కాలువలో ఈతకొడుతూ రాష్ట్ర విభజనకు నిరసన
గుంటూరు: తెనాలి స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు విన్నూతన పద్దతిలో రాష్ట్ర విభజనకు నిరసన తెలిపారు. తెనాలి మండలం జాగర్లముడి బకింగ్హమ్ కాలువలో స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు ఈత కొడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ సభ్యులు తెనాలిలో ఆర్టీసి బస్సును తాళ్లతో లాగారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రోజు నుంచి గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. తెనాలిలో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొంటున్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజీనామా చేయాలని నిన్న తెనాలిలోని ఆయన ఇంటిని ముట్టడించిన విషయం తెలసిందే.