాసరి తాతారావు చెప్పారు. తరువాత అప్పికొండ దాసరిపేట, మద్దివానిపాలెంలో గ్రామాల్లో పర్యటించారు. వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, 55వ వార్డు సమన్వయకర్త బట్టు సన్యాసిరావు సార«ధ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయ్‌ప్రసాద్, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కళ్యాణి, జిల్లా నాయకులు బర్కత్ ఆలీ, పక్కి దివాకర్, రవిరెడ్డి, సీఈసీ సభ్యులు పైలా శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షుడు రాము నాయుడు, 56, 57, 60 వార్డుల అధ్యక్షుడు పూర్ణానందశర్మ, దాడి నూకరాజు, దాసరి రాజు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గెడ్డం ఉమ పాల్గొన్నారు. -
రూ. 500కు ట్రిప్పు నీళ్లు
వేములవాడ : వేములవాడలో భూగర్భ జలాలు అడుగంటిపోయి... చుక్కనీరు దొరకడం కష్టంగా మారింది. ఇండ్లలో ఉన్న బోర్లతో పాటు మున్సిపాలిటీ వారు వేసిన బోర్లు సైతం ఎండిపోతుండటంతో జలఘోష పెరిగిపోతుంది. ఎండాకాలమంతా ఎట్లా గడవాలంటూ జనం ఆందోళన చెందుతున్నారు. రూ. 500 వెచ్చించి ట్యాంకర్ నీళ్లు కొనుక్కొని అవసరాలు తీర్చుకుంటున్నారు. పట్టించుకోని పాలకులు నీటి కొరతపై పాలకులు పట్టించుకోకపోవడంతో కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఇంటిబోర్లు ఎండిపోయాయి. అర్ధరాత్రి వరకు పైప్‌లైన్ నీరు పట్టుకునేందుకు ఆరాటం తప్పడం లేదు. సుట్టపోళ్లు వస్తే ఇక నీళ్ల గోస చెప్పరాదు. వేసవి సెలవులు కొనసాగుతుండటంతో బంధుగణం రాక పెరిగిపోతుందని జనం చెప్పుకుంటున్నారు.మున్సిపాలిటీ వాళ్లు సరఫరా చేసే నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. రూ. 500కు ట్రిప్పు నీళ్లు నీళ్లు లేనిదే దినం గడవదు. అలాంటి నీళ్ల కోసం ఎములాడ జనం అష్టకష్టాలు పడుతున్నారు. ఇంటి అవసరాల కోసం నీళ్లు కావాలంటే రూ. 500 పెట్టి ట్యాంకర్ నీళ్లు కొనాల్సిందే. చిల్లరగా డ్రమ్మునీళ్లకు రూ. 50 చొప్పున హోటళ్లు, నిరుపేదలు, సామాన్య ప్రజానీకం కొనుక్కుంటున్నారు. జనవరి మాసం నుంచే నీటి పరిస్థితి ఇలా కొనసాగుతుందని జనం మొత్తుకుంటున్నారు. ఎటు చూసినా ట్యాంకర్లే.... భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో వేములవాడలో నీటి కొరత పెరిగిపోయింది. దీంతో ఇక్కడి ట్రాక్టర్ యజమానులు ఓ ట్యాంకర్ తయారు చేసుకుని నీటి వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇసుక రవాణాపై ప్రభుత్వం, అధికారులు కాస్త కట్టడి చేయడంతో నీళ్ల వ్యాపారం చేసుకున్నది మేలనుకుంటూ ఈ వంక చూస్తున్నారు. దీంతో వేములవాడలో ఇటీవల వందకు పైగా ట్యాంకర్లు రోడ్లపై కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బోర్ల వద్ద రూ. 100 చొప్పున నీటిని కొనుగోలు చేసి రూ. 500 ఒక ట్రిప్పు నీళ్లు అమ్మకాలు సాగిస్తున్నారు. అన్నీ వార్డుల్లో అవస్థలే... వేములవాడ పట్టణంలోని 20 వార్డులలో తాగు నీటి కొరత తీవ్రమైంది. అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు నీటి సరఫరాపై సరైన ప్రణాళికలు రూపొం దించడం లేదు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చుడే కానీ... మా బాధలు పట్టించుకున్న పాపాన పోవడం లేదంటూ బాహాటంగా ఆరోపిస్తున్నారు. తాగునీటి కోసం రూ. 30 లక్షల నిధులు కేటాయిస్తున్నామంటూ మున్సిపల్ సమావేశంలో తీర్మానించారు. ఇబ్బందులు తీరుస్తాం వేములవాడ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించాం. రూ. 30 లక్షలతో తాగునీటి సరఫరా చేసేందుకు ఇటీవలే తీర్మానించాం. అలాగే ఎల్ఎండీ, మానేరు డ్యాం నుంచి వచ్చే నీటిని పొదుపుగా వాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -
'అంతా ఆత్మస్తుతి పరనింద'
-
'అంతా ఆత్మస్తుతి పరనింద'
హైదరాబాద్: ఆత్మస్తుతి పరనిందలా టీడీపీ మహానాడు జరిగిందని వెస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ మహానాడులో వారి మాటలు గమనిస్తే టీడీపీ వదిలిపెట్టి వెళ్లే నాయకులను, కార్యకర్తలను నిలబెట్టుకోవాలనే తాపత్రయం కనిపించిందని చెప్పారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా.. ఊకదంపుడు ఉపన్యాసాలతో ముగించారని విమర్శించారు. ప్రతిపక్షాన్ని విమర్శించడమే మహానాడు ఉద్దేశమా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో మహానాడు పెడితే ప్రజలు తిరగబడతారని హైదరాబాద్‌లో పెట్టారని ఎద్దేవా చేశారు. -
సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
చిత్తూరు (సెంట్రల్) : ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలోని సమావేశమందిరం లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజావాణి పోర్టల్ యూజర్ నేమ్, పాస్‌వర్ట్‌లను అన్ని శాఖలకు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సమావేశంలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో చర్చించారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన ఇసుక పాలసీని అనుసరించి జిల్లాలో ఎంతమేర ఇసుక నిల్వలున్నాయి? నిర్మాణంలో ఉన్న భవనాలెన్ని ? వాటికి ఎంత ఇసుక అవసరం ? అనే అంశాలపై చర్చించారు. ఇసుక తవ్వకం ద్వారా భూగర్భజలాలకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయూ ? అని గనులు, నీటిపారుదల, భూగర్భజలశాఖ, డీఆర్డీఏ, డ్వామా సమన్వయంతో పరిశీలించి కొనుగోలుదారులతో ఎంఓయూలను రూపొందించాలన్నారు. అర్హమైన మహి ళా సంఘాలను గుర్తించి వాటి ద్వారా ఇసుక అమ్మకాలను ప్రారంభించే పనిని అక్టోబర్ 1 నుంచి చేపట్టాలన్నారు. జిల్లాలో మీ-సేవ, తహశీల్దార్ కార్యాలయం, ఎన్‌ఐసీల ద్వారా రేషన్‌కార్డుల నిమిత్తం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి, ఆ సంస్థ జిల్లా మేనేజర్ ను ఆదేశించారు. రేషన్‌కార్డుల్లో మార్పు లు, చేర్పులు, సవరణ, సౌకర్యాల కార్యక్రమాలపై, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై జిల్లాలోని కేబుల్ టీవీల్లో ప్రచారం చేపట్టాలన్నారు. ఆధార్ సీడింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పెన్షన్లు, ఇంటి మంజూరు, రేషన్‌కార్డు జారీకి అర్హులను గుర్తించాలన్నారు. ఈ నెల 19న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జిల్లాపర్యటనకు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శస్త్రచికిత్సలు, ఇతర చికిత్సలు ఎక్కడ బాగా జరుగుతాయో గుర్తించి అక్కడ డాక్టర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ నెల 27న కేంద్ర వికలాంగుల మంత్రి జిల్లాకు వస్తున్నారని, తిరుపతి ఇందిర మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వికలాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వికలాంగుల శాఖ ఏడీ, జిల్లా విద్యాశాఖాధికారి, ఎస్ఎస్ఏ పీఓ, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా పీడీలు సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవంతిని ఎక్కడెక్కడ ప్రారంభించనున్నారో నివేదికలు సమర్పించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.