విద్యుదాఘాతంతో వృద్ధురాలి మృతి
వెలవలి(రాజుపాళెం):మండల పరిధిలోని వెలవలి గ్రామానికి చెందిన చీమల జయమ్మ (64) అనే వృద్ధురాలు మంగళవారం విద్యుదాఘాతంతో
మృతి చెందినట్లు ఎస్ఐ టి.సంజీవరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. తన ఇంటి వద్ద ఉన్న నీటి కొళాయికి అమర్చిన విద్యుత్ మోటరు నుంచి నీరు రాకపోవడంతో ఇనుప పైపుతో నోటితో ఊదుతుండగా విద్యుదాఘాతానికి
గురైంది. ఆమెను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ
సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.