10 మంది ఎర్ర చందనం దొంగల అరెస్ట్
కర్నూలు: కర్నూలు మండలం పూలతోట గ్రామ శివారులోని తుంగభద్ర నది నీటి గుంతల్లో దాచి ఉంచిన 81 ఎర్ర చందనం దుంగలు, మారుతీ వాహనంలో ఉంచిన 153 సండ్ర, నారాప కొయ్యలను అటవీశాఖ అధికారులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 50 లక్షలకు పైగా ఉంటుందని, ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు.