ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు: కేకే | don't test patience of people: KK | Sakshi
Sakshi News home page

ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు: కేకే

Published Fri, May 2 2014 1:32 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు: కేకే - Sakshi

ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు: కేకే

సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ప్రయోజనాల కోసం అక్కడి పార్టీలు తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను ఇప్పటిదాకా దోపిడీ, విధ్వంసం చేసినవారే తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 సీమాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని, అక్కడి రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడి ప్రజలను అవమానించడం మంచిదికాదన్నారు. తెలంగాణ ప్రజల సహనానికి ఒక హద్దు ఉంటుందని, దాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని కేకే హెచ్చరించారు. మూడింట రెండొంతుల బంపర్ మెజారిటీతో టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement