భౌతిక దాడులకు పాల్పడుతున్నారు
హైదరాబాద్ : ప్రజా సంఘాలు పిలుపుతో ఛలో అసెంబ్లీకి బయలుదేరిన వారిపై తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రొ. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రొ.లక్షణ్ మాట్లాడుతూ...అరెస్ట్ అయిన వారిపట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ప్రొ.లక్ష్మణ్ అందోళన వ్యక్తం చేశారు. ఛలో అసెంబ్లీలో భాగంగా ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు కాచిగూడ, డబీర్‌పుర, మలక్‌పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో ప్రొ.లక్ష్మణ్‌పై విధంగా స్పందించారు.