సముద్రపు నీటి నుంచి ఉప్పును తీసేసే పరికరం
వాషింగ్టన్: సముద్రపు నీటినుంచి ఉప్పును తొలగించి తాగునీటిగా మార్చే పరికరాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని పరిశోధకులు రూపొందించారు. ఇందులో నానోమీటరు మందంగల మాలిబ్డినం డైసల్ఫైడ్‌తో చేసిన షీట్‌కు చిన్న రంధ్రాలుంటాయి. పెద్దమొత్తంలో నీటిని ఈ షీట్ మీదుగా పంపిస్తే ఉప్పుతోపాటు ఇతర పదార్థాలు తొలగించి మంచి నీరు లభిస్తుంది. ఇల్లినాయ్ వర్సిటీ పరిశోధకుల బృందం వివిధ లోహాలతో చేసిన పలుచని పొరలతో పరిశోధనలు చేయగా మాలిబ్డినం డైసల్ఫైడ్‌తో చేసిన పొరలతో మంచి ఫలితాన్నిచ్చిందని పరిశోధన సారథి ప్రొఫెసర్ నారాయణ ఆలూరు తెలిపారు.