k.keshava rao
-
సర్వే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు: కేకే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేపై నెలకొన్న అపోహాలపై టీఆర్ఎస్ నేత కే.కేశవరావు స్పందించారు. సమగ్ర సర్వే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడానికి కాదని కేకే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఇచ్చిన పిలుపుకు సానుకూలంగా స్పందించి ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారని కేకే అన్నారు. సమగ్ర సర్వేను గ్రామ సభల రూపంలో మరోసారి నిర్వహిస్తామని కేకే వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అనుకున్న విధంగా సర్వే లక్ష్యం పూర్తయిందని కేకే అన్నారు. -
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే
లోక్‌సభాపక్ష నాయకుడిగా పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభలో పార్టీకి చెందిన ఏకైక సభ్యుడు కె.కేశవరావును నియుమించారు. లోక్‌సభాపక్ష నాయుకుడుగా వుహబూబ్‌నగర్ ఎంపీ ఎ.పి. జితేందర్‌రెడ్డిని నియుమిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ వుుఖ్యవుంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉపనేతగా బి.వినోద్‌కువూర్, విప్‌గా కడియుం శ్రీహరి వ్యవహరిస్తారు. టీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచిన వారిలో జితేందర్‌రెడ్డి, వినోద్ తప్ప మిగిలిన వారంతా కొత్తవారే. రాష్ట్ర రాజకీయూల్లో సీనియుర్ అరుునా కడియుం శ్రీహరి మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యూరు. జితేందర్‌రెడ్డి వుహబూబ్‌నగర్ నుంచి రెండోసారి గెలుపొందగా, వినోద్‌కువూర్ గతంలో హన్మకొండ నుంచి, ఈసారి కరీంనగర్ నుంచి ఎన్నికయ్యూరు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయుకుడి పదవి కోసం వీరిద్దరూ పోటీపడ్డారు. అరుుతే, కేసీఆర్ సావూజికవర్గానికే చెందినవారు కావడం, రాష్ట్రంలో హరీశ్‌రావు, కేటీఆర్‌లకు అదే వర్గం నుంచి వుంత్రి పదవులు దక్కడం వినోద్కువూర్కు మైనస్‌గా వూరింది. గతంలో బీజేపీలో క్రియూశీలంగా వ్యవహరించడం, జాతీయుస్థారుులో వుంచి సంబంధాలు ఉండడం జితేందర్‌రెడ్డికి కలిసివచ్చిన అంశవుని పార్టీ నాయుకులు పేర్కొంటున్నారు. పార్టీనేతగా తనను నియుమించినందుకు కేసీఆర్‌కు కేకే కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జాతీయు స్థారుులో అవసరమెప్పుడు వచ్చినా శాయుశక్తులా కృషిచేస్తానన్నారు. -
ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు: కేకే
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ప్రయోజనాల కోసం అక్కడి పార్టీలు తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణను ఇప్పటిదాకా దోపిడీ, విధ్వంసం చేసినవారే తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని, అక్కడి రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడి ప్రజలను అవమానించడం మంచిదికాదన్నారు. తెలంగాణ ప్రజల సహనానికి ఒక హద్దు ఉంటుందని, దాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని కేకే హెచ్చరించారు. మూడింట రెండొంతుల బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. -
'సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రలోనే పని చేయాలి'
దళిత సీఎం అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టలేదని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు (కేకే) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... తెలంగాణ ప్రయోజనాలను ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని సీఎం చేస్తామని ఆయన తెలిపారు. కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఇంకా తమ పార్టీ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులంతా ఆంధ్రప్రదేశ్‌లోనే పని చేయాలని కేకే అభిప్రాయపడ్డారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే దళిత కులానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తానని కేసీఆర్ వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆ అంశాన్ని కేసీఆర్ విస్మరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు మాట తప్పారంటూ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఇవ్వమని.... తృతీయ ప్రంట్‌ను మద్దతు ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. -
వచ్చిన రాష్ట్రాన్ని ఇక దేవుడు కూడా ఆపలేడు
కోయిల్‌కొండ, న్యూస్‌లైన్: అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్ర నాయకులు కాదు..ఆ దేవుడు కూడా వచ్చి ఆపలేడని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు తేల్చిచెప్పారు. శనివారం మండలకేంద్రంలో జరిగిన పార్టీ మండలస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ..గత పదేళ్లకాలంలో తెలంగాణ సాధనకోసం చేసిన యువకుల త్యాగాలను సువర్ణఅక్షరాలతో లిఖించాల్సి ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగే సమయంలో సీమాంధ్ర నాయకులు అనేక కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఎలాంటి షరతులు లేని తెలంగాణ ఏర్పాటు చేయకుంటే మరోమారు మహోద్యమం తప్పదని హెచ్చరించారు. సీమాంధ్ర నాయకులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తమ ఆస్తులను కాపాడుకోవడానికే అనేక నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే సహించం తెలంగాణ ఇచ్చి హైదరాబాద్‌ను యూటీ చేస్తే మాత్రం సహించేది లేదని నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన డిమాండ్‌చేశారు. సీమాంధ్రులు వెళ్లిపోతే ఈ ప్రాంతంలో 1.50లక్షల ఉద్యోగాలు ఈ ప్రాంత యువకులకు దొరుకుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా టీఆర్ఎస్ అధికారంలోకిరాగానే ప్రతి నియెజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, అమరవీరుల కుటుంబానికి ఐదెకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు, 100 ఎమ్మెల్యే సీట్లను దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే కేంద్రప్రభుత్వం దిగొచ్చి అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్‌రావు ఆర్యా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, మాజీమంత్రి పి.చంద్రశేఖర్, నాయకులు ఇబ్రహీం, ఆపార్టీ మండల అధ్యక్షులు గోపాల్‌గౌడ్, మండల నాయకులు వాయిద్, లక్ష్మారెడ్డి, విష్ణు, మోహన్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. అంగుళం కూడా వదులుకోం.. జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: తెలంగాణలో అంగుళం కూడా వదులుకోమని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి తేల్చిచెప్పారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేకరాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అథితిగృహంలో విలేకరులతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి భిన్నంగా తెలంగాణ ఇస్తే మహోద్యమాన్ని నిర్మించేందుకు పార్టీని, కార్యకర్తలను ప్రజలను సన్నద్ధం చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధంచేస్తున్నామని చెప్పారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా కో కన్వీనర్ బెక్కెం జనార్దన్, నాయకులు మోహన్‌బాబు, కోట్లకిషోర్, కృష్ణముదిరాజ్, మిట్టే నర్సింహా, రవి, ఆంజనేయులు, మహేష్, చెన్నకేశవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ
నల్లగొండ, న్యూస్‌లైన్: కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగానే కేంద్రం తెలంగాణను ప్రకటించిందని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. శనివారం పట్టణంలోని ఎస్బీఆర్ గార్డెన్లో జరిగిన పార్టీ నల్లగొండ పట్టణ, మండల స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రావడంతో కిరికిరిలు మొదలయ్యాయని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని భిక్షగా ఇవ్వలేదని, పోరాడితేనే ఇచ్చారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో పోరాటాలు నిర్వహించారని అయినప్పటికీ గాంధీనే కొలుస్తామన్నారు. అదే తరహాలో తెలంగాణ ఉద్యమంలో ప్రపంచ చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతాడన్నారు. రాబోయే తెలంగాణలో విద్యార్థులే కథనాయకులు అవుతారన్నారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణలోని నీళ్లు, నిధులు, విద్య తదితర అంశాలపై జరుగుతున్న దోపిడీని చూడలేకే కేసీఆర్ తన భుజస్కంధాలపై ప్రత్యేక రాష్ట్ర నినాదమెత్తుకున్నారని, ఆ స్థాయిలోనే వివిధ పార్టీలను సైతం ఢిల్లీ స్థాయిలో కదిలించి తెలంగాణపై మళ్లించారన్నారు. ధూం... ధాం.. సృష్టికర్త కూడా కేసీఆర్‌నే అన్నారు. హైదరాబాద్ జేఏసీ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని, సంపూర్ణ తెలంగాణ సాధించుకునేవరకు అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోకవర్గ ఇన్చార్జ్ చకిలం అనిల్‌కుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన మహిళా సర్పంచ్‌లను సన్మానించారు. సమావేశంలో పార్టీ మహిళా, ఎస్సీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు మాలె శరణ్యారెడ్డి, మైనం శ్రీనివాస్, ఫరీదుద్దీన్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ పుట్టం పురుషోత్తం, జిల్లా, మండల నాయకులు సురేందర్, రామారావు, అభిమన్యు శ్రీనివాస్, సుగుణమ్మ, లింగమ్మ, లింగయ్యగౌడ్, శేఖర్‌గౌడ్, నాగార్జున, మహేందర్నాథ్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
థర్డ్ అంపైర్ చెబితే వినాల్సిందే: శ్రీధర్‌బాబు
థర్డ్ అంపైర్ చెబితే వినాల్సిందే ఉపాధ్యాయ గర్జనలో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి లక్ష్యంగా పరోక్ష విమర్శలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనమేనని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ‘‘యుద్ధం అయిపోయింది. మేం గెలిచాం. అంతిమ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. అయితే ఇంకా చివరి బంతి ఉందని అంటున్నారు. అంటే నో బాల్ వేస్తే పది పరుగులు గుంజవచ్చనే యత్నంలో ఉన్నారు. కానీ మ్యాచ్ అయిపోయింది. థర్డ్ అంపైర్‌పై నమ్మకం ఉంచాలి. ఆయన చెప్పినప్పుడు మైదానం వీడివెళ్లాలి. క్రీ డాస్ఫూర్తి ఉన్నవాళ్లు చేయాల్సిందిదే. ఆ క్రీడాస్ఫూర్తి ఉంది కాబట్టే మంత్రులమైనా, ఎమ్మెల్యేలమైనా ఓపిగ్గా ఉన్నాం. నేను చెప్పినా, సీఎం చెప్పినా, ఎవరేం చెప్పినా సీడబ్ల్యూసీ చేసిన తీర్మానమే శిలాశాసనం. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తథ్యం..’’ అని చెప్పారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ పీఆర్టీయూ నిర్వహించిన ‘ఉపాధ్యాయ గర్జన’లో శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీల నేతలతో పాటు కొందరు సొంతపార్టీ నేతలు కూడా సీఎంపై ధ్వజమెత్తారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘కొందరు పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారు. 1955లో నెహ్రూ ఏమన్నారు? తెలంగాణ ప్రజలు ఎప్పుడు విడిపోవాలని కోరుకుంటే అప్పుడు తెలంగాణ ఇవ్వాల్సిందేనని అన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయిన సంగతి గుర్తుతెచ్చుకోవాలి. 60 శాతం తమిళులే ఉన్నారని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఆనాడు అయ్యదేవర కాళేశ్వరరావు చెప్పారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా అందుకే. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామంటున్నవారు చరిత్ర చూడాలి. హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డవారే అభివృద్ధి చెందారు తప్ప వారు హైదరాబాద్‌కు చేసిందేమీ లేదు. నీళ్లు, ఉద్యోగాలంటూ.. హైదరాబాద్ విషయంలో రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించవద్దు. నీటి సమస్య వస్తుందంటున్నవాళ్లు ఇన్నేళ్లు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేదెందుకు? మనవాళ్లు బెంగళూరులో చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతమాత్రాన బెంగళూరు మనది అనడం సమంజసమా? న్యూయార్క్‌లోనూ, వాషింగ్టన్లోనూ చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతమాత్రాన అవి మనవే అంటే ఊరుకుంటారా? ప్రపంచంలోని ఏ రాజ్యాంగంలోనూ అలా లేదు..’ అని అన్నారు. కరీంనగర్ పర్యటన సందర్భంగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామని సీఎం చెప్పారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు మాటమార్చి వెధవ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఆయన మాటలు వింటుంటే కడుపులో మండుతోంది. సీఎం పదవి నిలుపుకునేందుకు మూడేళ్లుగా అధిష్టానం మాటకు సరేనని ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఆయన తెలుగు జాతిని విడగొట్టవద్దని అంటున్నారు. అసలు ఆయనకు తెలుగువచ్చా? ఆయన భాష ఎవరికైనా అర్థమవుతుందా? నా ఇంటి వెనకాలే ఉంటారు. ఆయన మాటలు కానీ, బొత్స సత్యనారాయణ మాటలు కానీ నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. మేం ఆంటోనీ కమిటీ వద్దకు వెళ్లినప్పుడు హైదరాబాద్ సంగతేంటని అడిగారు. ఒకటే ఉదాహరణ చెప్పాం. తిరుపతికి వెళ్లినప్పుడు అక్కడ హుండీలో డబ్బులు వేస్తాం. అంతమాత్రాన తిరుపతి మాక్కావాలంటే కుదురుతుందా అని అడిగాం. కమిటీకి బోధపడింది. తెలంగాణ వచ్చితీరుతుంది..’ అని పేర్కొన్నారు. పట్టుచీరల షోరూములు ఎక్కడికీ వెళ్లవు..! సమన్యాయం చేస్తామన్నవాళ్లు సీమాంధ్రకు కావాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలని గుత్తా సూచించారు. రాజధాని ఎక్కడ ఉండాలో, ఎలాంటి రక్షణ కావాలో చెప్పాలి తప్ప విభజనను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ‘‘సీమాంధ్ర మంత్రుల భార్యలు ఢిల్లీ వెళ్లి విభజనను అడ్డుకోవాలని చూశారు. తల్లీ మీ పట్టుచీరల షోరూములు ఎక్కడికీ వెళ్లవు. మీ రాజధానిలో కూడా పెద్ద పెద్ద షోరూములు వస్తాయి. సీమాంధ్ర మంత్రులు కూడా రాష్ట్రాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు. మా నోటికాడి బుక్క లాక్కోకండి. అన్నదమ్ముల్లా కలిసి ఉందాం..’’ అని అన్నారు. మేం కలిసి ఉండమంటే యాసిడ్ పోసి బెదిరించి కలిసి ఉండాల్సిందేనన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదని కేశవరావు అన్నారు. ముఖ్యమంత్రి నీటివివాదాల గురించి మాట్లాడుతున్నారంటూ.. నీటి పారుదల శాఖ మంత్రి వెంటనే దానిపై వివరణ ఇచ్చిన సంగతి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి మాటల్లో కొంచెం కూడా సిగ్గూ లజ్జా లేదని విమర్శించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యే ముఖ్యమంత్రి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటుపై ఇంకా ఆలస్యం చేస్తే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. చంద్రబాబు జూలై 30 కంటే ముందు ఒకలా, ఇప్పుడు మరొకలా ఊగిసలాట ధోరణితో ఉన్నారని సీపీఐ నేత చాడ విమర్శించారు. గర్జనసభకు తెలంగాణ పది జిల్లాల నుంచి భారీగా ఉపాధ్యాయులు తరలివచ్చారు. పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటరెడ్డి, పి.సరోత్తమరెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి ప్రసంగించారు. -
కాంగ్రెస్‌తో దిలీప్‌కు సంబంధమేంటి ? : ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కె.దిలీప్‌కుమార్‌కు కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏమిటని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేతలతో మాట్లాడించి, కాంగ్రెస్‌లో చేర్పిస్తుంటే ఏమనుకోవాలన్నారు. ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ దిలీప్ ఎలా ప్రకటిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర సంపన్నుల చేతిలో పావుగా మారి, ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారన్నారు. తెలంగాణకుచెందిన మహిళా ఉద్యోగులపై సీమాంధ్రులు దాడి చేయడం హేయమని ఈటెల విమర్శించారు. మహిళలపై దాడులకు దిగడమే సీమాంధ్ర సంస్కృతా అని ప్రశ్నించారు. ఇలాంటివి మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈటెల హెచ్చరించారు. టీ-ఉద్యోగులపై దాడి అమానుషం : కేకే సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేయడం అమానుషమని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమం లో తాము ఏనాడు సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు చేయలేదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం మింట్ కంపౌండ్‌లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగులపై జరిగిన దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీ నామా చేస్తే రెండేళ్ల ముందే తెలంగాణ వచ్చేదన్నారు. ధర్నాలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, తెలంగాణ విద్యుత్ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. విడిపోయే ముందు విద్వేషాలు వద్దు గుంటూరులో తెలంగాణకు చెందిన గ్రూప్-1 అధికారి హనుమంత నాయక్‌పై జరిగిన దౌర్జన్యాన్ని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర గౌడ్ ఖండించారు. విడిపోయే ముందు విద్వేషాలు పనికి రావన్నారు. ప్రాంతాలను బట్టి అధికారులపై దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని ఆయన హితవుపలికారు.