టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే | K.Keshava Rao as TRS' leader in Parliament | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే

Published Wed, Jun 4 2014 1:27 AM | Last Updated on Thu, Mar 28 2019 5:34 PM

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే - Sakshi

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే

  • లోక్‌సభాపక్ష నాయకుడిగా పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి
  •  సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభలో పార్టీకి చెందిన ఏకైక సభ్యుడు కె.కేశవరావును నియుమించారు. లోక్‌సభాపక్ష నాయుకుడుగా వుహబూబ్‌నగర్ ఎంపీ ఎ.పి. జితేందర్‌రెడ్డిని నియుమిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ వుుఖ్యవుంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉపనేతగా బి.వినోద్‌కువూర్, విప్‌గా కడియుం శ్రీహరి వ్యవహరిస్తారు. టీఆర్‌ఎస్ ఎంపీలుగా గెలిచిన వారిలో జితేందర్‌రెడ్డి, వినోద్ తప్ప మిగిలిన వారంతా కొత్తవారే. రాష్ట్ర రాజకీయూల్లో సీనియుర్ అరుునా కడియుం శ్రీహరి మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యూరు.
     
    జితేందర్‌రెడ్డి వుహబూబ్‌నగర్ నుంచి రెండోసారి గెలుపొందగా, వినోద్‌కువూర్ గతంలో హన్మకొండ నుంచి, ఈసారి కరీంనగర్ నుంచి ఎన్నికయ్యూరు. టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నాయుకుడి పదవి కోసం వీరిద్దరూ పోటీపడ్డారు. అరుుతే, కేసీఆర్ సావూజికవర్గానికే చెందినవారు కావడం, రాష్ట్రంలో హరీశ్‌రావు, కేటీఆర్‌లకు అదే వర్గం నుంచి వుంత్రి పదవులు దక్కడం వినోద్‌కువూర్‌కు మైనస్‌గా వూరింది.
     
    గతంలో బీజేపీలో క్రియూశీలంగా వ్యవహరించడం, జాతీయుస్థారుులో వుంచి సంబంధాలు ఉండడం జితేందర్‌రెడ్డికి కలిసివచ్చిన అంశవుని పార్టీ నాయుకులు పేర్కొంటున్నారు. పార్టీనేతగా తనను నియుమించినందుకు కేసీఆర్‌కు కేకే కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జాతీయు స్థారుులో అవసరమెప్పుడు వచ్చినా శాయుశక్తులా కృషిచేస్తానన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement