ఇస్రో సిగలో మరో కలికితురాయి: వైఎస్ జగన్
పీఎస్ఎల్వీ సి-34 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఈ ప్రయోగం ఇస్రో సిగలో మరో కలికితురాయి అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్నవారందరి పట్ల తాము చాలా గర్వంగా ఉన్నామని, ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.
పీఎస్ఎల్వీ సి-34 రాకెట్ ద్వారా ఒకేసారి నింగిలోకి 20 ఉపగ్రహాలను విజయవంతంగా పంపి ఇస్రో మరో ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఒకేసారి కేవలం 10 ఉపగ్రహాలను మాత్రమే పంపిన ఇస్రో.. ఇపుడు ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించింది. అందులో మూడు మాత్రమే స్వదేశీ ఉపగ్రహాలు కాగా, మిగిలిన 17 విదేశీ ఉపగ్రహాలు కావడంతో.. ఇది వాణిజ్యపరంగా కూడా చాలా విజయవంతమైన ప్రయోగంగా మిగిలింది.
Successful launch of PSLV C-34 is an another unique feather in ISRO's cap. We're proud of all those involved and I congratulate them.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 22 June 2016