వాటర్ గ్రిడ్ సమావేశానికి కేసీఆర్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తాగునీటి అందించే పథకం కోసం బుధవారం వాటర్గ్రిడ్పై సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 600కు పైగా ఇంజనీర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
నీటిపారుదల నిపుణుల నుంచి అభిప్రాయాలను, సలహాలను తెలంగాణ ప్రభుత్వం సేకరించనుంది. ఈ సమావేశం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జరిపిందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాటర్ గ్రిడ్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నారు.