professor lakshmi
-
ప్రొఫెసర్ లక్ష్మికి బెయిల్ మంజూరు
గుంటూరు లీగల్: గుంటూరు ప్రభుత్వ వైద్యశాల పీజీ వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ వెన్నెలగంటి ఆది ఆంజనేయ లక్ష్మికి బెయిల్ మంజూరు చేస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి జి.గోపీచంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ లక్ష్మికి పాస్‌పోర్టు ఉంటే దాన్ని సంబంధిత కోర్టులో అందజేయాలని న్యాయమూర్తి షరతు విధించారు. కేసు దర్యాప్తు పూర్తయిందని చార్జిషీటు కూడా సంబంధిత కోర్టులో దాఖలు చేశారని, దీంతో పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. -
ప్రొఫెసర్ లక్ష్మికి 29 వరకు రిమాండ్
ఈ కేసులో అరెస్టయిన మరో నలుగురికి బెయిల్ మంజూరు సాక్షి, గుంటూరు: డాక్టర్ సంధ్యారాణి మృతి కేసులో నిందితురాలుగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ వెన్నెలగంటి ఆది ఆంజనేయలక్ష్మికి ఈ నెల 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. అలాగే మంగళవారం ఆమెతో పాటు అరెస్టరుు న భర్త డా. విజయసారథి, కొడుకు భార్గవ్ కిరణ్, బెంగళూరులో వీరికి ఆశ్రయమిచ్చిన కామర్తి ప్రవీణ్‌కుమార్, వియ్యంకుడు యలవర్తి ధన్వంతరావులకు మాత్రం మొబైల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ సుధ షరతులతో కూడిన బెరుుల్ మంజూరు చేశారు. సంధ్యారాణి ఆత్మహత్యకు తనకెలాంటి సంబంధం లేదని ప్రొ. లక్ష్మి మంగళవారం పోలీసుల సమక్షంలో మీడియాకు చెప్పారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, రిటైర్డ్ జడ్జి నాగేశ్వరరావు ఇచ్చిన తప్పుడు సలహాతోనే పరారయ్యామని లక్ష్మి భర్త విజయసారథి తెలి పారు. వెంటనే బెరుుల్ ఇప్పిస్తామని చెప్పడంతో ఈ నిర్ణ యం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అరుుతే విజయసారథి ఇందుకు భిన్నంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మాజీ జడ్జి నాగేశ్వరరావుతో పాటు తమ న్యాయవాది నర్రా శ్రీనివాసరావులు తమను పారిపొమ్మన్నట్లు బలవంతంగా పోలీసు లు చెప్పించారన్నారు. పోలీసులకు భయపడి చెప్పానే తప్ప తమను వారు పారిపొమ్మనలేదన్నారు. తాను ఈ నెల 6 నుంచి పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నట్లుగా భార్గవ్ కిరణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి స్టేట్మెంట్లను మొబైల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ సుధ నమోదు చేశారు. రెండో ముద్దారుు తేళ్ల హరిబాబు రిమాండ్‌లో ఉన్న సంగతి విదితమే. పోలీసుల జాప్యం వల్లే నిందితులు తప్పించుకున్నారు అంతకుముందు గుంటూరులో లక్ష్మితో పాటు నిందితులు విజయసారథి, భార్గవ్కిరణ్, ప్రవీణ్‌కుమార్, ధన్వంతరావులను ఐజీ సంజయ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. సంజయ్ మాట్లాడుతూ.. కేవలం ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి చనిపోరుునట్లుగా దర్యాప్తులో నిర్ధారణ అరుు్యందని తెలిపారు. సంధ్యారాణి సూసైడ్ నోట్‌తో పాటు సాక్ష్యుల స్టేట్మెంట్లను ఆధారాలుగా సేకరించామన్నారు. మొదట్లో పోలీసులు చేసిన జాప్యం వల్లే నిందితులు తప్పించుకున్నారని చెప్పారు. ఐదు రాష్ట్రాలు.. 16 ప్రాంతాలు నిందితులైన లక్ష్మి దంపతులు 22 రోజులుగా 5 రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో తిరిగారని, వీట న్నింటిని ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొని 8 ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా వెతుకులాట జరిపామన్నారు. ముందుగా గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు వెళ్లిన నిందితులు అక్కడ్నుంచి పాండిచ్చేరి, చెన్నై, తిరుపతి.. అటు నుంచి హైదరాబాద్‌కి వెళ్లారని చెప్పారు. మళ్లీ అక్కడ్నుంచి మహారాష్ట్రలోని షిరిడీ, శనిసింగనాపూర్, పండరీపురం, షోలాపూర్ వెళ్లి తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్లు వెల్ల్లడించారు. అక్కడ్నుంచి కర్నూలు, మంత్రాలయం, అనంతపురం మీదుగా బెంగళూరు, మైసూర్ వెళ్లారని చెప్పా రు. చివరకు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో బెంగళూరు లో ఉన్న విజయసారథి స్నేహితుడు ప్రవీణ్‌కుమార్ ఇంట్లో లక్ష్మి దంపతులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరికి సహకరించిన వారందర్నీ అరెస్ట్ చేస్తామని ఐజీ స్పష్టం చేశారు. పోలీసు బృందాలకు రివార్డులు నిందితులను అరెస్టు చేసిన పోలీసు బృందాలను ఐజీ సంజయ్ అభినందించి రివార్డులు ప్రకటించారు. గుంటూరు అర్బన్ పోలీసు కంట్రోల్ రూం సీఐ హైమారావు, నెల్లూరు జిల్లా వాకాడ సీఐ అక్కేశ్వరరావు, చిలకలూరిపేట రూరల్ సీఐ సురేష్‌బాబు, కొల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు, గుంటూరు అర్బన్ సీసీఎస్ ఎస్సై వీరేంద్ర, ఈపూరు ఎస్ఐ ఉజ్వల కుమార్‌లతో పాటు, గుంటూరు అర్బన్ ఐటీ కోర్ సీసీలు బాలాజీ, సీహెచ్ రాములకు రివార్డులు అందించారు. -
ప్రొఫెసర్ లక్ష్మీ అరెస్ట్ కాకుండా యత్నాలు
-
నాపై కేసును కొట్టేయండి
హైకోర్టులో ప్రొఫెసర్ లక్ష్మి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: గైనకాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, దీనిని కొట్టేసేంత వరకు ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ ఆమె గురువారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నగరంపాలెం ఎస్‌హెచ్‌వో, సంధ్యారాణి భర్త డాక్టర్ సి.హెచ్.రవిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. -
ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటీషన్ కొట్టివేత
సాక్షి, గుంటూరు : వేధింపులు తట్టుకోలేక గైనకాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితురాలైన గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మూడో అదనపు జిల్లా న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. గతనెల 24వ తేదీ రాత్రి నుంచి ప్రొఫెసర్ లక్ష్మి పరారీలో ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రొఫెసర్ లక్ష్మికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె తరుఫు న్యాయవాది గత నెల 29న గుంటూరు మూడో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న మూడో అదనపు జిల్లా జడ్జి సత్యశ్రీ ప్రొఫెసర్ లక్ష్మి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చారు. -
జీజీహెచ్‌లో జూడాల ఆందోళన ఉధృతం
ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసే వరకు ఆందోళన ఆపేది లేదన్న జూడాలు సాక్షి, గుంటూరు: పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. శుక్రవారం నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరించి జూడాలు సమ్మె కొనసాగిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేయాని నినాదాలు చేశారు. మరోవైపు ప్రొఫెసర్ లక్ష్మి జాడ వారం నుంచి తెలియకపోవడంతో పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరుగుతోంది. జూడాలు అత్యవసర విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు కూడా గంటపాటు వీరికి మద్దతుగా నిలవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం నుంచి పారా మెడికల్ సిబ్బంది కూడా జూడాలకు మద్దతు తెలియజేస్తామనడంతో జీజీహెచ్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అర్బన్ ఎస్పీ చర్చలు: గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు వేర్వేరుగా జూడాలతో సమావేశమై చర్చలు జరిపారు. అయినా జూడాలు సమ్మె విరమించేది లేదని, అత్యవసర వైద్య సేవలకు సైతం హాజరుకాబోమని తేల్చి చెప్పారు. వారి ఆందోళనకు వైఎస్సార్సీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మద్దతు తెలిపారు. -
కొనసాగుతున్న మెడికోల ఆందోళన
-
కొనసాగుతున్న మెడికోల ఆందోళన
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికోల నిరసనల పర్వం కొనసాగుతోంది. ప్రొఫెసర్ లక్ష్మీ వేధింపులు తాళలేక సంధ్యారాణి అనే ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పటి వరకు ప్రొఫెసర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా.. ఈ రోజు కూడా ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఘటన జరిగి ఆరు రోజులైనప్పటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు.