profitable method
-
లాభసాటి బిజినెస్, మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్
జగిత్యాలటౌన్: మహిళల మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్‌లు నిలుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ట్రెండుతో పాటు మహిళల ఆసక్తి, అభిరుచికి తగిన విధంగా అనేక రంగులు, డిజైన్లు, మెటీరియల్ ఒకేచోట లభిస్తుండటంతో బొటిక్‌లకు డిమాండ్ పెరిగింది. గతంలో ఒక షాపులో మెటీరియల్ కొనుగోలు చేసి దానికి లైనింగ్ మరోచోట, స్టిచింగ్ ఇంకో చోట ఇలా పలు దుకాణాలు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాల నిర్వహణతో బిజీగా మారిన మహిళలకు వన్‌స్టెప్ సర్వీస్ అందజేస్తున్న బొటిక్‌లు వరంగా మారాయి. మెటీరియల్, లైనింగ్, డిజైనింగ్‌తో పాటు స్టిచింగ్ కూడా ఒకేచోట లభిస్తుండటంతో మహిళలు బొటిక్‌లకు క్యూ కడుతున్నారు. పండగలు, ఫంక్షన్లు, పార్టీలు, సందర్భం ఏదైనా బొటిక్కు వెళ్లి అకేషన్ డీటేల్స్ చెప్తే చాలు మెటీరియల్ సెలెక్షన్ దగ్గర నుంచి కంప్యూటర్ డిజైనింగ్ మగ్గం వర్క్ ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా రెడీ చేసి కస్టమర్లకు డెలివరీ చేయడం బొటిక్‌ల ప్రత్యేకత. అభిరుచికి అనుగుణంగా.. గతంలో కస్టమర్లు మ్యాచింగ్ బ్లౌజులు మాత్రమే అడిగేవారు. ప్రస్తుతం మారుతున్న మహిళల ఆలోచన, అభిరుచికి అనుగుణంగా మగ్గం వర్క్, బోట్‌నెక్, కంప్యూటర్ బ్లౌజులకు గిరాకీ పెరిగింది. అకేషన్ డీటేల్స్ చెప్తే ఏది వేసుకుంటే బాగుంటుందో సజెస్ట్ చేయడమే కాకుండా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ సెలెక్షన్, డిజైన్, మగ్గం వర్క్‌తో ట్రెండీ బ్లౌజెస్ రెడీ చేసి ఇస్తాం. అందుబాటు ధరల్లో అనుకున్న డిజైన్లు అనుకున్న సమయానికి డెలివరీ ఇస్తున్నాం. బొటిక్ నిర్వహణతో స్వయం ఉపాధితో పాటు పదిమందికి పని కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – ప్రణీత, బొటిక్ నిర్వాహకురాలు మహిళల అభిరుచిని బట్టి బోట్‌నెక్, మగ్గం వర్క్, కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజెస్ అందుబా టులో ఉన్నాయి. మగ్గం వర్క్ బ్లౌజెస్ ధరలు రూ.1400 నుంచి రూ.10వేల వరకు ఉండగా, బోట్‌నెక్ బ్లౌజులకు రూ.400 నుంచి రూ. వెయ్యి చార్జ్ చేస్తున్నారు. కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజులకు రూ.500 నుంచి రూ.3వేల వరకు మెటీరియల్ డిజైన్ బట్టి ధర నిర్ణయిస్తారు. -
లాభసాటి సాగే లక్ష్యం
‘సేంద్రియం’తోనే సాధ్యం తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం రైతులకు ప్రోత్సాహం.. ఎల్లవేళలా సలహాలు, సూచనలు జెడ్పీ సీఈఓ వర్షిణి సంగారెడ్డి జోన్: సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా సాగును లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి అలుగు వర్షిణి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ఉద్యానశాఖ, యూఎన్డీపీ(యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు) సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ విధానంలో కూరగాయాలు, పండ్లతోటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ సీఈవో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో యూఎన్డీపీ సహకారంతో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు తెలిపారు. రైతులు పురాతన పద్ధతిలో ఉన్న విధానాలకు స్వస్తి చెప్పి, రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతినడంతోపాటు ఆరోగ్యం కలుషితమవుతోందన్నారు. రైతులు సేంద్రియపద్ధతిలో వ్యవసాయం చేపట్టాలని సూచించారు. వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు సేంద్రియ విధానంపై రైతులకు ఎల్లవేళలా అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉండి ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఈ విధానం ద్వారా రైతులు పండించిన పంటలకు వ్యవసాయ అనుబంధశాఖల అధికారులు మార్కెటింగ్ సౌకర్యాలపై భరోసా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న యూఎన్డీపీ డైరెక్టర్ దిబ్యాసింగ్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడేందుకు తమ సంస్థ ప్రోత్సహిస్తుందన్నారు. మహిళా రైతులను పెద్ద ఎత్తున్న భాగస్వాములను చేసి కూరగాయాల సాగు కోసం సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి రిలయన్స్, మోర్ తదితర సంస్థల ద్వారా సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రామలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 42,594 హెక్టార్లలో అన్ని రకాల కూరగాయాల సాగు చేస్తుండగా.. 8 లక్షల 58 వేల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్లు వివరించారు. 50 శాతం సబ్సిడీతో హార్టికల్చర్‌శాఖ ద్వారా రైతులకు కూరగాయలు, పండ్లతోటల సాగుకు ప్రోత్సాహం అందించిన్నట్లు ప్రజెంటెషన్ ద్వారా హార్టికల్చర్ సాగు విధానాన్ని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ మాధవీ శ్రీలత, యూఎన్డీపీ అధికారుల బృందం పాల్గొన్నారు.