'2019 కల్లా వ్యవసాయానికి నిరంతర విద్యుత్'
నిజామాబాద్ : 2019 కల్లా వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన రెండో రోజు పర్యటనలో భాగంగా బీర్కూర్ మండలం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూడకుండా కాంగ్రెస్, టీడీపీలు పారిపోయాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేసి తీరుతామని కేసీఆర్ చెప్పారు.