provocative speeches
-
అరుంధతి రాయ్‌పై ఉపా కేసు
న్యూఢిల్లీ: 2010లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా)’ కింద రచయిత్రి అరుంధతి రాయ్‌పై విచారణ జరపడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీలో 2010 అక్టోబరు 21న ‘ఆజాదీ.. ది ఓన్లీ వే’ పేరిట జరిగిన సదస్సులో అరుంధతి రాయ్, కశీ్మర్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అభియోగం. -
రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు.. సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. భిన్న కులమతాలు, వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘననే అని స్పష్టం చేసింది. ఇకపై అలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని హితవు పలికింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అడ్వైజరీ జారీ చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై స్పందిస్తూ గత నెల 30న నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో చేసిన ఎన్నికల ప్రసంగంలో కేసీఆర్ రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, ఈసీ విచారణకు ఆదేశించింది. స్థానిక రిటర్నింగ్ అధికారి విచారణ చేసి ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. దీంతో ఇకపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని ఈసీ అడ్వైజరీ జారీ చేసింది. చదవండి: తెలంగాణ రాజకీయాల్లో ‘డ్రామా’ లేదు: రాంగోపాల్‌వర్మ -
ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్
సినీ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే గత నెల 31వ తేదీ స్థానిక మదురవాయిల్‌లో హిందూ మున్నని సమాఖ్య హిందువుల పరిరక్షణ కోసం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కణల్ కన్నన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరంగం ఆలయం ఎదురుగా, దేవుడిపై నమ్మకం లేని పెరియార్ విగ్రహాన్ని బద్దలు కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. దీంతో తందై పెరియార్ ద్రవిడ కావడం చెన్నై జిల్లా కార్యదర్శి కుమరన్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కణల్ వ్యాఖ్యల వీడియో ఆధారాలను పొందుపరిచారు. వీడియో ఆధారాలను పరిశీలించిన చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కణల్ కన్నన్ పరారయ్యారు. 13 రోజుల తర్వాత పుదుచ్చేరిలో తలదాచుకుంటున్న సమాచారం అందడంతో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ వెళ్లి సోమవారం కణల్ కన్నన్ను అరెస్ట్ చేసి చెన్నై తీసుకొచ్చారు. చదవండి: (సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నటి స్నేహ ఫ్యామిలీ ఫోటోలు) -
ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు: కేకే
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ప్రయోజనాల కోసం అక్కడి పార్టీలు తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను ఇప్పటిదాకా దోపిడీ, విధ్వంసం చేసినవారే తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని, అక్కడి రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడి ప్రజలను అవమానించడం మంచిదికాదన్నారు. తెలంగాణ ప్రజల సహనానికి ఒక హద్దు ఉంటుందని, దాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని కేకే హెచ్చరించారు. మూడింట రెండొంతుల బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు.