ప్రజాభిప్రాయంతోనే జిల్లాలు ఏర్పాటు చేయాలి
న్యూశాయంపేట : ప్రజాభిప్రాయ సేకరణతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ బెటర్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. జిల్లా లు, మండలాల ఏర్పాటుపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ప్రజల ఆందోళలను పరిగణనలోకి తీసుకోని జిల్లాల ఏర్పాటు చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఉద్భవించే రాజ్యాంగ సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత కనిపించడం లేదన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, ప్రజాభిప్రాయానికి అ నుగుణంగా చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఫోరం నాయకులు దివాక ర్, ఎ.ప్రభాకర్‌రెడ్డి, పాపిరెడ్డి, యాదగిరి, వీరభద్రుడు, ప్రభాకర్ పాల్గొన్నారు.