పదోన్నతుల్లో మహిళలకు మొండిచేయే!
న్యూయార్క్: పదోన్నతులు, వేతనాల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ అవకాశాలు లభిస్తున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఫేస్బుక్ సంస్థ చీఫ్ ఆరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండబర్గ్, మెక్కెన్సీ అండ్ కంపెనీతో కలసి ఈ విషయాలపై అధ్యయనం చేశారు. 46 లక్షల కార్మికులు ఉన్న 132 కంపెనీల్లో, 34 వేల మందికిపైగా ఉద్యోగులను సర్వే చేశారు.
పదోన్నతుల కోసం పురుషులతోపాటు మహిళలు పోటీ పడుతున్నా వారికి సరైన అవకాశాలు దక్కడంలేదని, బాస్లుగా, దూకుడుగా ఉండడానికి వారు భయపడుతున్నారని తేలింది. శరీర రంగు కూడా ఆడవారి పురోగతికి అడ్డంకిగా ఉన్నట్లు గుర్తించారు.