produced
-
నానో కథ కంచికి!?
న్యూఢిల్లీ: లక్ష రూపాయల కారు అంటే చాలు నానో గర్తుకొస్తుంది. దీన్ని రతన్ టాటా మానసపుత్రికగా అభివర్ణిస్తారు. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నానో కారును ఆవిష్కరించారు. టూవీలర్ జర్నీకి ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటు ధరలో, సురక్షితమైన ప్రయాణానికి ఒక వెసులుబాటు అందించాలని భావించారు. అయితే ఏం లాభం. అంచనాలన్నీ తప్పాయి. టాటా మోటార్స్ కి ఇదో ఫెయిల్యూర్ వెంచర్‌గా మిగిలింది. ఒకే కారు తయారీ... ఇప్పుడు నానో కారు తన ప్రస్థానానికి ముగింపు పలకడానికి కుసుమంత దూరంలో ఉంది. జూన్ నెలలో కేవలం ఒకే ఒక నానో కారు తయారైంది. కంపెనీ గతేడాది ఇదే నెలలో 275 యూనిట్లను తయారు చేసింది. దేశీ మార్కెట్లో మూడు కార్లు మాత్రమే విక్రయమయ్యాయి. గతేడాది ఇదే నెలలో నానో విక్రయాలు 167 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ఎగుమతుల ఊసే లేదు. కానీ గతేడాది ఇదే నెలలో కంపెనీ 25 యూనిట్లను ఎగుమతి చేసింది. పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినప్పటికీ నానో కార్ల తయారీ నిలిపివేతపై కంపెనీ ఏ నిర్ణయం తీసుకోలేదు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నానోను 2019 తర్వాత కొనసాగించడం కష్టమే. దీని మనుగడకు కొత్త పెట్టుబడులు అవసరం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కీలకమైన మార్కెట్లలో కస్టమర్ డిమాండ్‌ను అందుకోవడానికి నానో తయారీని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆది నుంచీ అడ్డంకులే.. నానో కారును తొలిగా 2008 జనవరిలో జరిగిన ఆటోఎక్స్‌పో కార్యక్రమంలో ప్రదర్శించారు. 2009 మార్చిలో రూ.లక్ష ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. నానోకు ఆది నుంచీ అడ్డంకులే. దీన్ని మొదట పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసి తీసుకురావాలని భావించారు. అయితే ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించడం, ప్రతికూల రాజకీయ పరిస్థితుల వల్ల నానో తయారీ ప్రాజెక్టు గుజరాత్‌లోని సనంద్ ప్లాంటుకు మారింది. నానోను చౌక కారుగా ప్రమోట్ చేయడం తప్పైందని రతన్ టాటా ఒక సందర్భంలో అంగీకరించారు. -
కాటన్ సీడ్.. మరో ఫ్రాడ్
సాక్షి, గద్వాల : నడిగడ్డలో విత్తనోత్పత్తి కంపెనీల బాగోతాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఇటీవల ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి రైతుల భూములను లీజ్‌కు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించినట్లు బహిర్గతమైన విషయం విదితమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన అనుమతి లేని బీటీ–3 విత్తనాలను గద్వాల కేంద్రంగా వ్తితన కంపెనీలు సాగు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ పరిశోధన శాస్త్రవేత్తల బృందం, డీఎన్ఏ పరిశోధన సంస్థ నిర్ధారించినట్లు తేలడం గమనార్హం. గతనెల 18న కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అ«ధికారులు, విత్తన ధ్రువీకరణ సంస్థల ప్రతినిధులు జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 300 పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి ఢిల్లీ ల్యాబ్‌లో పరీక్షించగా బీటీ–3 విత్తనాల సాగు జరుగుతోందని గుర్తించినట్లు తెలిసింది. గత నెలలోనే ఓ గోదాంలో పట్టుబడిన ఒక కంపెనీకి చెందిన ఐదు శాంపిళ్లలో మూడింటిలో బీటీ–3 విత్తనాలు ఉన్నట్లు రాష్ట్ర, కేంద్ర పరిశోధన బృందం నిర్ధారించినట్లు సమాచారం. ఈ నివేదికను జిల్లా వ్యవసాయశాఖకు పంపించినట్లు తెలిసింది. కానీ ఆ శాఖ అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఇన్‌కం ట్యాక్స్ దాడులు మరువకముందే.. జోగుళాంబ గద్వాల విత్తన పత్తికి ప్రసిద్ధి. జిల్లాలో దాదాపు కోటి ప్యాకెట్ల పత్తి విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పన్నుల చెల్లింపులో తేడాలు రావడంతో జనవరి నెలలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు విత్తన కంపెనీలపై దాడులు చేశారు. గద్వాలలో రైతుల వద్దకు, ఆర్గనైజర్ల వద్ద నేరుగా విచారణ జరిపారు. రైతుల భూములను లీజుకు తీసుకుని విత్తనాలను సాగు చేస్తున్నట్లు విత్తన కంపెనీలు తప్పుడు పత్రాలను సృష్టించినట్లు ఐటీ శాఖ తనిఖీల్లో తేలింది. రెండు విత్తన కంపెనీలు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. గత నెలలో కేంద్ర బృందాల ఆరా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని గడ్డిమందును తట్టుకునే పత్తి రకాలు సాగు చేస్తున్నారా, గడ్డి మందు అయిన హెచ్‌టీ(హెర్బిసైడ్ టాలరెంట్) వంటి మందు వాడకంపై కేంద్ర బృందాలు గత నెల 18న జిల్లాలో ఆరా తీశాయి. భారత ప్రభుత్వం తరపున న్యూఢిల్లీలోని భారతీయ పరిశోధన సంస్థ, నాగ్‌పూర్ కేంద్ర పత్తి పరిశోధన సంస్థ, బయోటెక్నాలజీ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, తెలంగాణ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం జేడీ రాజారత్నం నేతృత్వంలోని బృందం జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలోని పెద్దపల్లి, బూడిదపాడు, అమరవాయి గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పత్తి పంటను పరిశీలించి గడ్డి మందు అయిన గ్రై ఫోసెట్, హెచ్‌టీ మందు వాడకంపై రైతులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కాటన్‌సీడ్ మిల్లుల్లో కాటన్ సీడ్ పత్తిని, విత్తనాలను, కెమికల్‌తో శుద్ది చేసిన విత్తనాల శాంపిళ్లను సేకరించి వాటిని పరిశోధనలకు పంపించారు. బీటీ–3పై నిషేధం ప్రస్తుతం దేశంలో సాగవుతున్న పత్తిలో బీటీ–1, బీటీ–2 విత్తనాలను రైతులు వినియోగిస్తున్నారు. ఇందులో కలుపు తొలగించేందుకు హెచ్‌టీ (హెర్బిసైడ్ టాలరెంట్) గడ్డి మందు స్ప్రే చేస్తే గడ్డితో పాటు పత్తి పంట కూడా చనిపోతుంది. దీంతో రైతులు ఎలాంటి మందులు వినియోగించకుండా కూలీలతో కలుపు తొలగించుకుంటుండగా ఎకరానికి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. బీటీ–3 విత్తనాలతో సాగు చేస్తే హెచ్‌టీ స్ప్రే తట్టుకునే శక్తి పత్తి పంటకు ఉంటుంది. అ యితే, విత్తనాలకు కేంద్ర వ్యవసాయ పరిశోదన సం స్థ అనుమతి ఇవ్వలేదు. ఈ రకంపై హెచ్‌టీ గడ్డి మందులు వాడితే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, పర్యావరణానికి ముప్పు ఉంటుం దని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, బీటీ– 3ను నిషేధించింది. కానీ కొన్ని కంపెనీలు ఈ విత్తనాలను సాగు చేయించి మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నా యనే సమాచారం అందగా కేంద్ర వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం దేశంలోని వివిధ ప్రాం తాలతో పాటు గద్వాలలో పర్య టించి శాంపిళ్లను సేకరించింది. ఈ క్రమంలోనే జిల్లాలో బీటీ–3 పండిస్తున్నట్లు గా గుర్తించినట్లు తెలిసింది. అయితే, దీనిని జిల్లా వ్యవశాఖ అధి కారి గోవింద్‌నాయక్ ధృవీకరించలేదు. -
94 లక్షల యూనిట్ల విద్యుత్ తయారీ
కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ )లోని ఏపీ జె¯ŒSకో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం నాటికి 94 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారు చేసినట్లు ఏపీ జెన్ కో డీఈ రఫి అహ్మద్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని సుమారు మూడు నెలల క్రితం ప్రారంభించామన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి డ్యాం నుంచి సుమారు 700 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోందన్నారు. ఒక రోజుకు 75 వేల యూనిట్ల విద్యుత్ తయారు అవుతోందన్నారు. గతంలో కోటి 80 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా అంత కంటే ఎక్కువనే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే లై¯ŒSకు కలపడం జరుగుతుందన్నారు. -
నేడు NIA ప్రత్యేక కోర్టుకు ఉగ్రవాదులు
-
ఈ చిన్నసినిమా విశేషాలెన్నో....
సమాజం పట్ల తమకూ బాధ్యత ఉందంటూ బాలీవుడ్ అగ్రతారలు ప్రియాంకా చోప్రా, ఫ్రిదా పింటో ముందుకొచ్చారు. 'గర్ల్ రైజింగ్ - వో పఢేగీ, వో ఉడేగీ' అనే షార్ట్ ఫిలింతో బాలికలను ప్రోత్సహించేందుకు వీరు నడుం కట్టారు. వీరి ప్రయత్నానికి బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు చేతులు కలపడం పలువురి ప్రశంసలందుకుంటోంది. ప్రియాంకా చోప్రా, ఫ్రిదాపింటో నిర్మాతలుగా కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గర్ల్ రైజింగ్ - వో పఢేగీ, వో ఉడేగీ షార్ట్ ఫిలిం రూపుదిద్దుకొంది. బాలికా విద్య ప్రచారానికి, బాలికలు చదువుకుంటే వారికి కలిగేప్రయోజనాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఆస్కార్ అవార్డు విజేత రిచర్డ్ ఇ.రాబిన్స్ దర్శకత్వంలో రూపొందిన ఇంగ్లీషు మూవీకి హిందీ వెర్షన్ ఇది. ఈనెల 29న రక్షా బంధన్ సందర్భంగా స్టార్ చానెల్లో ప్రసారం కానుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానంతో మొదలయ్యే ఈ డాక్యుమెంటరీలో స్వయంగా ప్రియాంక, ఫ్రిదాకూడా నటించారు. వీరితోపాటు నందితాదాస్, మాధురీ దీక్షిత్, సుస్మితా సేన్, ఆలియా భట్, పరిణీతి చోప్రా, కరీనా కపూర్ కనిపించనున్నారు. బాలికా విద్య ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా ఈ షార్ట్ మూవీ రూపొందించామని నిర్మాతలు ప్రియాంక, ఫ్రిదా ఫింటో తెలిపారు. గత జూన్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిసి తమ సినిమా గురించి వివరించినపుడు ఆయన చాలా సంతోషించారని నటి ఫ్రిదా చెప్పింది. అంతేకాదు రక్షాబంధన్ సందర్భంగా లాంచ్ చేయాలని ఆయనే తమకు సలహా ఇచ్చారంది. మరోవైపు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారట. తమ శాఖ పథకమైన బేటీ బచావో, బేటీ పఢావో కి తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం బాగుందని కొనియాడినట్లు తెలిపారు ఫ్రిదా. గర్ల్ రైజింగ్‌ను ప్రారంభించిన దగ్గరనుంచి ఇందులో తాను భాగమవుతున్నానని, ఈ శక్తిమంతమైన ఆలోచన భారత్‌కు విస్తరింపజేస్తే ఎంతో గౌరవం పొందుతానని, దీనికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని ప్రియాంక చెప్పారు. ఎక్కువ మంది బాలికలు విద్యావంతులైతే మొత్తం భారతదేశం ఎంతో అభివృద్ధిని సాధించ గలుగుతుందని అన్నారు.