ఆధార్ అనుసంధానం 72 శాతం
ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యుత్ వినియోగదారులకు సంబంధించి ఇప్పటి వరకు 72 శాతం ఆధార్‌కార్డులను అనుసంధానం చేశారు. జిల్లాలో మొత్తం 7,25,610 విద్యుత్ సర్వీసులు ఉండగా వీటిలో 5,22,129 విద్యుత్ వినియోగదారులకు సంబంధించి ఆధార్ కార్డుల అనుసంధానం పూర్తయింది. అలాగే పులివెందుల డివిజన్ 81 శాతం ఆధార్‌కార్డుల అనుసంధానంతో జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండగా 76 శాతంతో ప్రొద్దుటూరు డివిజన్ రెండో స్థానంలో నిలిచింది.
అలాగే కడప డివిజన్ 74 శాతం, రాజంపేట 73, మైదుకూరు 66, రాయచోటి 60 శాతం లక్ష్యాన్ని సాధించాయి. ప్రొద్దుటూరు డివిజన్‌కు సంబంధించి 1,69,775 మంది విద్యుత్ వినియోగదారులకు గాను 1,28,914 మందికి సంబంధించిన ఆధార్ కార్డులను అనుసంధానం చేసినట్లు ఏఏఓ వేణుగోపాలరావు తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించి మాత్రమే కొంత వెనుకంజలో ఉన్నట్లు ఆయన తెలిపారు.