కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో వరదకు మునిగిన మోటార్లలో ఆరింటికి భారీగా నష్టం కలిగినట్టు తెలుస్తోంది. గత నెల 14న భారీ వర్షాలకు పంపుహౌస్ అంతా వరదతో నిండిపోవడం తెలిసిందే. ఆ సమయంలో పంపుహౌస్‌లోని భారీ పీవోటీ క్రేన్‌లు రెండు, రెండు లిఫ్ట్‌లు, ఫుట్‌పాత్ ఐరన్ నిచ్చెనలు కూలి మోటార్లపై పడ్డట్లు సమాచారం. రక్షణ గోడ 12, 13, 14, 15, 16, 17 వరకు మొత్తం ఆరు మోటార్ల మీద కూలిపోయినట్టు సమాచారం.
దీంతో అవి «అక్కడక్కడా ధ్వంసమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. మోటార్ల మరమ్మతుల కోసం ఇంజనీరింగ్ అధికారులు డిజైన్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. 11 రోజులుగా నీటి తోడకం పనులు సాగుతున్నాయి. మంగళవారం మోటార్లు బయటికి తేలాయి. బురద, ఇతర పనుల కోసం కాళేశ్వరం సిరొంచ, అర్జునగుట్ల పరిధి నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. వరద నీరు 20 రోజులుగా నిల్వ ఉండడంతో పనికి వచ్చిన కూలీలు జ్వరాలు, అలర్జీల బారిన పడుతున్నారు. పంప్‌హౌస్‌లోకి వరదకు విష పురుగులు కొట్టుకొచ్చి మృతి చెందడంతో దుర్గంధం వెదజల్లుతున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment