అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విద్యార్థుల దాడి
కరీంనగర్: శాతవాహన వర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పీవీ. లక్ష్మీప్రసాద్‌పై వర్సిటీ విద్యార్థులు దాడి చేశారు. ఎంఏ ఇంగ్లిష్ ఇంటర్నల్‌లో తక్కువ మార్కులు వేశారన్న కోపంతో విద్యార్థులు ఆయన చాంబర్లోనే చితకబాదారు.
ఈ ఘటనపై వర్సిటీ రి జిస్ట్రార్ ఆచార్య ఎం.కోమల్‌రెడ్డి విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామనడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కాగా, దాడికి పాల్పడ్డ 24 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదుచేశారు.