The protection of women
-
చెయ్యెత్తితే ఖబడ్దార్!
గృహహింస చట్టం మహిళలకు వరం ‘498 ఎ’ కన్నా ఎక్కువ రక్షణ అమలుకు ప్రత్యేక యంత్రాంగం మరింత అవగాహన అవసరం అతివలకు అడుగడుగునా అవరోధాలే. ఇంటా బయటా వేధింపులే. ఇది అనాదిగా వస్తున్న దురవస్థ. ఒకవిధంగా ఆలోచిస్తే బయటి సమస్యల కన్నా ఇంట్లోని పరిస్థితులే వారిని మరింత కుంగదీస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించడానికి రూపొందించిన గృహహింస చట్టం ఇప్పుడిప్పుడే తన ప్రతాపం చూపిస్తోంది. వేధించేవారి వెన్నులో వణుకు పుట్టి ఇది అతివలకు మరింతగా ఉపయోగపడాలంటే ఈ చట్టం గురించి విస్తృత ప్రచారం జరగాలి. అవగాహన పెరగాలి. విశాఖపట్నం : గృహహింస నుంచి మహిళలను రక్షించేందుకు ప్రవేశపెట్టిన చట్టం మహిళలకు వరం. గృహహింస నివారణ చట్టం 2005-06 అక్టోబర్ 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నెంబర్-43తో ఈ చట్టాన్ని తయారు చేసింది. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు, అభిప్రాయాల వల్ల సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడా స్త్రీ, పురుష సంబంధాలలో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. దుర్భర పరిస్ధితులు ఎదుర్కొనే మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. చాలామంది మద్యానికి బానిసై కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబాలలోని మహిళలు కూడా ఏదో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి సంపాదనను కూడా మద్యం కోసం దుబారా చేసే మగపుంగవులు కోకొల్లలు. మద్యం మత్తులో భార్య, కుమార్తెలను ఇష్టానుసారంగా హింసించే మగ రాక్షసులకు కటకటాల వెనక్కినెట్టడమే కాకుండా మస్తుగా జరిమానాలు కూడా వడ్డించేందుకు చట్టం వీలు కల్పిస్తోంది. గృహహింస.. శారీరకంగాను, మానసికంగాను, ఆర్ధికంగాను, లైంగికంగాను హింస పెట్టడం గృహహింస కిందకే వస్తుంది. ఇంకా బెదిరించడం, భయపెట్టడం దౌర్జన్యానికి పాల్పడడం, ఆరోగ్యాన్ని కుంటుపరిచే చర్యలు కూడా గృహహింసకు సంబంధించినవిగానే పరిగణిస్తారు. చట్టం పరిధి.. ఈ చట్టం ప్రకారం బాధితురాలు, ప్రతివాది మధ్య... భార్యభర్తల సంబంధంతోపాటు ఇతర సంబంధాలు కూడా వర్తిస్తాయి. పుట్టుక ద్వారా, పెళ్లి ద్వారా, దత్తత ద్వారా కలిసివుంటున్నవారు, ఒకే ఇంటిలో కలిసి నివసించే స్త్రీ, పురుషులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. గృహహింసకు గురయినపుడు సంబంధిత మహిళ లేదా ఆమె తరపు బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. అమలు పరిచే వ్యవస్థ రక్షణ అధికారి, న్యాయ సేవల అధికారి, సేవలు అందించే స్వచ్ఛంద సంస్ధలు, ఆశ్రయం అందించే సంస్ధలు, పోలీస్ అధికారి ఈ చట్టాన్ని అమలుపరుస్తారు. జిల్లాలలోని మహిళా, శిశు అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డెరైక్టర్లను ఈ చట్టం కింద రక్షణ అధికారులుగా నియమించారు. ప్రాజెక్టు డెరైక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేస్తారు. సంబంధింత న్యాయమూర్తి దరఖాస్తు అందిన మూడు రోజులలోగా మొదటి వాదన వినాలి. వాదోపవాదాలు విన్న తరువాత 60 రోజులలోగా తుది తీర్పు ప్రకటించవలసి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే ప్రతివాదులకు ఏడాది జైలుశిక్షతోపాటు 20 వేల రూపాయల జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రవాస వంచకులతో ఇబ్బందులు.. ప్రవాస భారతీయులను పెళ్లి చేసుకుని మోసపోయిన మహిళలను గృహహింస చట్టం కూడా ఆదుకోలేకపోతుంది. కేసు వేసినా ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఆయా దేశాలలో నివసిస్తున్న వీరి భర్తలకు సమన్లు అందడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. సమన్లు అందినా కోర్టుకి రాకుండా కాలయాపన చేస్తుండటంతో బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం కావడంతో అమ్మాయిల తల్లిదండ్రులు ముందు, వెనుక చూడకుండా లక్షలాది రూపాయల కట్నం, ఇతర లాంఛనాలతో పెద్ద ఎత్తున వివాహలు జరిపిస్తున్నారు. తీరా కొద్ది కాలానికే తమ కుమార్తె పుట్టింటికి చేరుకోవడంతో తల్లిదండ్రులను అంతులేని ఆవేదన మిగులుతుంది. పోనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహహింస నివారణ చట్టం 2005 కింద న్యాయం జరుగుతుందేమోనని ఫిర్యాదు చేసినా పరిష్కారం మాట దేవుడెరుగు, సమన్లు పంపడానికే పడరానిపాట్లు పడాల్సివస్తోంది. నగరంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-9లోని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్ధ కార్యాలయంలో ఉమెన్‌సెల్ పనిచేస్తోంది. సంస్ధ ప్రాజెక్ట్ డెరైక్టర్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సెల్లో ఒక లీగల్ ఆఫీసర్, ఒక కౌన్సిలర్, మరో ఇద్దరు అసిస్టెంట్ కౌన్సిలర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేస్తున్నారు. వీరు బాధితుల నుంచి ముందుగా ఫిర్యాదు తీసుకుంటారు. త రువాత సంబంధీకులను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తారు. రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తారు. రాజీ కుదరకుంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సంబంధిత కోర్టులో కేసు దాఖలు చేస్తారు. కోర్టులో న్యాయమూర్తి బాధిత మహిళలకు మధ్యంతర భృతి, తరువాత భరణం మంజూరు చేస్తుంటారు. చట్టంలోని నిబంధల ప్రకారం కేసుని 60 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈసెల్‌లో ఎన్ఆర్ఐ కేసులు 20 కావడం గమనార్హం. మొత్తం కేసులు... 2006 నుంచి 2015 జనవరి వరకు ఉమెన్ సెల్లో మొత్తం 1447 కేసులు నమోదు కాగా అందులో 273 కౌన్సెలింగ్‌లు జరుగుతున్నాయి. కోర్టులో సెటిల్ అయినవి 381 కేసులు కాగా, కోర్టులో 793 ప్రోసెస్‌లో ఉన్నాయి. నిర్భయంగా ఫిర్యాదు చేయండి.... గృహహింసకు గురయ్యే మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. బాధితులు నేరుగా మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. నమోదు చేసిన అనంతరం ఒక నివేదిక రూపంలో కోర్టుకి సమర్పిస్తాం. చట్టపరంగా సహయం, ఉచిత న్యాయసేవలు, ఆర్ధికసాయం, పిల్లల సంరక్షణ, ఆశ్రయం, వైద్యసహాయం వంటివి బాధిత మహిళలకు అందజేస్తాం. కోర్టు కేసు విచారణ తెలిపే నోటీసును ప్రతివాదికి అందజేస్తాం. స్వచ్ఛంద సంస్ధల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించి, చట్టప్రకారం వ్యవహరిస్తాం. జిల్లాలోని బాధిత మహిళలు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్ఆర్ఐ కేసులు ఉన్నాయి. అడ్రస్ లేకపోవడంతో ఇబ్బందులు పడవలసి వస్తోంది. -బి.డి.జ్యోతిలత , కౌన్సిలర్ ప్రొటెక్షన్ సెల్, డీఆర్డీఏ కాంప్లెక్స్, సెక్టార్-9, ఎంవీపీ కాలనీ, ఫోన్: 0891-270615 -
ఆమె కోసం... ఓ రక్షణ వలయం - స్వాతీ లక్రా
సమాజంలో ధైర్యంగా జీవించే భరోసాను మహిళలకు ఇవ్వాలి. ఆకతాయిల ఆటలు ఇక సాగవనే నమ్మకం కలిగించాలి. తమ కోసం ఓ నిఘా వ్యవస్థ అండగా ఉందనే అవగాహన తేవాలి. అప్పుడే చక్కటి సమాజం ఆవిష్కృతమవుతుంది... అంటారు స్వాతీ లక్రా. హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనరైన ఆమె ఆకతాయిల నుంచి ఆడవాళ్ళ రక్షణ కోసం రూపొందించిన ‘షీ బృందం’ బాధ్యతలు మోస్త్తున్నారు. సమర్థంగా అమలైతే, సమాజంలో మార్పు తెచ్చే ఈ వినూత్న ప్రయత్నం గురించి ప్రత్యేక కథనం... జార్ఖండ్ రాష్ట్రం, రాంచీలో పుట్టి పెరిగిన స్వాతీ లక్రాతో కొద్దిసేపు మాట్లాడితే సమాజంలో మహిళలు ఎన్ని రకాలుగా టీజింగ్‌కు గురవుతున్నారనే విషయంలో ఆమెకున్న అవగాహన తెలుస్తుంది. మహిళలను ఆదుకోవడానికి నాలుగు సింహాల పోలీస్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే ఆమె అభిలాషలో అంకితభావం కనిపిస్తుంది. ఆలోచనకు మూలం ఇదీ! ‘‘మహిళల రక్షణ కోసం ప్రభుత్వం సెక్యూరిటీ కమిటీలను నియమించింది. ఆ సందర్భంగా మహిళల భద్రత కోసం ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు చేశాం. వాటిలో షీ టీమ్ కూడా ఒకటి. మహిళల రక్షణ కోసం ఓ నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు అన్ని వైపుల నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. ఇక బృందాన్ని నిర్వహించే బాధ్యత నాకప్పగించారు. రెండు వారాలుగా మా షీ బృందాలు నగరంలో పనిచేస్తున్నాయి. ఒక్క ముక్కలో ఇది ‘ఆమె’ కోసం ఓ రక్షణవలయం’’ అని చెప్పుకొచ్చారు హైదరాబాద్ ఎసిపి స్వాతీ లక్రా. తప్పించుకొనే వీలు లేకుండా... రికార్డు! కాలేజ్కెళ్తూ బస్టాపులో వేధింపుకు గురయిన అమ్మాయి సమస్య బస్ ఎక్కి వెళ్లిపోవడంతో అంతమైపోదు. ఆ రోజంతా అది ఆమె మనసును తొలుస్తూనే ఉంటుంది. ఒక్క ఆకతాయి చేష్ట... క్లాసులో పాఠం మీద దృష్టి పెట్టలేనంతగా ఆమె మనసును కలచి వేస్తుంది. అదే ఉద్యోగిని అయితే... ఆ రోజు పని చేయలేకపోవచ్చు. పైగా సున్నిత మనస్కులయితే మానసికంగా కుంగిపోతారు. ధైర్యాన్ని కోల్పోతారు. ఇవన్నీ కలిసి వారిలో ఉన్న సహజమైన నైపుణ్యాలను మరుగున పడేస్తాయి. మానసికంగా అభద్రత కలిగితే మహిళాశక్తి నిర్వీర్యమవుతుంది. మహిళలో పోరాడే సత్తా అంతరించిపోతుంది. వీటన్నింటి నుంచి మహిళను రక్షించే ప్రయత్నమే ఈ షీ బృందం. ‘‘మహిళలు ఇంట్లో ఉన్నంత ధైర్యంగా సమాజంలో సంచరించగలగాలి. ఇంటి నుంచి బయటకు రావడానికి బెంబేలు పడే పరిస్థితులు మారాలి. ధైర్యంగా కాలేజ్కెళ్లగలగాలి, ఆఫీసుకెళ్లగలగాలి. గృహిణి ఒంటరిగా మార్కెట్కెళ్లగలిగిన భరోసా కలిగించడమే మా బాధ్యత. ఆకతాయి చేష్టలను మా బృందం కెమెరాల్లో రికార్డు చేస్తారు కాబట్టి వాళ్లు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు’’ అంటారీ ఐ.పి.ఎస్. అధికారిణి. భరోసా కల్పించే వంద బృందాలు.. ఇంటి నుంచి బయటికొచ్చిన మహిళలు ఎన్ని వేధింపులను ఎదుర్కొంటున్నప్పటికీ నోరెత్తి చెప్పడానికి సందేహిస్తూనే ఉన్నారు. ఆ భయాన్ని తొలగించడం, ఫిర్యాదు చేయగలిగిన ధైర్యాన్ని నింపడమే షీ బృందం ప్రధాన విధి అంటున్నారీ ఎసిపి. ‘‘కాలేజ్‌లకెళ్లి వాళ్ళలో చైతన్యం కలిగించేలా సమావేశాలు పెడతాం. మహిళాసంఘాలు, స్వచ్ఛందసంస్థలు, కాలనీ వాసులు కోరుకుంటే మా ప్రతినిధులు వెళ్లి ప్రసంగిస్తారు. 100 నంబర్‌కి డయల్ చేయమని పదే పదే తెలియచేస్తూ డయల్ చేయగలిగిన ధైర్యాన్ని కల్పిస్తాం. పోలీసులకు చెప్పడం ద్వారా సమస్యకు ముగింపు పలకవచ్చనీ, పోలీసులకు చెప్పడం వల్ల ఇతర సమస్యలేవీ రావనే భరోసా కల్పిస్తాం. అందుకోసం జంటనగరాల్లో వంద బృందాలు పనిచేస్తున్నాయి. అవి బస్సుల్లోనూ ప్రయాణిస్తాయి’’ అని వివరించారు స్వాతి. పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి! ‘‘పిల్లలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా గ్రహిస్తారు. దానిని ఎలా వినియోగిస్తున్నారనే దాని మీదనే భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు నైతిక విలువలను నేర్పించడంతోపాటు వారి కార్యకలాపాలను గమనిస్తుండాలి’’ అంటారు స్వాతీ లక్రా. ఖాళీ సమయాన్ని భర్త, ఇద్దరు పాపలతో గడపడమే తన హాబీ అని చెబుతారీ ఉన్నతాధికారిణి. అన్నట్లు ఆమె భర్త కూడా ప్రభుత్వంలో ఉన్నతాధికారే. ఐఎఎస్ అధికారి అయిన బిఎమ్డి ఎక్కా ఆమె భర్త. హౌసింగ్ బోర్డు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ 1995 బ్యాచ్ విద్యార్థులమని చెబుతూ ముస్సోరీలో శిక్షణ సమయంలో పరిచయమైనట్లు చెప్పారు. ఆశయం, ఆచరణ కలగలిస్తే, అభ్యుదయ సమాజం వైపు పయనం అసాధ్యమేమీ కాదనడానికి స్వాతి సారథ్యంలోని తాజా ప్రయత్నం ‘షీ’ ఒక ఉదాహరణ. - వాకా మంజులారెడ్డి ‘షీ బృందం’ ఏం చేస్తుందంటే... కాలేజ్, బస్టాపు, రైల్వేస్టేషన్, మార్కెట్లలో సంచరిస్తూ నేరస్థులను గుర్తించి అరెస్టు చేస్తారు. ఒక్కో బృందంలో ఐదుమంది వరకు ఉంటారు. ప్రతి బృందంలో విధిగా (సాధారణ పోలీస్ నుంచి అధికారి వరకు) ఓ మహిళ ఉంటుంది. టీనేజ్ పిల్లలు అదీ తొలిసారి అరెస్టయిన వారయితే... పెట్టీ కేసు పెట్టి గట్టిగా మందలిస్తారు. కరడుగట్టిన నేరగాళ్లయితే సెక్షన్ 354, నిర్భయ వంటి తీవ్రమైన కేసులు నమోదవుతాయి. మహిళ పేరు బయటకు రానివ్వకుండా కేసు విచారణ చేస్తారు. మహిళలు ఏం చేయాలంటే..! మగవాళ్లు మాటలతో కానీ, చేష్టలతో కానీ ఏడిపిస్తే 100 నంబరుకు ఫోన్ చేసి తామున్న ప్రదేశాన్ని తెలియచేయాలి. 100కి డయల్ చేసి వివరాలు చెప్తే ఆ సమాచారం ‘షీ బృందా’నికి చేరుతుంది.కాలేజ్ అమ్మాయిలు కానీ, ఉద్యోగినులు కానీ బస్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో రోజూ ఆకతాయిలు వస్తున్నట్లయితే - సమయంతో సహా ప్రదేశాన్ని తెలియచేయాలి. మరుసటి రోజు ఆ సమయానికి అక్కడికి ‘షీ బృందం’ వస్తుంది. ఆకతాయి మగవారికిదో హెచ్చరిక! షీ బృందాలు నగరంలో విస్తృతంగా నిఘా పెడుతున్న విషయం మహిళలో సమాజంలో ధైర్యంగా జీవించవచ్చనే భరోసాను కల్పిస్తుంది. అదే సమయంలో ఆకతాయి మగవారికి హెచ్చరిక జారీ అవుతుంది. స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించకపోతే చిక్కుల్లో పడక తప్పదనే భయం వారిలో సత్ప్రవర్తనను తీసుకువస్తుంది. ఇలా షీ బృందాల వల్ల రెండు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. - స్వాతీ లక్రా, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ -
మహిళలకు రక్షణ కరువు
సాక్షి, ముంబై: మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీ డీఎఫ్ కూటమి ప్రభుత్వం లో మహిళలకు రక్షణ కరువైంది. అత్యాచారాలు పెరిగిపోయాయి. లైంగిక వేధింపులు అధికమయ్యా యి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో దేశంలోనే రాష్ట్రం ఐదో స్థానం ఉంది. ఆడ పిల్లలపై జరుగుతున్న వివిధ నేరాల్లో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా వెలువడిన సర్వేలో ఈ వివరాలు తేలా యి. దీంతో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళలకు భద్రత కల్పించేం దుకు 1994లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందించింది. ఇలాంటి విధానాన్ని రూపొందించడం దేశంలో మహారాష్ట్ర మొట్టమొదటి రాష్ట్రమని ప్రభుత్వం గొప్పలు చెప్పకుంటది. 2013లో మళ్లీ కొత్త విధానాన్ని రూపొందించామని డీఎఫ్ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అందులో మహిళల సంక్షేమానికి వివిధ పథకాలు ప్రవేశపెట్టామని పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేసింది. కానీ వీరి పాలనలో మహిళలకు భద్రత కరువైంది. వా రిపై అత్యాచారాలు పెరిగిపోయాని తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య మరిం త పెరిగి ఆందోళన కలిగిస్తోంది. వార్షిక నివే దిక రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది 17,800 మహిళలపై, 3,456 మంది బాలికలపై అత్యాచారాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. నేరాలను అరికట్టేందుకు ఏటా కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ అదుపులోకి రావడం లే దు. పెరుగుతున్న నేరాల సంఖ్య పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బాలికలపై ఉత్తరప్రదేశలో 6,033, మధ్యప్రదేశ్‌లో 5,168, ఢిల్లీలో 4,462 అ త్యాచారం కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉంది. అదేవిధంగా 2010తో పోలిస్తే 2012లో మహిళలపై వివిధ నేరా లు పెరిగిపోయాయి. అందులో అత్యాచారాలు 1,839, అపహరణ కేసులు 1,140, అదనపు కట్న దాహానికి బలైన కేసులు 7,415, లైంగిక వేధింపుల కేసులు 3,935, ఈవ్‌టీజింగ్ కేసులు 1,294 నమోదయ్యాయి.