మూడో రోజు వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర ఇలా..
సాక్షి, తాడేపల్లి: సామాజిక సాధికారత రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజల స్పందన ప్రతిబింబిస్తోంది. సీఎం జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర, సభలకు పేదలు వెల్లువెత్తుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ వెంటే తాము అంటూ నినదిస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైఎస్ జగన్ తమకు మంచి చేశారని ప్రశంసిస్తున్నారు.ఇక, నేడు మూడో రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఉత్తరాంధ్రలో భీమిలి, కోస్తాంధ్రలో బాపట్ల, రాయలసీమలో పొద్దుటూరులలో జరుగనుంది.
ఉత్తరాంధ్రలో షెడ్యూల్ ఇలా..
►మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం
►12:45 గంటలకు మధురవాడలోని ప్రభుత్వ స్కూల్లో నాడు నేడు పనులను పరిశీలించనున్న పార్టీ నేతలు.
►2:30 గంటలకు భోగిపాలెం నుండి ర్యాలీ ప్రారంభం.
►మూడు గంటలకు తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద బహిరంగ సభ.
►సభకు హాజరుకానున్న పార్టీ రీజినల్ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు నేతలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో బస్సు యాత్ర
►మంత్రి అంజాద్ భాష, రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ యాత్రకు హాజరు
►మధ్యాహ్నం ఒంటి గంటకు వైవీఆర్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం
►3:15 గంటలకి బైక్ ర్యాలీ ప్రారంభం,
►సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ
కోస్తాంధ్రలో బాపట్లలో బస్సుయాత్ర
►చందోలు నుంచి బైకు ర్యాలీ ప్రారంభం
►కర్లపాలెం మీదగా బాపట్ల చేరుకోనున్న బస్సు యాత్ర
►అంబేద్కర్ బొమ్మ సెంటర్లో జరగనున్న బహిరంగ సభ