జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్‌గా యాదయ్య
ఉన్నత విద్య సమీక్ష సమావేశంలో కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: జవ హర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ రిజిస్ట్రార్‌గా జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ యాదయ్యను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ వద్ద జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రమణారావు తన రిలీవింగ్ లేఖను ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ కార్యాలయంలో అందజేశారు. మరోవైపు రమణరావు పదవీకాలం మార్చిలోనే ముగిసినా ఇంజనీరింగ్ ప్రవేశాల నేపథ్యంలో ప్రభుత్వమే మూడ్నెళ్లపాటు పొడిగించింది. ఆ పదవీ కాలం కూడా గత నెల 30తో ముగిసింది. ఈ పరిస్థితుల్లో ఆయన్ని కొనసాగిస్తారా? లేదా? అన్న చర్చలు జరిగాయి. అయితే ఆయనపై పలు కాలేజీల యాజమాన్యాలు ఆరోపణలు, ఫిర్యాదులు చేశాయి. దీంతో ఆయనకు కొనసాగింపు ఇవ్వకుండా ప్రొఫెసర్ యాదయ్యను రిజిస్ట్రార్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్ధారించారు.
నిబంధనల మేరకు పని చేశా: రమణారావు
ఇంజనీరింగ్ విద్య, కాలేజీల విషయంలో ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల మేరకు తాను పని చేశానని రమణారావు పేర్కొన్నారు. నిబంధనల అమలులో పక్కాగా వ్యవహరించానని తెలిపారు. ఇంజనీరింగ్‌లో నాణ్యత ప్రమాణాల కోసం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకున్నానన్నారు.