product quality
-
మీ హక్కులను గుర్తించండి
కాకినాడ లీగల్: కొనుగోలు చేసిన వుస్తువు, సేవల (ఆస్పత్రి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సేవలు) పూర్తి స్థాయి ప్రయోజనం పొందే హక్కు వినియోగదారుల చట్టం-1986 ప్రకారం కొనుగోలుదారుడికి ఉంది. లోపాలున్నా, సమస్యలు ఏర్పడినా సంబంధిత సంస్ధ నష్టపరిహారం చెల్లించాలి. లేకుంటే వినియోగదారులఫోరాన్ని ఆశ్రయించవచ్చు. ఫిర్యాదు చేయడం ఇలా... నష్టపోయినవారు వినియోగదారులఫోరం హెల్ప్‌డెస్క్ సలహా మేరకు కేసు దాఖలు చేయవచ్చు. రసీదు కీలకం. ఆయా ఆధారాలతో కనీస రుసుము చెల్లించి ఫిర్యాదు చేయాలి. –వ్యాపారి లేదా డీలరు ద్వారా సష్టపోతే ఫిర్యాదు చేయవచ్చు. –వస్తువులో లేదా ఉత్పత్తిలో లోపాలు ఉన్నా, సేవల విషయంలో డీలర్లు ఆశ్రద్ధ చేసినా, అధిక ధర వసూలు చేసినా, మరే కారణాలతో నష్టపోయినా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. నోటిసులో ఏం ఉండాలంటే... –ఉత్పత్తి సర్వీస్ ప్రొవైడర్ లేక కంపెనీ చిరునామా రాయాలి. –‘విషయం’లో ఫిర్యాదు ఇచ్చే ముందు నోటీసుగా పేర్కొనాలి. –కొన్న వస్తువు లేదా సర్వీస్ వివరాలు ఇవ్వాలి. (క్యాష్ మెమో నంబరు, తేదీ). –సంస్ధ ఇచ్చిన వారంటీ లేదా గ్యారంటీ వివరాలు తెలపాలి. –వస్తువు లోపాన్ని, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను తెలపాలి. –ఇబ్బందులపై ఎవరికి, ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారో తెలపాలి. –స్పందించడానికి సంస్థకు 15–30 రోజుల గడువు ఇవ్వాలి. –కొన్న వస్తువుకు పుల్ అమౌంట్ కోరితే దానికి 18 శాతం వరకూ వడ్డీ కూడా కోరవచ్చు. –చివరిగా వినియోగదారుని పేరు, అడ్రస్ ఇవ్వాలి. నోటీసు పంపే విధానం.. –పంపిన నోటీసు సంస్ధకు చేరినట్టు మీ వద్ద ఆధారం ఉండాలి. –అందుకు నోటీసును అక్నాలెడ్జ్మెంట్ డ్యూ పోస్ట్, కొరియర్, హ్యాండ్ డెలివరీ విత్ ప్రూఫ్ పద్ధతుల్లో పంపవచ్చు. ఎలా పంపినా నోటీసు పంపినట్టు ఆధారం ఉండాలి. దానిని కోర్టులో ఇవ్వాలి. –సదరు సమస్యపై చేసిన ప్రయత్నాలు, ఎవరెవరిని సంప్రదించారనే వివరాలను జిరాక్స్ పత్రాలుగా నోటీసుకు జత చేస్తే మంచిది. ఫోరం పనితీరు... నష్టం రూ.20 లక్షల వరకు అయితే జిల్లా వినియోగదారుల ఫోరంను, రూ.20లక్షల నుంచి రూ.కోటి వరకూ అయితే రాష్ట్ర ఫోరాన్ని ఆపైన అయితే ఢిల్లీలోని జాతీయ ఫోరాన్ని ఆశ్రయించాలి. ఫీజు వివరాలు.. వినియోగదారుల ఫోరంలో కేసుకు రూ.లక్ష (వస్తువు విలువ) వరకు రూ.100, రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు రూ.200, రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు రూ.400, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు రూ.500 ఫీజు చెల్లించాలి. నేరుగా లేదా న్యాయవాది ద్వారా ఫోరంను ఆశ్రయించవచ్చు. ఫోరం ఎక్కడ.. కాకినాడ, రాజమండ్రి కోర్టుల్లో జిల్లా ఫోరాలు ఉన్నాయి. వినియోగదారుల బాధ్యత –కొనుగోలు చేసే వస్తువుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి. –మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్త వహించాలి –నాణ్యతలో రాజీ వద్దు ఆఫర్ల విషయంలో పరిశీలన చేయాలి. ప్రతి కొనుగోలుకూ రసీదు, వారంటీపై సంతకం, స్టాంపు ఉండాలి. హెల్ప్ డెస్క్‌ను ఉపయోగించుకోండి: వినియోగదారుల ఫోరంలోని హెల్ప్‌డెస్క్‌ను ఆశ్రయిస్తే ఫిర్యాదు చేసే విధానాన్ని తెలియజేస్తారు. ఫిర్యాదు ఇచ్చి సెల్‌నంబర్ ఇస్తే కేసు వివరాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. - ఎస్ భాస్కరరావు,వినియోగదారుల ఫోరం మెంబర్ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తాం.. వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వినియోగదారుల చట్టం గురించి గ్రామీణ ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు. ప్రసార మాధ్యమాలు, స్వచ్ఛంద సంఘాలు ద్వారా గ్రామీణ ప్రజల వినియోగదారుల్ని చైతన్య పరిచేందుకు కృషి చేయాలి. - ఎ. రాధాకృష్ణ, వినియోగదారుల ఫోరం, అధ్యక్షుడు -
సెలబ్రిటీ కాదు కంప్లీట్ మ్యాన్
యాడ్స్.. ప్రొడక్ట్ క్వాలిటీని ఎంతవరకు ప్రొజెక్ట్ చేస్తున్నాయో తెలియదు కానీ మారిన తరంలోని మానవ సంబంధాలను మాత్రం కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా మీసం మెలేసే మగాడు సున్నితంగా మారిన వైనానికి అద్దం పడుతున్నాయి!. ఓరియో బిస్కట్స్ నాన్న.. భారత్ మ్యాట్రిమోనీ భర్త.. క్యాడ్బరీ డెయిరీ మిల్క్ స్నేహితుడిని కలుపుకొని రేమండ్స్ ది కంప్లీట్ మ్యాన్ని ఆవిష్కరిస్తోంది! యాడ్స్‌లోనే కాదు ఇంట్లోనూ అలాగే ఉన్న ఈతరం పురుషుడి గురించి కథనం.. నిజమైన సంఘటనలే ఊపిరి సెలబ్రిటీలే కాదు కంప్లీట్ మ్యాన్‌కి అద్దంపట్టే సామాన్యూలూ ఉన్నారు. సికింద్రాబాద్‌కి చెందిన కోమల్‌రెడ్డి నేటి తరం పురుషుడికి ప్రతినిధి. ఆయన గురించి వాళ్లావిడ శిరీష ‘నాకు డిగ్రీ అవగానే పెళ్లయింది. పీజీ చేయాలని ఉండింది. కోమల్‌తో చెబితే ఓకే అన్నాడు. ఎంట్రెన్స్ రాస్తే సీట్ వచ్చింది. ఫస్టియర్ అయేటప్పటికి కన్సీవ్ అయ్యాను. సెకండియర్ ఎగ్జామ్స్ అప్పటికి చంటిబిడ్డ తల్లిని. రోజుల బిడ్డను పట్టుకొని ఎగ్జామ్స్ రాయడమా అని భయపడ్డాను. కోమల్ ధైర్యం చెప్పి పరీక్షలకు రెడీ చేశాడు. నేను ఎగ్జామ్నేషన్ హాల్లో.. తను బయట పాపను ఎత్తుకొని పచార్లు.. ఇలాంటి నేచర్ ఉన్న మగవాళ్లను ఇటు మా ఇంట్లోను, అటు వాళ్లింట్లోనూ చూడలేదు’ అంది. ‘శిరీష నా కోసం కొన్నింటిని శాక్రిఫైస్ చేసినప్పుడు ఆమె లైఫ్ యాంబిషన్ కోసం నేనెందుకు చూయకూడదని అనుకున్నాను. మా పాప అనన్య విషయంలో తల్లిగా తనకెంత బాధ్యత, ప్రేమ ఉన్నాయో, తండ్రిగా నాకూ అంతే బాధ్యత, ప్రేమ ఉన్నాయి’ అంటాడు కోమల్. యాడ్స్ ప్రభావం.. యాడ్స్‌కి రియల్ ఘటనలు ప్రేరణ ఇచ్చినట్టే యాడ్స్ ప్రభావమూ తన మీదుందంటాడు బాలశేఖర్. ‘సినిమాలు మగవాళ్లలోని సున్నితత్వాన్ని చంపేస్తుంటే ఇలాంటి యాడ్స్ మరింత సెన్సిటైజ్ చేస్తున్నాయి. నా పెళ్లయి తొమ్మిది నెలలైంది. నా భార్య శ్రావణి.. మంచి ఫ్రెండ్. ఏ విషయంలోనూ సొంత నిర్ణయం తీసుకోను. నేను మల్టీమీడియా చేశాను. తను బీటెక్. ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్‌చేశాం. ఆడవాళ్లు సెకండ్ జెండర్కాదు.. మగవాళ్లతో ఈక్వల్. ఈ భావన నాలో కలగడానికి నాకున్న రీడింగ్ హాబీ ఒక కారణమైతే.. రేమండ్స్లాంటి యాడ్సూ కారణమే’ అంటాడు బాలశేఖర్. ‘నిజమే.. శేఖర్ భర్తగా కన్నా ఓ ఫ్రెండ్‌లా ఉంటాడు. అన్నీ షేర్ చేసుకుంటాను’ అంటుంది బాలశేఖర్ భార్య శ్రావణి. -
వాయనం: బేరమాడటం తప్పు కాదు!
ఏ వస్తువైనా కొనేటప్పుడు బేరమాడటం మామూలే. అయితే కస్టమర్లలో బేరమాడే నైజం రానురాను తగ్గిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. బేరమాడటాన్ని చాలామంది నామోషీగా ఫీలవుతున్నారట. నిజానికంత ఫీలవ్వాల్సిన అవసరం లేదు. మనం బేరమాడతామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యాపారస్తులు తమ ఉత్పత్తులకు వెలను నిర్ధారిస్తారు. కాబట్టి ధైర్యంగా బేరమాడవచ్చు. కాకపోతే ఎప్పుడు, ఎక్కడ, ఎలా బేరమాడాలన్నది తెలుసుకోవాలి. కాస్త ట్రై చేస్తే బేరమాడే కళ అబ్బేస్తుందిలెండి! రోడ్ల పక్కన అమ్మేవాళ్ల దగ్గర గీచి గీచి బేరమాడతాం. అదే మాల్స్‌లో అయితే అడిగినంత కిక్కురుమనకుండా ఇచ్చేసి వస్తాం. నిజానికి చిరు వ్యాపారస్తులు మనకి పెద్దగా టోకరా వేయరు. మాల్స్‌లోనే మన పర్సుకు చిల్లు పడుతుంది. కాబట్టి అక్కడే బేరమాడాలి. తగ్గించమంటే వాళ్లేమనుకుంటారో అన్న సంశయాన్ని మొదట వదిలేయండి. ఒక్కచోట వెల చూసి నిర్ణయానికి వచ్చేయడం ఎప్పుడూ మంచిది కాదు. ఏదైనా కొనాలనుకున్నప్పుడు రెండు మూడు చోట్ల విచారించండి. దాన్నిబట్టి ఆ వస్తువు వెల ఎంత ఉండవచ్చో తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని ఎక్కడ కొన్నా మీరు ఆ వెలకే ఇవ్వమని ధైర్యంగా అడగవచ్చు. కంపెనీ లేబుల్స్ ఉండేవాటిని బేరమాడటం సరికాదు. కాగితాల మీద రేట్లు వేసి అతికిస్తారే... అలాంటివి దుకాణదారుల సొంత రేట్లై ఉంటాయి. అక్కడ ఓ పట్టు పట్టవచ్చు. బేరమాడాలి కదా అని నోటికొచ్చినంత చెప్పేయడం కరెక్ట్ కాదు. వస్తువు నాణ్యత, తయారీ ఖర్చు, ఆవశ్యకత, డిమాండ్ వంటి పలు అంశాలను బట్టి రేటును నిర్ధారిస్తారు. కాబట్టి మనం కూడా వాటన్నిటినీ అంచనా వేసుకునే అడగాలి. సాధారణంగా ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా వస్తువుని కొనం. ఒకవేళ బాగా నచ్చి కొనాలని అనుకుంటే... దాని డ్యామేజీకి రేటు తగ్గించమని అడిగే హక్కు కస్టమర్‌కి ఉంటుందన్న విషయం మనసులో ఉంచుకోండి. ఒక్కోసారి ఎంత అడిగినా దుకాణదారుడు ఒప్పుకోడు. దాంతో అంత పెట్టడం అనవసరం అని తెలిసినా మనమే తగ్గిపోతుంటాం. అలా చేయనక్కర్లేదు. మనకి వస్తువు ఎంత అవసరమో, వ్యాపారస్తులకి మనమూ అంతే అవసరం. కాబట్టి మీ మాట నెగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అన్నిటికంటే ముఖ్యమైనది... బేరమాడేటప్పుడు కంఠంలో కాన్ఫిడెన్స్ ఉండాలి. తెలిసీ తెలియనట్టుగా, అడిగీ అడగనట్టుగా నసిగితే... ఆ వస్తువు మీదగానీ, దాని వెల మీద గానీ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లా డుతున్నామని షాపువాడు కనిపెట్టే స్తాడు. ఇక మన మాట చచ్చినా వినడు! మ్యాంగో స్ల్పిటర్ వేసవి అనగానే మామిడిపళ్ల ఘుమఘుమలు గుర్తొస్తాయి. వేసవి అయ్యేవరకూ ప్రతి ఇంటా మామిడి విందులే. ముఖ్యంగా దాహార్తిని తీర్చేందుకు చలచల్లని మ్యాంగో జ్యూస్‌ని సేవించాల్సిందే. జ్యూస్ అంటే చేస్తాం గానీ అందులోని టెంకను తీయడం మాత్రం భలే విసుగు తెప్పిస్తుంది. ముక్కలు ముక్కలుగా కోసి టెంకను వేరు చేయడం పెద్ద పని. అయితే అది ఒకప్పుడు... ఇప్పుడు మ్యాంగో స్ప్లిటర్ వచ్చేసింది. దీనిమీద మామిడిపండును పెట్టి ఒక్కసారి ప్రెస్చేస్తే చాలు... ఇదిగో, ఇలా టెంక వేరుపడిపోతుంది. దీని అసలు ధర 595 రూపాయలు. అయితే కొన్ని ఆన్లైన్ స్టోర్స్‌లో 380, 420, 480... ఇలా రకరకాల రేట్లలో దొరకుతోంది.