ఇస్రో సిగలో మరో కలికితురాయి: వైఎస్ జగన్ | another unique feather in isro cap, tweets ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఇస్రో సిగలో మరో కలికితురాయి: వైఎస్ జగన్

Published Wed, Jun 22 2016 11:27 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

another unique feather in isro cap, tweets ys jagan mohan reddy

పీఎస్ఎల్వీ సి-34 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఈ ప్రయోగం ఇస్రో సిగలో మరో కలికితురాయి అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్నవారందరి పట్ల తాము చాలా గర్వంగా ఉన్నామని, ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

పీఎస్ఎల్వీ సి-34 రాకెట్ ద్వారా ఒకేసారి నింగిలోకి 20 ఉపగ్రహాలను విజయవంతంగా పంపి ఇస్రో మరో ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఒకేసారి కేవలం 10 ఉపగ్రహాలను మాత్రమే పంపిన ఇస్రో.. ఇపుడు ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించింది. అందులో మూడు మాత్రమే స్వదేశీ ఉపగ్రహాలు కాగా, మిగిలిన 17 విదేశీ ఉపగ్రహాలు కావడంతో.. ఇది వాణిజ్యపరంగా కూడా చాలా విజయవంతమైన ప్రయోగంగా మిగిలింది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement