
ప్రొఫెసర్ లక్ష్మికి 29 వరకు రిమాండ్
ఈ కేసులో అరెస్టయిన మరో నలుగురికి బెయిల్ మంజూరు
సాక్షి, గుంటూరు: డాక్టర్ సంధ్యారాణి మృతి కేసులో నిందితురాలుగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ వెన్నెలగంటి ఆది ఆంజనేయలక్ష్మికి ఈ నెల 29 వరకు కోర్టు రిమాండ్ విధించింది. అలాగే మంగళవారం ఆమెతో పాటు అరెస్టరుు న భర్త డా. విజయసారథి, కొడుకు భార్గవ్ కిరణ్, బెంగళూరులో వీరికి ఆశ్రయమిచ్చిన కామర్తి ప్రవీణ్‌కుమార్, వియ్యంకుడు యలవర్తి ధన్వంతరావులకు మాత్రం మొబైల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ సుధ షరతులతో కూడిన బెరుుల్ మంజూరు చేశారు. సంధ్యారాణి ఆత్మహత్యకు తనకెలాంటి సంబంధం లేదని ప్రొ. లక్ష్మి మంగళవారం పోలీసుల సమక్షంలో మీడియాకు చెప్పారు.
చట్టంపై తమకు గౌరవం ఉందని, రిటైర్డ్ జడ్జి నాగేశ్వరరావు ఇచ్చిన తప్పుడు సలహాతోనే పరారయ్యామని లక్ష్మి భర్త విజయసారథి తెలి పారు. వెంటనే బెరుుల్ ఇప్పిస్తామని చెప్పడంతో ఈ నిర్ణ యం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అరుుతే విజయసారథి ఇందుకు భిన్నంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మాజీ జడ్జి నాగేశ్వరరావుతో పాటు తమ న్యాయవాది నర్రా శ్రీనివాసరావులు తమను పారిపొమ్మన్నట్లు బలవంతంగా పోలీసు లు చెప్పించారన్నారు. పోలీసులకు భయపడి చెప్పానే తప్ప తమను వారు పారిపొమ్మనలేదన్నారు. తాను ఈ నెల 6 నుంచి పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నట్లుగా భార్గవ్ కిరణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి స్టేట్‌మెంట్‌లను మొబైల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ సుధ నమోదు చేశారు. రెండో ముద్దారుు తేళ్ల హరిబాబు రిమాండ్‌లో ఉన్న సంగతి విదితమే.
పోలీసుల జాప్యం వల్లే నిందితులు తప్పించుకున్నారు
అంతకుముందు గుంటూరులో లక్ష్మితో పాటు నిందితులు విజయసారథి, భార్గవ్‌కిరణ్, ప్రవీణ్‌కుమార్, ధన్వంతరావులను ఐజీ సంజయ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. సంజయ్ మాట్లాడుతూ.. కేవలం ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి చనిపోరుునట్లుగా దర్యాప్తులో నిర్ధారణ అరుు్యందని తెలిపారు. సంధ్యారాణి సూసైడ్ నోట్‌తో పాటు సాక్ష్యుల స్టేట్‌మెంట్లను ఆధారాలుగా సేకరించామన్నారు. మొదట్లో పోలీసులు చేసిన జాప్యం వల్లే నిందితులు తప్పించుకున్నారని చెప్పారు.
ఐదు రాష్ట్రాలు.. 16 ప్రాంతాలు
నిందితులైన లక్ష్మి దంపతులు 22 రోజులుగా 5 రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో తిరిగారని, వీట న్నింటిని ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొని 8 ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా వెతుకులాట జరిపామన్నారు. ముందుగా గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు వెళ్లిన నిందితులు అక్కడ్నుంచి పాండిచ్చేరి, చెన్నై, తిరుపతి.. అటు నుంచి హైదరాబాద్‌కి వెళ్లారని చెప్పారు. మళ్లీ అక్కడ్నుంచి మహారాష్ట్రలోని షిరిడీ, శనిసింగనాపూర్, పండరీపురం, షోలాపూర్ వెళ్లి తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్లు వెల్ల్లడించారు. అక్కడ్నుంచి కర్నూలు, మంత్రాలయం, అనంతపురం మీదుగా బెంగళూరు, మైసూర్ వెళ్లారని చెప్పా రు. చివరకు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో బెంగళూరు లో ఉన్న విజయసారథి స్నేహితుడు ప్రవీణ్‌కుమార్ ఇంట్లో లక్ష్మి దంపతులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరికి సహకరించిన వారందర్నీ అరెస్ట్ చేస్తామని ఐజీ స్పష్టం చేశారు.
పోలీసు బృందాలకు రివార్డులు
నిందితులను అరెస్టు చేసిన పోలీసు బృందాలను ఐజీ సంజయ్ అభినందించి రివార్డులు ప్రకటించారు. గుంటూరు అర్బన్ పోలీసు కంట్రోల్ రూం సీఐ హైమారావు, నెల్లూరు జిల్లా వాకాడ సీఐ అక్కేశ్వరరావు, చిలకలూరిపేట రూరల్ సీఐ సురేష్‌బాబు, కొల్లూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, గుంటూరు అర్బన్ సీసీఎస్ ఎస్సై వీరేంద్ర, ఈపూరు ఎస్‌ఐ ఉజ్వల కుమార్‌లతో పాటు, గుంటూరు అర్బన్ ఐటీ కోర్ సీసీలు బాలాజీ, సీహెచ్ రాములకు రివార్డులు అందించారు.