pump-house
-
Kaleshwaram Project: లక్ష్మీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లకు భారీ నష్టం?
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో వరదకు మునిగిన మోటార్లలో ఆరింటికి భారీగా నష్టం కలిగినట్టు తెలుస్తోంది. గత నెల 14న భారీ వర్షాలకు పంపుహౌస్ అంతా వరదతో నిండిపోవడం తెలిసిందే. ఆ సమయంలో పంపుహౌస్‌లోని భారీ పీవోటీ క్రేన్లు రెండు, రెండు లిఫ్ట్‌లు, ఫుట్‌పాత్ ఐరన్ నిచ్చెనలు కూలి మోటార్లపై పడ్డట్లు సమాచారం. రక్షణ గోడ 12, 13, 14, 15, 16, 17 వరకు మొత్తం ఆరు మోటార్ల మీద కూలిపోయినట్టు సమాచారం. దీంతో అవి «అక్కడక్కడా ధ్వంసమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. మోటార్ల మరమ్మతుల కోసం ఇంజనీరింగ్ అధికారులు డిజైన్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. 11 రోజులుగా నీటి తోడకం పనులు సాగుతున్నాయి. మంగళవారం మోటార్లు బయటికి తేలాయి. బురద, ఇతర పనుల కోసం కాళేశ్వరం సిరొంచ, అర్జునగుట్ల పరిధి నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. వరద నీరు 20 రోజులుగా నిల్వ ఉండడంతో పనికి వచ్చిన కూలీలు జ్వరాలు, అలర్జీల బారిన పడుతున్నారు. పంప్‌హౌస్‌లోకి వరదకు విష పురుగులు కొట్టుకొచ్చి మృతి చెందడంతో దుర్గంధం వెదజల్లుతున్నట్టు తెలిసింది. -
బాధ్యత కాదు.. టైం పాస్!
పంప్‌హౌస్‌లో సిబ్బంది పేకాట పుల్కల్: ఓ వైపు వర్షకాలంలోనూ గ్రామీణ ప్రాతాల్లో తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే... నీటిని పంపింగ్ చేయాల్సిన సిబ్బంది మాత్రం దర్జాగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి రోజూ జూదం అడుతూ కాలక్షేపం చేస్తున్నారు. మండల పరిధిలోని పోచారం సత్యసాయి వాటర్ సప్లయ్ చేసే విభాగంలో పని చేసేందుకు పంపింగ్ ఆపరేటర్లను నిమించారు. విడతలవారీగా విధులు నిర్వహిస్తున్నారు. 24 గంటల పాటు నీటిని పంపింగ్ చేస్తూ ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత వీరిపై ఉంది. పంప్‌హౌస్‌లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ దర్జాగా మధ్యాహ్నం మొదలుకొని అర్ధరాత్రి వరకు పేకాట ఆడుతున్నారు. పంపింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అటు వైపు దృష్టి సారించడం లేదు. ఎప్పుడైనా సమస్య వస్తే కిందిస్థాయి సిబ్బందిని అక్కడికి పంపించి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. వారంలో ఒక రోజైన ానీటి పంపింగ్ కేంద్రాన్ని పరిశీలించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడంలేదు. ఇక్కడ పని చేస్తున్న వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో వారి స్నేహితులను సైతం రప్పించి పంప్‌హౌస్‌లోనే జూదం ఆడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. 69 గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేయల్సిన పోచారం పంప్‌హౌస్‌లో సిబ్బంది సక్రమంగా నీటిని పంపింగ్ చేయని కారణంగా పలు గ్రామాలకు నీరు అందడం లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు మంజీరలో నీరు లేక పంపింగ్ చేయలేదు. ప్రస్తుతం నీరున్నా సిబ్బంది మాత్రం పంపింగ్ చేయడం లేదు. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణను వివరణ కోరగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.