క్షీణించిన సెంట్రల్ బ్యాంక్ లాభం
ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 4% క్షీణించి రూ. 162 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, తాజా క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 6,404 కోట్ల నుంచి రూ. 6,972 కోట్లకు పెరిగింది. 2013-14లో ఆదాయం రూ. 23,528 కోట్ల నుంచి రూ. 26,350 కోట్లకు పెరగ్గా, బ్యాంకు రూ. 1,263 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఎన్పీఏలు 4.8% నుంచి 6.27%కి, నికర ఎన్పీఏలు 2.9% నుంచి 3.75 శాతానికి పెరిగాయి.
దేనా బ్యాంక్ లాభం 49% జంప్: క్యూ4లో దేనా బ్యాంక్ లాభం 49 శాతం ఎగిసి రూ. 187 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో ఇది రూ. 126 కోట్లు. ఇక ఆదాయం రూ. 2,540 కోట్ల నుంచి రూ. 2,867 కోట్లకు పెరిగింది.