138 ఎక్సైజ్ కేసులు పరిష్కారం
భీమవరం: జాతీయ లోక్అదాలత్ కార్యక్రమంలో భాగంగా భీమవరం యూనిట్ పరిధిలో 138 కేసులు పరిష్కారమైనట్టు భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసులు శనివారం తెలిపారు. వీటిలో భీమవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 9, నరసాపురంలో 84, పెనుగొండలో 20, తణుకులో 17, ఆకివీడులో 8 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో డీ అడిక్షన్ సెంటన్ను ప్రారంభించి పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ గులాబ్రాజ్ మద్యం సేవించేవారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు, కె.వీరబాబు, ఎస్సైలు పి.వెంకటేశ్వరమ్మ, ఎస్.రాంబాబు పాల్గొన్నారు.