గురుప్రసాద్ ఇంట్లో పోలీసుల తనిఖీ
హైదరాబాద్: కన్నబిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రొఫెసర్ గురుప్రసాద్ కేసు విచారణలో భాగంగా బుధవారం అల్వాల్‌లోని ఆయన నివాసాన్ని, మేడ్చల్‌లోని ఓపెన్ ప్లాట్‌ను పోలీసులు తనిఖీ చేశారు. గురుప్రసాద్ ఇంట్లో నుంచి డైరీ స్వాధీనం చేసుకున్నారు. మొదట చిన్నారుల జాడ తెలియకపోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు వారు హత్యకు గురికావడంతో హత్య కేసుగా సెక్షన్ మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలాగే, చిన్నారులను పూడ్చి పెట్టడానికి గొయ్యి తవ్విన కూలీల గురించి వాకబు చేస్తునానరు. గురుప్రసాద్ ఫోన్ కాల్స్ డేటాను కూడా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు.