ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ
మూడు నామినేషన్లు దాఖలు
అనంతపురం అర్బన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 9 నుంచి మూడు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి లక్ష్మీకాంతం తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్ నాలుగు సెట్లు, పయ్యావులు శ్రీనివాసులు ఒక సెట్టు, యాట వెంకటసుబ్బన్న ఒక సెట్టు మొత్తం ముగ్గురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారన్నారు. బుధవారం నామినేషన్లను స్క్రూటినీ చేస్తామని చెప్పారు. ఉపసంహరణకు ఈ నెల 19వ తేదీ చివరి రోజని, అదే రోజు మధ్యాహ్నం పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.