proposel
-
వైరల్: అతడు..ఆమె.. ఓ పానీపూరీ ప్రేమ కథ
లవ్ అట్ ఫస్ట్ సైట్లో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు చూసిన వెంటనే ప్రేమలో పడిపోతుంటారు. కానీ అదే ప్రేమను తెలపాలంటే చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే ప్రేమను మనం ఇష్టపడే వారికి తెలియపరచడం అనేది ఓ మధురానుభూతి. అందుకే ప్రేమించడం సులువు గానీ అది వ్యక్తపరచడం చాలా కష్టమని అంటుంటారు. ఇలా ఇష్టపడే అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడం కోసం అబ్బాయిలు చాలానే ఆలోచిస్తుంటారు. అలా ఓ ప్రేమికుడు తను ప్రేయసికి సరికొత్తగా తన ప్రేమను తెలపాలనుకున్నాడు. దాని కోసం ఎంతో ఆలోచించి ఓ క్రేజీ ఐడియాతో తను ప్రేమించిన అమ్మాయికి సరికొత్తగా ప్రేమను వ్యక్తపరిచాడు. ఇంకేముంది కొత్తదనం ఉంటే చాలు సోషల్ మీడియాలో వైరల్గా మారి చక్కర్లు కొట్టేస్తుందన్న విషయం తెలిసిందే. ఆ ప్రేమికుడు తన ప్రేయసిని.. అలా పానిపూరి దుకాణంలో తీసుకెళ్లాడు. ఎలా చెప్పాలా అనుకుంటూ ఉండగా ఆకస్మాత్తుగా అతనికి ఓ ఐడియా మదిలో మెదిలింది. అనుకున్నదే తడువుగా.. ‘పానీపూరీలో ఉంగరం పెట్టి లవ్ ప్రపోజ్’ చేసేశాడు. ఇక ఈ వెరైటీ ప్రపోజల్కు అమ్మాయితో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారండోయ్. మామూలుగానే పానీ పూరీ అంటే ఇష్టపడనివారు ఎవరు ఉండరు. దీంతో పానీపూరితో పిల్లను ప్రేమలో పడేశావ్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫన్నీ నెటిజన్లు. ఈ పానీపూరి రింగ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తోంది. i mean,, can’t say no to pani puri Gol gappay or pani puri are enjoyed by everyone and they are a real treat. But none of us would have imagined getting proposed through gol gappay. This man is doing things differently and after bizarre food proposals, pic.twitter.com/OwvGFc1Jd4 — MonthlyAndazeJahan (jiddat group of publications) (@e_monthly) June 3, 2021 చదవండి: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు! -
నో రిజిస్ట్రేషన్ ఫీజ్ : కేంద్రం బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత వాహనాల (ఎలక్ట్రిక్ వాహనాలు) పై కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేయాలని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. బ్యాటరీతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ముసాయిదా ప్రకటన ప్రకారం పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సాహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాలుష్యం ఉద్గారాలు వెదజల్లని ఈవీ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పదేళ్ల తర్వాత (2030) కేవలం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నీతి అయోగ్ కూడా సూచనలు చేసిందని తెలుస్తోంది. 2030 నాటికి వాడకంలో విద్యుత్ వాహనాలే ఉండాలన్నదే లక్ష్యం. అలాఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాల వైపు వాహనదారులు చూసేలా రిజిస్ట్రేషన్ చార్జీలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల రెన్యువల్ కోసం కూడా ఎలాంటి చెల్లింపులు జరపనక్కర్లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్లతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ మిగతా అన్ని విద్యుత్ ఆధారిత వాహనాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. కాగా, తమ ఈ నిర్ణయంపై నెల రోజుల లోపు అభిప్రాయాలను తెలుపవచ్చని రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
రూ.250 కోట్లతో రోడ్ల నిర్మాణం
ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ సుబ్బరాయశర్మ గంగలకుర్రు (అంబాజీపేట) : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో రూ.250 కోట్లతో రహదారులను నిర్మించనున్నట్టు ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ పి.సుబ్బరాయశర్మ అన్నారు. కోనసీమలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల స్థితి గతులను, వాటి పరిస్థితిని తెలుసుకునేందుకు శనివారం వచ్చిన ఆయన అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలో జయంతి భాస్కర సుబ్రహ్మణ్యం స్వగృహంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రూ.250 కోట్లతో నిర్మించే రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి మంజూరు నిమిత్తం పంపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 5400 కిలో మీటర్ల రహదారిని, జిల్లాలో 628 కిలో మీటర్ల రహదారిని పంచాయతీ రాజ్ నుంచి ఆర్అండ్బీకి బదలాయించారన్నారు. అత్యవసర, ప్రాముఖ్యమున్న రహదారుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ పనులన్నింటినీ దశలవారీగా చేపడతామన్నారు. అంబాజీపేట మండలంలో మాచవరం, గంగలకుర్రు, పుల్లేటికుర్రు, కె.పెదపూడి, ఇరుసుమండ, మొసలపల్లి గ్రామాలను అనుసంధానం చేస్తూ రూ.8 కోట్లతో రహదారిని నిర్మించనున్నామన్నారు. ఇందులో భాగంగా కె.పెదపూడి కౌశికపై రూ.3 కోట్లతో వంతెన నిర్మిస్తామని, త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. జిల్లాలో గ్రామీణ రహదారుల స్థితిగతులు పరిశీలించనున్నామన్నారు. అయినవిల్లి నుంచి ముమ్మిడివరం వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ ఆరు కిలోమీటర్లు నిర్మించామని, మిగిలిన 4 కిలోమీటర్లకు ప్రభుత్వం నుంచి మంజూరు రావాల్సి ఉందన్నారు. ఉప్పలగుప్తం నుంచి అనాతవరం, అమలాపురం నుండి రావులపాలెం, రాజోలు నుంచి ఈతకోట వరకూ రహదారులు వెడల్పు చేసి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్అండ్బీ స్థలాల్లో ఆక్రమణల తొలగింపునకు స్థానికులు, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. కాకినాడ ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి, అమలాపురం ఈఈ రామచంద్రరావు, డీఈ వైవీ రావు, కొత్తపేట డీఈ వై.రాధాకృష్ణ ఆయన వెంట ఉన్నారు.