వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి
తాడిపత్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వర్గీయుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా పులిప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... రాజారెడ్డి, భార్య వరలక్ష్మి, వారి బంధువులు వెంకట్రామిరెడ్డి, రంగనాథరెడ్డి, నరసింహులుపై అదే గ్రామంలోని టీడీపీ వర్గీయులు జయరామిరెడ్డి, సావిత్రమ్మ, సంగప్ప, విజయేశ్వరిలు రాళ్లు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారన్న అక్కసుతో కక్షగట్టి... మూడు రోజుల క్రితం వివాహ మెరవాణి విషయాన్ని సాకుగా తీసుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత రాజారెడ్డి, భార్యపై దాడి చేశారు. దాడి విషయం తెలసుకుని వారి బంధువులు ప్రశ్నించగా వారిపైనా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో రాజారెడ్డి, వరలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుల్ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.