properties seize
-
గురపత్వంత్ సింగ్‌కి భారత్ బిగ్ షాక్
ఢిల్లీ: ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ Gurpatwant Singh Pannun కు భారత్ సాలిడ్ షాక్ ఇచ్చింది. గురపత్వంత్పై చర్యల్లో భాగంగా దర్యాప్తులోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థNIA.. భారత్‌లో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు అతనిపై పంజాబ్‌లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో.. NIA దర్యాప్తులో.. అమృత్సర్ జిల్లా ఖాన్‌కోట్‌లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్‌లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్.. అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం గురపత్వంత్ను 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్‌పోల్ రెడ్‌నోటీస్ విజ్ఞప్తి సైతం చేసింది. కానీ, సరిపడా సమాచారం లేదనే కారణంతో ఇంటర్‌పోల్ భారత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గురపత్వంత్ కార్యకలాపాలపై, అతని నేర చరిత్రపై చాలా రోజులుగా కెనడాను భారత్ అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ, కెనడా ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదు. ఇదీ చదవండి: మోదీ, షాలను వదలని గురపత్వంత్ -
శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్
చెన్నె: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు మరో భారీ షాక్ తగిలింది. ఆమెకు సంబంధించిన వంద కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను విభాగం జప్తు చేసింది. బినామీ లావాదేవీల చట్టం కింద బుధవారం ఆమెకు సంబంధించిన 11 ఆస్తిపాస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నె శివారులోని పయ్యనూర్‌లో ఉన్న ఆస్తులను ఐటీ విభాగం సొంతం చేసుకుంది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య 24 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు ఐటీ విభాగం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ అప్పట్లో రూ.20 లక్షలు ఉండగా ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.100 కోట్లకు చేరింది. ఆస్తిపాస్తుల జప్తు ఇలా.. చెన్నెలో శశికళకు సంబంధించిన 65 ఆస్తులను గతేడాది ఐటీ అటాచ్ చేసింది. 2019లో రూ.1,600 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2017లో 187 ఆస్తులపై తనిఖీలు జరిగాయి. రూ.1,430 కోట్ల పన్ను చెల్లించలేదని శశికళపై అభియోగాలు ఉన్నాయి. 1991 జూలై నుంచి ఏప్రిల్ 1996 వరకు శశికళ బంధువు ఇళవరసి, వీఎన్ సుధాకరన్ పేర్ల భారీగా ఆస్తుల కొనుగోళ్లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 66 ఏళ్ల శశికళ 2017 ఫిబ్రవరిలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి శశికళ విడుదలవడంతో తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్రమాస్తుల కేసులో ఇంకా ఆమెపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని అందరూ ఊహించగా అనూహ్యంగా ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆమె మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. చదవండి: Tamil Nadu: మా వల్ల కాదు బాబోయ్.. 15వ తేదీలోపు ఎన్నికలు అసాధ్యం! -
మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంట్లో సోదాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి సంబంధించిన ఇళ్లు, సంస్థలే లక్ష్యంగా మంగళవారం తమిళనాడులో 60 చోట్ల డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీకరప్షన్ (డీవీఏసీ) సోదాలు నిర్వహించింది. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ దాడులు జరిగాయి. వేలుమణితో సహా 17 మందిపై డీవీఏసీ కేసుల్ని నమోదు చేసింది. డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం గత నెల అన్నాడీఎంకేకు చెందిన రవాణాశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్‌పై ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం నగరాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి టార్గెట్‌గా కోయంబత్తూరులో 42 చోట్ల, చెన్నైలో 16 చోట్ల, దిండుగల్, కాంచీపురంలలో తలా ఓ చోట డీవీఏసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో చెన్నై , కోయంబత్తూరు కార్పొరేషన్లలో రూ. 810 కోట్ల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు, మంత్రి , ఆయన సన్నిహితులు ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు దర్యాప్తులో స్పష్టం కావడంతో డీవీఏసీ ఈ దాడులు చేసింది. వేలుమణి, ఆయన సోదరుడు అన్భరసన్, సన్నిహితుడు చంద్రశేఖర్, గతంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన మధురాంతకీ, చెన్నై కార్పొరేషన్ ప్రధాన ఇంజినీరు నందకుమార్, మాజీ ఇంజినీరు పుగలేంది ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. కాగా దాడులను నిరసిస్తూ అన్నాడీఎంకే వర్గాలు పలుచోట్ల ఆందోళన నిర్వహించాయి. -
భార్యను విడిచిపెడితే, మీ ఆస్తులు గోవిందా
న్యూఢిల్లీ : తమ కుమార్తెలకు విదేశీ సంబంధాల కోసం తల్లితండ్రులు ఉబలాటపడుతుంటే, ఎన్ఆర్ఐ పెళ్ళిళ్లు అమ్మాయిలకు కన్నీళ్లు మిగుల్చుతున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. భారత్‌లో పెళ్లి చేసుకుని, కట్నం కానుకలు తీసుకుని భార్యలను విదేశాలకు తీసుకెళ్తున్న భర్తలు, వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వదిలి వేయడం, శారీరక వేధింపులకు గురిచేయడం..వంటి పలు కారణాలతో ఆడపిల్లలను వేధిస్తున్నారు. ఈ వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భార్యను వేధించినా.. వదిలేసినా భారత్‌లో భర్త లేదా వారి కుటుంబసభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని అంతర్ మంత్రిత్వ కమిటీ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. వదిలివేయబడ్డ మహిళలకు చట్టపరమైన పరిష్కారంగా, జస్టిస్ కోసం భర్త, వారి కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో 2015 జనవరి 1 నుంచి 2017 నవంబర్ 30 మధ్యలో ఈ తరహా ఫిర్యాదులు 3,328 వరకూ అందాయని తెలిసింది. ఎన్ఆర్ఐ భర్తలు, భార్యలను వదిలివేయడం, వేధించడం, కట్నం డిమాండ్లు, శారీరక వేధింపులు, పాస్‌పోర్ట్ సీజ్ వంటి చేష్టలకు పాల్పడుతున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటి నుంచి అన్ని పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లను స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌కు లింక్ చేయనున్నామని, ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియను ముగించనున్నట్టు కేంద్ర మంత్రి మేనకా గాంధీ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న వారిలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, న్యాయమంత్రి రవి శంకర్ ప్రసాద్‌లు కూడా ఉన్నారు. డబ్ల్యూసీడీ కింద ఒక ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజెన్సీని నియమించాలని, ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను అది విచారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ తరహా కేసుల్లో ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్టులు కూడా రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తప్సనిసరి అన్ని రాష్ట్రాలు అన్ని పెళ్లిళ్లను రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టడం లేదు. -
దావూద్ ఆస్తులను నిజంగా జప్తు చేశారా?
భారత్ నుంచి తప్పించుకొని పాకిస్తాన్లో ప్రవాస జీవితం గడుపుతున్నట్లు భావిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన 15 వేల కోట్ల రూపాయల ఆస్తులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అక్కడి ప్రభుత్వం జప్తు చేసినట్లు ‘జీ న్యూస్’లో వచ్చిన వార్త ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ‘దౌత్యపరంగా ఇది భారత ప్రధాని నరేంద్రమోదీ సాధించిన ఘన విజయం’ అంటూ భారతీయ జనతా పార్టీ ట్వీట్ కూడా చేసింది. దీంతో దేశంలోని పలు ఆంగ్ల పత్రికలు, ప్రాంతీయ భాషా పత్రికలు ఆ వార్తను పునర్ ప్రచురించాయి. తొలుత ఈ వార్తను ప్రచురించిన ‘జీ న్యూస్’లో కూడా ఈ విషయం ఎవరూ చెప్పారో లేదు. వార్తకు ‘జీ న్యూస్ బ్యూరో’ అని మాత్రమే ఉంది. వార్త సోర్స్ కనుక్కునేందుకు జీ న్యూస్ బ్యూరోను పలువురు సీనియర్ జర్నలిస్టులు సంప్రదించగా ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేదు. జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరిని ఓ ఆన్లైన్ మీడియా జర్నలిస్టు సంప్రతించగా తాను కారు డ్రైవింగ్‌లో ఉన్నానని, అరగంట తర్వాత చెబుతానని చెప్పారు. ఆయన ఈ విషయమై ఎన్నిసార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఇంతవరకు స్పందించడం లేదు. దావూద్ ఇబ్రహీం ఆస్తుల జప్తు గురించి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ జర్నలిస్టులు భారత ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలన్నింటినీ సంప్రదించగా అలాంటి సమాచారమేదీ తమవద్ద లేదని వారు సమాధానం ఇచ్చారట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని మీడియాకు గానీ, అక్కడి ప్రభుత్వానికి గానీ ఏమైనా తెలుసేమో కనుక్కునేందుకు తోటి జర్నలిస్టులు అక్కడి జర్నలిస్టులను సంప్రదించగా, అలాంటి వార్తేదీ అక్కడి పత్రికల్లో రాలేదని, అక్కడి ప్రభుత్వానికి గానీ, విదేశాంగ శాఖకు గానీ, అక్కడి భారత ఎంబసీకి గానీ తెలియదని అక్కడి నుంచి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక ‘ఖలీల్ టైమ్స్’కు చెందిన సతీష్ అనే జర్నలిస్ట్ స్పష్టంచేశారు. దావూద్ ఆస్తుల జప్తునకు సంబంధించిన ముఖ్యమైన వార్త అటు అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి గానీ, ఇటు భారత ప్రభుత్వానికి గానీ, అక్కడి భారత ఎండసీకి గానీ తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు ఎక్కడినుంచి ఈ వార్త పుట్టింది. ఇందులో అసలు నిజం ఎంతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మను తోటి జర్నలిస్టులు ప్రశ్నించగా, పార్టీలోని సమాచార, సాంకేతిక విభాగం ముందుగా ట్వీట్ చేసిందని, దానికి ఇప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. మోదీ 2015, ఆగస్ట్ నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను సందర్శించి, అక్కడి ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకున్నారని, ఆయన నాడు నెరపిన దౌత్యం కారణంగా దావూద్ ఆస్తులను అక్కడి ప్రభుత్వం జప్తు చేసిందని, ఇది మోదీ విజయమని వ్యాఖ్యానించారు. ఇంతకు వార్తకు ఆధారం ఏమిటని ప్రశ్నించగా, పార్టీ సమాచార విభాగానికి చాలా మార్గాల నుంచి సమాచారం వస్తుంటుందని, ఏదో మార్గం నుంచి సమాచారం రావడం వల్లనే ట్వీట్ చేశారని చెప్పారు. సోర్స్ మాత్రం చెప్పలేదు. ఈ వార్తను ప్రచురించిన పలు పత్రికలు తిరిగేసినా ‘ఎకార్డింగ్ టు మీడియా రిపోర్ట్స్’ అని ఉన్నదే తప్ప సోర్స్‌ను ఏ పత్రికా పేర్కొనలేదు. కొన్ని పత్రికలు బీజేపీ ట్వీట్‌ను ఉదహరించాయి. ఏ సోర్స్ లేకుండా ఈ వార్త ఎలా వెలుగులోకి వచ్చింది? పెద్ద నోట్ల రద్దుతో మసకబారిన మోదీ ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకు ఈ వార్తను సృష్టించారా? దావూద్ ఆస్తుల జప్తునకు సంబంధించిన పరిణామ చర్యలపైనే ఈ వార్త ప్రామాణికత ఆధారపడి ఉంటుంది. మున్ముందు ఎలాంటి వార్తలు వస్తాయో చూడాలి. -ఓ సెక్యులరిస్ట్ కామెంట్