property conflicts
-
చిక్కుల్లో క్రికెటర్ యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. గోవా ప్రభుత్వం యువరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. విషయంలోకి వెళితే.. గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలో యువీకి 'కాసా సింగ్' పేరిట ఒక విల్లా ఉంది. గత సెప్టెంబర్‌లో ఈ విల్లాను అద్దెకు ఇస్తానంటూ యువీ తన ట్విటర్ వేదికగా ప్రకటన చేశాడు. గోవా రూల్స ప్రకారం ఇది ఒక విధంగా పేయింగ్ గెస్ట్ విధానం కిందకు వస్తుంది. దీనికి గోవా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. పేయింగ్ గెస్ట్ విధానం కింద విల్లాను అద్దెకు ఇవ్వాలంటే గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యూవీ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అద్దె ఇవ్వడం అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీనిని గోవా అధికారులు తప్పుబడుతూ రూ.లక్ష జరిమానా విధించారు. అంతేకాదు డిసెంబర్ 8న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. పర్యాటక శాఖ చట్టాన్ని ఉల్లంఘించిన క్రమంలో ఎందుకు రూ. లక్ష జరిమానా విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించారు. ఎవరైనా సరే గోవాలో హోటల్/గెస్ట్ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర టూరిజం శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. I’ll be hosting an exclusive stay at my Goa home for a group of 6, only on @Airbnb. This is where I spend time with my loved ones & the home is filled with memories from my years on the pitch. Bookings open Sep 28, 1pm IST at https://t.co/5Zqi9eoMhc 🏖️#AirbnbPartner @Airbnb_in pic.twitter.com/C7Qo32ifuE — Yuvraj Singh (@YUVSTRONG12) September 21, 2022 చదవండి: 'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు' బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు -
మరో ‘నిర్భయ’ కాదు.. అంతా ఉత్తుత్తి డ్రామా!
మరో నిర్భయ ఉదంతంగా.. సంచలనం సృష్టించిన ఘజియాబాద్ గ్యాంగ్ రేప్ కేసు ఉత్తదేనని పోలీసులు తేల్చారు. ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్‌తో ఈ కేసు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. 36 ఏళ్ల సదరు మహిళ ఉద్దేశపూర్వకంగానే సామూహిక అత్యాచార నాటకం ఆడినట్లు పోలీసులు ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్-ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రెండు రోజుల కిందట వెలుగు చూసిన ఉదంతం.. దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళను అపహరించిన ఐదుగురు.. అత్యాచారం చేసి శారీరకంగా హింసించారనే ఉదంతం ప్రకంపనలు పుట్టించింది. కాళ్లు చేతులు కట్టేసి.. జననాంగాల్లో ఇనుపరాడ్లు పెట్టి ఓ గోనె సంచిలో కుక్కేసి ఢిల్లీ-ఘజియాబాద్ రూట్లోని ఆశ్రమ్ రోడ్డు దగ్గర పడేశారని, నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించి బుధవారం ఓ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అయితే.. పోలీసుల అదుపులో నిందితులు అయితే ఆమెతో వాళ్లకు ఆస్తి తగాదాలు ఉండడంతో.. ఈ కేసును ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. ఈలోపు ఆమెకు పరీక్షలు నిర్వహించిన ఢిల్లీ జీటీబీ ఆస్పత్రి ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేల్చి చెప్పింది. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఆమె ఆచూకీ లభ్యమైన తర్వాత రెండు ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలకు ఆమె నిరాకరించడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతి.. నాటకం ఆడిందని చెప్తున్న పోలీసులు చివరికి ఆమె మొబైల్ సిగ్నల్‌ను ట్రేస్ చేసి.. అసలు విషయాన్ని తేల్చేశారు పోలీసులు. స్నేహితురాలి బర్త్ డే పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో.. కారులో వచ్చిన నిందితులు తనను అపహరించుకు పోయి అఘాయిత్యానికి పాల్పడ్డారనేది ఆమె ఫిర్యాదు. అయితే.. ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఓ స్నేహితుడు.. అదే స్పాట్లో ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అంతేకాదు.. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ నుంచి ఆ స్నేహితుడికి పేటీఎం ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యిందని, ఈ వ్యవహారాన్ని అత్యాచారం కోణంలో ప్రచారం చేయించేందుకే అతనికి ఆమె డబ్బు ఇచ్చిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. दिल्ली की लड़की से 5 लोगों ने किया गैंगरेप. उसके प्राइवेट पार्ट्स में रोड घुसा दी. लहूलुहान लड़की को बोरे में बांध कर सड़क पर फेंक दिया.@GhaziabadPolice के SSP को @DCWDelhi चेयरपर्सन @SwatiJaiHind ने दिया नोटिस दिया. वहशी दरिंदों के खिलाफ एक्शन हो @SandhyaTimes4u @NBTDilli pic.twitter.com/CMq4N1PMHc — सूरज सिंह/Suraj Singh 🇮🇳 (@SurajSolanki) October 19, 2022 ఆ ఐదుగురితో ఆస్తి తగాదాలు ఉండడంతోనే ఆమె అలా నాటకం ఆడిందని యూపీ రీజినల్ పోలీస్ చీఫ్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తనపై రెండు రోజులు సామూహిక అత్యాచారం జరిగిందని చెప్తున్న టైంలో.. ఆమె తన స్నేహితులతో రిసార్ట్‌లో గడిపిందట. ఆ తర్వాత వాళ్ల సహకారంతోనే గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిందని పోలీసులు దర్యాప్తులో తేల్చేశారు. పోలీసుల ప్రకటనపై బాధితురాలి నుంచిగానీ.. మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ నుంచిగానీ ఎటువంటి స్పందన రాలేదింకా. ఇదీ చదవండి: 3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డ జంట -
ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
కొడంగల్ రూరల్: వారసత్వంగా తన తండ్రికి చెందాల్సిన ఆస్తిని..ఇవ్వడం లేదన్న మనస్తాపంతో టెన్త్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని హస్నాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కొడంగల్ పట్టణానికి చెందిన కాంసన్‌పల్లి వెంకటయ్య కుమారుడు నిఖిల్ (16) చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ ఊరైన హస్నాబాద్‌లో నివాసం ఉంటూ అక్కడే పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కాంసన్‌పల్లి వెంకటయ్య, అంజమ్మ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటయ్య తల్లిదండ్రులకు సంబంధించిన భూమి విషయంలో వెంకటయ్య, అతని అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ విషయంపై ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ సమయంలో నిఖిల్ తన పెదనాన్నలతో మాట్లాడి వారసత్వంగా తమకు చెందాల్సిన భూమిని తమ తండ్రి పేరున పట్టా చేయాలని అడగ్గా.. సరేనని చెప్పిన వారు కాలయాపన చేస్తుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి హస్నాబాద్‌లోని ఆరుబయటే నిద్రించిన నిఖిల్ రాత్రికి రాత్రి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున వృద్ధురాలు లేచి చూడగా..నిఖిల్ చెట్టుకు వేలాడుతూ కన్పించడంతో స్థానికుల సాయంతో కిందకు దించారు. అయితే అప్పటికే నిఖిల్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుడి అమ్మమ్మ బెస్త చెన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఎకరా పొలం ఉన్నా బతికేటోళ్లం! -
నాన్న పేరు చెడగొడుతున్నందుకు బాధగా ఉంది
‘‘ఈ నెల 24న తన డ్రైవర్‌తో పాటు దాసరి అరుణ్ మా గేటు దూకి ఇంట్లోకి వచ్చాడు. మద్యం తాగి వచ్చి నాపై, నా భార్యపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మా నాన్నగారి బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్నగారి వీలునామా ప్రకారం ఈ ఇంటికి ఆయన మనవరాలైన నా కూతురు అర్హురాలు. ఆస్తి కోసం దాసరి అరుణ్ దౌర్జన్యం చేస్తున్నాడు. దాసరి అరుణ్‌పై చర్యలు తీసుకోవాలి’’ అని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు దాసరి ప్రభు. అలాగే మోహన్‌బాబు, సి.కల్యాణ్, మురళీమోహన్ వంటి పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కార మార్గాన్ని చూపాలంటున్నారు ప్రభు. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోని ఏ శాఖకు సమస్య వచ్చినా ‘నేనున్నాను’ అంటూ మా నాన్నగారు దాసరి నారాయణరావు ముందుకొచ్చి పరిష్కరించేవారు. అలాంటి దాసరి కొడుకులుగా పుట్టి ఆయన పేరుని చెడగొడుతున్నందుకు చాలా బాధగా ఉంది. అందరి ఇళ్లల్లో ఉన్నట్లు మా ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మేం దాసరి గారి పిల్లలం కాబట్టి ఇంత రచ్చ జరుగుతోంది. అన్నయ్య (దాసరి ప్రభు)కు, నాకు మధ్య ఉన్నవి వందకు వంద శాతం ఆస్తి గొడవలే’’ అంటున్నారు దాసరి అరుణ్‌కుమార్. శుక్రవారం అరుణ్‌పై అతని అన్న ప్రభు జూబ్లిహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. గోడ దూకి తన ఇంట్లోకి వచ్చి, ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై చేయి చేసుకున్నాడని అరుణ్‌పై ఆరోపించారు దాసరి ప్రభు. ఈ కేసుకు సంబంధించి జరిగిన విషయాలను పంచుకోవడానికి శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు దాసరి అరుణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘నేను 24వ తేదీన 9.30 నిమిషాలకు ఫిలింనగర్ రోడ్ నం 47లోని మా ఇంటి (చనిపోయేవరకూ దాసరి ఉన్న ఇల్లు. ఇప్పుడు పెద్ద కుమారుడు ప్రభు తన కుటుంబంతో ఆ ఇంట్లో ఉంటున్నారు)కి వెళ్లాను. ఆ రోజు సాయంత్రం 6.30 నాకు కొరియర్ వచ్చిందని కొరియర్ బాయ్ ఫోన్ చేస్తే, కలెక్ట్ చేసుకుందామని వెళ్లాను. అరగంట సేపు కాలింగ్ బెల్ కొట్టాను. ఎవరూ తలుపు తీయలేదు. మా ఇల్లే కదా అని గోడ దూకి వెళ్లాను. మా ఇంటి గోడను నాన్న (దాసరి నారాయణరావు) ఉన్నప్పుడు రెండు, మూడు సార్లు దూకాను. అందులో తప్పేముంది? మా ఇల్లే కదా. మూడు రోజుల క్రితం అలా దూకిన తర్వాత కింద హాలు తలుపు తీసుకుని హాల్లోకి వెళ్లాను. ఎవరూ కనిపించకపోయేసరికి పైకి వెళ్లాను. అక్కడ ఉన్న అన్నయ్యతో ‘నాకో డాక్యుమెంట్ వచ్చింది, అది ఇస్తే వెళ్లిపోతా’ అన్నాను. లేదని హడావిడిగా కిందికి వెళ్లాడు. ఓ పది నిమిషాల తర్వాత జూబ్లీహిల్స్ ఎస్.ఐ. నవీన్‌గారు, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. ఆయన వచ్చి ‘గొడవ ఏంటండి’ అన్నారు. ‘నాకో డాక్యుమెంట్ వచ్చింది, తీసుకోవటానికి వచ్చా’నన్నాను. ఆయన నాకు డాక్యుమెంట్ ఇప్పించారు. ఆయన అక్కడ ఉండగానే నేనక్కడ్నుంచి వెళ్లిపోయాను. ఇది జరిగిన రెండో రోజు నా మీద పోలీస్ కంప్లయింట్ ఎందుకు పెట్టారో తెలియదు. ఒకవేళ నేను ఎవరినైనా కొట్టుంటే ఆ రోజే కేస్ పెట్టాలి. ఒకరోజు గ్యాప్ తీసుకుని శుక్రవారం కేస్ ఫైల్ చేశారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఒక అరగంట నాతో, మా చెల్లితో కూర్చుంటే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. అలా కాకుండా మీడియాకు పరిగెడతాడు. గతేడాది మే నెల నుండి ఈ ఆస్తి గొడవలు ఉన్నాయి. అప్పుడు కూడా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ‘మా తమ్ముడు నాకు అన్యాయం చేశాడు’ అని చెప్పారట. అప్పుడు సీఐ గారు ఫోన్ చేసి, ‘మీ బ్రదర్‌కి మీరు అన్యాయం చేశారని కేస్ పెట్టారు’ అన్నారు. అన్యాయం చేశానని చెప్పడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? డాక్యుమెంట్ ఏదైనా ఉందా? చెక్ ఉందా? ఉంటే చెప్పండని అడిగాను. అప్పటినుండి ఇలానే ఏదో ఒక గొడవ చేస్తున్నాడు. నేను అన్నయ్యతో కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకోవటానికి రెడీ. కానీ, ఆయనే మీడియాకి వెళుతున్నారు. దానివల్ల ఏమీ రాదు. గతేడాదిగా ఆయన ఇంటర్వ్యూలు నేను నాలుగు చూశాను. ఇండస్ట్రీ పెద్దలు మాకేమీ చేయడంలేదు అంటారు. మా బ్రదర్ మాట్లాడితే మోహన్‌బాబు, మురళీమోహన్, సి.కల్యాణ్గార్ల చెబుతారు. అప్పటికీ నిన్న సి.కళ్యాణ్‌గారు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే జరిగింది చెప్పాను. సరేలే చూద్దాం అన్నారు. ఆయనేమన్నా చేస్తారేమో చూడాలి. ఇప్పుడు ఆ ఇంటి మీద కోర్టు ఆర్డర్ ఉంది. అదేంటంటే, మా ముగ్గురి అంగీకారంతోనే ఆ ఇంటిని అమ్మాలి. అలా కాకుండా ఏదైనా వీలునామా ఆయన దగ్గరుంటే చూపించమనండి, నాకేమీ అభ్యంతరం లేదు’’ అన్నారు. ‘ఈ ఇంట్లో మీరు ఎందుకు ఉండటంలేదు’ అని అడిగిన ప్రశ్నకు అరుణ్ సమాధానమిస్తూ – ‘‘నాకు జూబ్లీహిల్స్‌లో ఇంకో ఇల్లు ఉంది. అక్కడ ఉంటున్నాను. ఈ ఇంటిని ఆఫీస్‌లా వాడుకుంటున్నాను. మా సిస్టర్‌కి వేరే ఇల్లుంది. ఆమె అక్కడ ఉంటుంది. మా అన్నయ్య డిప్రెషన్‌తో బాధపడుతున్నాడేమో అనుకుంటున్నా. ఆ ఇంటికి సంబంధించి మా ముగ్గురికీ సమానమైన హక్కుంది. ఏడాదిగా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కేస్ పెట్టడంతో రియాక్ట్ అవ్వక తప్పలేదు. పోలీస్, మీడియాను సంప్రదించే టైమ్‌ని మా అన్నయ్య నాకు, మా సిస్టర్‌కి కేటాయిస్తే సమస్య ఈజీగా పరిష్కారమవుతుంది. ది గ్రేట్ దాసరి నారాయణరావుగారి పేరు ఇలా బజారుకి ఎక్కేది కాదు. నాకైతే ఎటువంటి సమస్య లేదు, ఏదైనా సమస్య ఉంటే వచ్చి క్లియర్ చేసుకోమని పత్రికా ముఖంగా మా అన్నయ్యకు చెబుతున్నాను. చిరంజీవిగారు మా సమస్యని సాల్వ్ చేస్తున్నారని కొన్ని మీడియా హౌస్‌లు రాస్తున్నాయి. అందులో ఎంత మాత్రం నిజం లేదు. అనవసరంగా ఆయన్ను ఇందులోకి లాగుతున్నారు’’ అన్నారు. -
వృద్ధ దంపతులపై కోడలి దాష్టీకం!
సాక్షి, తెనాలి: వృద్ధాప్యంలో ఉన్న తమను ఆదరించకపోగా, ఆస్తి కోసం వేధిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతూ తప్పుడు కేసుతో పోలీస్ స్టేషన్లో నిర్బంధానికి గురిచేసిన కోడలు నుంచి తమకు రక్షణ కల్పించాలని కొల్లిపర మండల గ్రామం శిరిపురానికి చెందిన డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు అధికారులను వేడుకున్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో అర్జీనిచ్చారు. తెనాలి ఆర్డీవో ఎ.శ్యామ్‌సుందర్ అర్జీలను స్వీకరించారు. అర్జీలో విక్టోరియమ్మ పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. తాడిగిరిపాడులో నివసిస్తున్న డక్కుమాల విక్టోరియమ్మ, జీవరత్నం దంపతులు కోడలు భాగ్యలక్ష్మి వేధింపులను తట్టుకోలేక శిరిపురం చేరుకున్నారు. అక్కడే కూలిపనులు చేసుకుంటూ మూడు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి పూరిల్లు వేసుకుని నివసిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత కొడుకు గోపాలరావు, కోడలు భాగ్యలక్ష్మి కూడా శిరిపురం వచ్చారు. తల్లిదండ్రులు ఉండే స్థలంలోనే మరో ఇల్లు వేసుకుని వేరుకాపురం ఉంటున్నారు. వీరి మంచీచెడూ చూడటం లేదు. కోడలు పేరిట తాడిగిరిపాడులో ఇందిరమ్మ ఇల్లు ఉంది. అయితే తల్లిదండ్రులు ఉంటున్న నివాస స్థలాన్ని కూడా కోడలు పేరుతో రాసివ్వమంటూ కొడుకు గోపాలరావు ఒత్తిడి చేస్తున్నాడు. బతికున్నంతకాలమైనా స్థలాన్ని తమ అధీనంలోనే ఉంచమని వేడుతున్నా వినలేదు. హృద్రోగంతో బాధపడుతున్న మామ, అత్త విక్టోరియమ్మను ఆస్తి కోసం కోడలు విచక్షణారహితంగా కొట్టింది. అప్పటికీ స్థలం ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో కొల్లిపర పోలీస్‌స్టేషనులో తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు 23వ తేదీ సాయంత్రం 5 గంటల్నుంచి అర్ధరాత్రి వరకు వృద్ధ దంపతులను నిర్బంధించారు. కొల్లిపర పోలీసులు కూడా కోడలుకే మద్దతునిస్తూ, స్టాంపు పత్రాలపై సంతకం చేయమని ఒత్తిడి తెచ్చారు. నివసిస్తున్న స్థలం మినహా మరే ఆధారం లేని తమను రోడ్డుకీడ్చారని, గతిలేని స్థితిలో అదే ఊరిలో ఉంటున్న అల్లుడి ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని వృద్ధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడలి వల్ల తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించి, తమ ఇంటిలో తాము ఉండేలా న్యాయం చేయాలని విక్టోరియమ్మ భర్తతో సహా ఆర్డీవోను వేడుకుంది. మనుమలను దూరం చేశారు.. వృద్ధాప్యంలో ఒంటరి జీవితం నరకప్రాయమని, కనీసం చనిపోయేంతవరకైనా తనతో కోడలు, మనుమ సంతానం కలిసుండేలా ఆదేశించాలని పట్టణ సుల్తానాబాద్‌కు చెందిన వృద్ధురాలు ధనావత్ పట్నీబాయి (70) ‘స్పందన’లో ఆర్డీవోను కలిసి అర్జీనిచ్చారు. భర్త మరణంతో తాను సుల్తానాబాద్‌లోని సొంతంటిలో పెద్దకొడుకు కుటుంబంతో కలసి ఉంటున్నట్టు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడైన తన పెద్ద కొడుకు మునినాయక్ గత మే నెల 27న ఆటోప్రమాదంలో మరణించాడని, ఉమ్మడి కుటుంబం అయినా కొడుకు చనిపోయాక ఫ్యామిలీ సర్టిఫికెట్లో తన పేరు లేకుండా చేశారని పట్నీబాయి చెప్పారు. ఆధార్‌లో మార్పులు చేయించుకు వస్తానంటూ కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లినట్టు తెలిపారు. ఇప్పుడేమో ‘నేను రాను...మీతో నాకు అవసరం లేదు’ అంటోందని చెప్పారు. ఎవరూ లేకపోవటంతో పెళ్లివయసుకొచ్చిన చిన్న కుమార్తెతో ఉంటున్నానని, ఆమె వివాహం తర్వాత మళ్లీ ఒంటరినవుతానని ఆవేదనగా అన్నారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు వయసు కలిగిన ముగ్గురు మనుమ సంతానంతో సహా కోడలు తన ఇంటి వద్ద ఉండేలా చూడాలంటూ ఆర్డీవోను అభ్యర్థించారు. – ధనావత్ పట్నీబాయి -
ఆస్తి కోసం కొట్టుకున్న అన్నదమ్ములు
సాక్షి, మందస(శ్రీకాకుళం) : మండలంలోని పితాతొళి పంచాయతీ పుచ్చపాడులో శుక్రవారం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా చోటు చేసుకుంది. వీరిలో అన్నయ్య శిస్టు శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. మందస పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అన్నదమ్ములు శిస్టు శ్రీనివాసరావు, తాతారావుల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. తాతారావు పొలం దున్నుకుని వస్తున్నాడు. ఇప్పటికే వివాదాలున్న పొలం ఎందుకు దున్నావని అన్నయ్య ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది. వాగ్వాదం మరింత పెరిగి, తాతారావుతోపాటు కుటుంబ సభ్యులైన హేమసుందర్, బాలనాగమ్మ, నాగేశ్వరరావు వెదురు కర్రలతో శ్రీనివాసరావుపై దాడి చేశారు. ఈ దాడిలో ఈయన తీవ్రంగా గాయపడగా, ఈయన భార్యకు కూడా దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోయింది. మందస 108 అంబులెన్స్ ఈఎంటీ డీ తారకేశ్వరరావు, పైలట్ వీ మురళీమోహన్ బాధితులను పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం కిమ్స్‌లో చేర్పించారు. ఎస్ఐ చిట్టిపోలు ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్తికోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ
-
నటి ఫ్యామిలీలో ఆస్తి కోసం డిష్యూం డిష్యూం
చెన్నై : నటి మనోరమ ఆస్తి వ్యవహారం కుటుంబసభ్యుల మధ్య కలకలం రేపుతోంది. వేయికి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రఖ్యాత నటి మనోరమ. అలాంటి మనోరమపై ఆమె మనవరాలు అభిరామి (25) చెన్నై సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలుచేశారు. అందులో నటి బామ్మ మనోరమ ప్రఖ్యాత నటి అని, ఆమెకు చెన్నై తిరువళ్లూరు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తులున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం తన బామ్మ ఆరోగ్యం క్షీణించిందని పేర్కొన్నారు. తన చుట్టూ ఏమి జరుగుతోందో తెలియని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తన తండ్రి భూపతి మందుకు బానిసై మతి స్థిమితం లేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన స్థానిక టీనగర్లో ఉన్న ఇంటిలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. వీరి అనారోగ్య పరిస్థితిని సాకుగా తీసుకుని తన సోదరుడు డాక్టర్ రాజరాజన్ తన బామ్మ ఆస్తులను తన పేరుకు మార్చుకున్నారని పేర్కొన్నారు. తన బామ్మ సొత్తులో తనకు సమభాగం చెందాలని తెలిపారు. అలాంటిది రాజరాజన్ ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని తాను అలాంటి చర్యలకు పాల్పడితే తనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ శనివారం న్యాయమూర్తి లక్ష్మీకాంతన్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై నటి మనోరమ కొడుకు భూపతి ఆయన భార్య ధనలక్ష్మి, కొడుకు రాజరాజన్ ఈ నెల 22వ తేదీ లోపు బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.