motors
-
Souo s2000 GL: బైకులలో బాహుబలి!.. 2000 సీసీ ఇంజిన్ (ఫోటోలు)
-
‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
సాక్షి, అమరావతి: వ్యవసాయమే దండగన్న చంద్రబాబు పాలనలో కాలం చెల్లిన ట్రాన్స్ఫార్మర్ల వల్ల వ్యవసాయ మోటార్లు పదే పదే కాలిపోయేవి. సరిగ్గా విద్యుత్ సరఫరా లేక.. నీరు అందక పంటలు ఎండిపోయేవి. అదే చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయ పంపుసెట్ల నాణ్యత పెంచుతానంటూ కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అది కూడా.. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాన్ని కాపీ కొట్టేసి మరీ తన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పంపుసెట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వ్యవసాయంతో పాటు మున్సిపాలిటీలు, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా విద్యుత్ ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లు అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చడం ద్వారా పంపుసెట్ల జీవిత కాలాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంది. కొత్త సాంకేతికతతో మోటారు తయారీ.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటీరియర్ పరి్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్(ఐపీఎంఎస్‌ఎం) సాంకేతికతతో ‘ఎనర్జీ ఎఫీషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్’ను ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ తయారు చేసింది. దీని ద్వారా విద్యుత్‌ను భారీగా ఆదా చేయవచ్చు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) నిధులతో తొలుత కొన్ని వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్‌ఎం సాంకేతికత ప్రయోగాత్మక అమలుకు ఏపీఈపీడీసీఎల్ శ్రీకారం చేపట్టింది. ఐపీఎంఎస్ మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయం. పవర్ ఫ్యాక్టర్ మెరుగుదలకు, మోటారు మన్నికను పెంచడానికి దోహదపడతాయి. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లు కాగా.. ఐపీఎంఎస్ మోటారు సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుంది. ఇండక్షన్ మోటారుతో పోల్చుకుంటే 30 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. టీటీడీ, మున్సిపాలిటీల్లోనూ విద్యుత్ ఆదా పంపుసెట్లు ప్రపంచ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ సామర్థ్య సాంకేతికతలను వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల.. విద్యుత్ బిల్లులపై చేస్తున్న వ్యయంలో దాదాపు 10 శాతం ఆదా అయ్యే అవకాశముందని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా టీటీడీలోని పాత పంప్సెట్ల స్థానంలో ఈ ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చుతోంది.అలాగే ప్రస్తుతం మున్సిపాలిటీల్లో వినియోగిస్తున్న మోటార్ల స్థానంలో విద్యుత్‌ను ఆదా చేయగల స్టార్ రేటెడ్ పంపుసెట్లను అమర్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూనుకుంది. దీనిపై మున్సిపల్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా వ్యవసాయ మోటార్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించే వెసులుబాటు కలిగింది. ఇప్పటికే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఫీడర్లను ఆధునీకరించింది. వాటి ద్వారా మోటార్లకు వెళ్లే విద్యుత్‌లో ఇంకా ఏవైనా లోపాలుంటే స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుసుకుని వెంటనే సరిచేయడం ద్వారా పంపుసెట్ల నాణ్యత పెరుగుతోంది. సీఎం జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఇంత చేస్తుంటే.. అధికారంలో ఉండగా ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు మోసపూరిత హామీలతో మరోసారి రైతులను, ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. -
నేడే ‘పాలమూరు’ ఎత్తిపోత.. ప్రాజెక్టు విశేషాలివే..
ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. స్విచ్ నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ వెంటనే నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడికి చేరుకున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత కొల్లాపూర్ పట్టణ శివారులో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. – సాక్షి, హైదరాబాద్ 8 రోజులు.. 2 టీఎంసీలు శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి దక్షిణ తెలంగాణలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 1,200 గ్రామాలకు తాగునీటిని అందించడానికి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 6.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్ పనులు పాక్షికంగానే పూర్తయ్యాయి. నార్లాపూర్ వద్ద 145 మెగావాట్ల భారీ సామర్థ్యంతో 8 బాహుబలి పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, 3 పంపుల పనులు మాత్రమే చేపట్టారు. అందులో ఒక పంపు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటి ఎత్తిపోతను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒక పంపు ద్వారా 8 రోజుల పాటు నీళ్లను ఎత్తిపోసి 2 టీఎంసీలను రిజర్వాయర్‌లో నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో స్టేజీ లిఫ్టులో భాగంగా నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లను ఎత్తిపోసే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా ఐదు స్టేజీల్లో నీళ్లను ఎత్తిపోసి మొత్తం 67.52 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఆరు రిజర్వాయర్లలో వేయాల్సి ఉండగా, ఆ మేరకు పనులు పూర్తి కాలేదు. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, సొరంగాల పనులు 80 శాతం పూర్తయ్యాయని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35,200 కోట్లు కాగా గత మార్చి నాటికి రూ.23,684 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రెండో విడత ప్రాజెక్టు చేపడితేనే సాగునీరు... ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 5 రిజర్వాయర్లలో కొంతమేరకు నీళ్లను నింపి పెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. (చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను ప్రభుత్వం అనధికారికంగా విరమించుకుంది). అయితే రిజర్వాయర్ల నుంచి నీళ్లను తాగు, సాగునీటి అవసరాలకు తరలించేందుకు అవసరమైన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పనులను ఇంకా ప్రారంభించలేదు. పర్యావరణ అనుమతులు లభించిన తర్వాత ఈ పనులను రెండో విడతలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల ప్రాజెక్టును ప్రారంభించినా తక్షణ ప్రయోజనాలు ఉండవు. రెండో విడత పనులు పూర్తైన తర్వాతే ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కలశాల్లో గ్రామాలకు కృష్ణా జలాలు సాక్షి, నాగర్‌కర్నూల్: సీఎం కేసీఆర్ శనివారం నార్లాపూర్ జలాశయం వద్ద కృష్ణా జలాల్లోకి పూలు వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత పాలమూరులోని అన్ని గ్రామ పంచాయతీలకు కృష్ణా జలాలను కలశాల్లో పంపిణీ చేయన్నారు. ఈ ప్రక్రియలో ఆయా మండలాల ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు పాలుపంచుకోనున్నారు. కృష్ణా జలాలతో పాలమూరు వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని దేవతామూర్తులకు అభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 4 గంటల పాటు కేసీఆర్ పర్యటన కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఉదయం బస్సులో బయలుదేరతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని తేజ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. 3 గంటలకు నార్లాపూర్ పంపుహౌస్‌కు చేరుకుని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు స్టేజ్–1లోని మొదటి మోటారును ప్రారంభిస్తారు. 3.50 గంటలకు అక్కడి నుంచి కొల్లాపూర్‌కు బయలుదేరుతారు. 4.30 గంటలకు సింగోటం చౌరస్తాలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.30 గంటలకు సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. ‘పాలమూరు–రంగారెడ్డి’ విశిష్టతలెన్నో.. ► ఆయకట్టు:12.30 లక్షల ఎకరాలు ► జల వనరు: శ్రీశైలం జలాశయం ► ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు: 1.50 టీఎంసీలు ► లిఫ్టుల స్టేజ్‌లు: 5 ► రిజర్వాయర్ల సంఖ్య: 6 ► నీటినిల్వ సామర్థ్యం: 67.52 టీఎంసీలు ► పంపుల గరిష్ట సామర్థ్యం: 145 మెగావాట్లు ► నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు: 672 మీటర్లు ► సొరంగ మార్గం పొడవు: 61.57 కిలోమీటర్లు ► ప్రధాన కాలువల పొడవు: 915.47 కిలోమీటర్లు ► తాగునీటికి వినియోగం: 7.15 టీఎంసీలు ► పరిశ్రమలకు కేటాయింపులు : 3 టీఎంసీలు ► సాగునీటికి కేటాయింపులు : 79.00 టీఎంసీలు ►నాలుగు పంప్‌హౌసుల్లో 145 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన మొత్తం 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం. ఇందులో 3 పంపులను అత్యవసర సమయాల్లో స్టాండ్‌బైగా వినియోగించనున్నారు. ► మోటార్లను దేశీయ దిగ్గజ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ తయారు చేయడం విశేషం ►ఏదుల పంప్‌హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్దదైన సర్జ్ పూల్ ►అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డు బద్ధలు. ►145 మెగావాట్ల సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్ల వినియోగం -
మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన లేదు: అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని.. సీఎం కేసీఆర్ కేవలం రైతులను రెచ్చగొట్టేందుకే ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన.. మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో 17 మంది ఆదర్శ రైతులు, రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, కేసీఆర్ పాలన, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న సీఎం కేసీఆర్ ఆరోపణలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అమిత్‌షా.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టేందుకే కేసీఆర్ అర్థంపర్థంలేని వాదనలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. అలాంటి ఆలోచన కేంద్రానికి లేదన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటికి వెళ్లిందని.. పంట నష్టపోతున్న రైతులు పరిహారం రాక అన్యాయానికి గురవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని, రైతు ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు.. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టిసారించాలని అమిత్‌షా సూచించారు. బీమా లేక నష్టపోతున్నాం.. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలుగాక నష్టపోతున్నామని కొందరు రైతులు అమిత్‌షా దృష్టికి తీసుకొచ్చారు. తెల్కపల్లి మండలానికి చెందిన లావణ్య అనే మహిళా రైతు మాట్లాడుతూ.. తనకు పదెకరాల భూమి ఉందని, గతంలో వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని చెప్పారు. కొంత భూమిని అమ్మేసి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టానని, దీనితో లాభాలు ఆర్జిస్తున్నానని తెలిపారు. దీనిపై అమిత్‌షా స్పందిస్తూ.. సేంద్రియ వ్యవసాయంతో ఎంతో మేలు జరుగుతుందని, తాను కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని పేర్కొన్నారు. తనవద్ద మేలుజాతి ఆవులు ఉన్నాయని.. అందులో ఒకటి 12వ జనరేషన్ గోమాత అని చెప్పారు. ఆ గోమాతకు మహాలక్ష్మిగా నామకరణం చేసి తన మనవడికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు. ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో ఇబ్బంది ఉందని కొందరు రైతులు షా దృష్టికి తీసుకురాగా.. త్వరలో అమూల్ ద్వారా సేంద్రియ ఉత్పత్తులను సేకరించేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని అన్నారు. చదవండి: కుటుంబ పాలనకు చరమగీతం -
లక్ష్మీ పంపుహౌస్‌లో బయటపడిన మోటార్లు! 28 రోజుల తర్వాత
కాళేశ్వరం: భారీ వర్షాలు, గోదావరి వరదతో నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్లు పైకి తేలాయి. నిజానికి పంపుహౌస్ నీట మునిగినప్పటి నుంచీ మీడియాను, బయటి వ్యక్తులెవరినీ అనుమతించ డం లేదు. పరి స్థితి ఏమిటన్న ది గోప్యంగా ఉంచారు. అయి తే మోటార్లు, పంపులు నీటి లోంచి బయటికి తేలిన, దెబ్బతిన్న వీడి యోలు గురువారం బయటికి వచ్చాయి. అధికారులు ఈ నెల 6వ తేదీ నాటికి నీటిని తోడేసే పని పూర్తయిందని, బురద తొలగింపు, క్లీనింగ్ పనులు చేస్తున్నారని తెలిసింది. అతి భారీ వరదతో.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత నెల 14న గోదావరి, ప్రాణ హిత నదులు ఉగ్రరూపం దాల్చి.. కాళేశ్వరం వద్ద 16.90 మీటర్ల ఎత్తులో, 28.90 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం నమోదైన విషయం తెలిసిందే. దీనితో అప్రోచ్ కెనాల్ నుంచి వచ్చిన వరద హెడ్ రెగ్యులేటరీ గేట్ల లీకేజీ కారణంగా ఒక్కసారిగా ఫోర్‌బేకు చేరింది. ఈ ఒత్తిడికి ఫోర్‌బే రిజర్వాయర్‌కు, పంపుహౌస్‌కు మధ్య ఉన్న బ్రెస్ట్ వాల్ (రక్షణ గోడ) కూలిపోయి మోటార్లు, పంపులపై పడింది. అదే సమయంలో పైన బరువులు ఎత్తేందుకు అమర్చిన 220 టన్నుల బరువైన రెండు ఈఓటీ క్రేన్లు, రెండు లిఫ్ట్‌లు, రెండు ఫుట్‌పాత్ ఐరన్ నిచ్చెనలు విరిగిపడ్డాయి. దీంతో ఆరు మోటార్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. ఈ మోటార్లను విదేశాల నుంచి ఆయా సంస్థల ఇంజనీర్లు వచ్చి పరిశీలించాల్సి ఉంది. అయితే పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్ల స్థానంలో కొత్తవి అమర్చాలని.. మిగతా వాటికి మరమ్మతులు అవసరమని రాష్ట్ర ఇంజనీర్లు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇక వరదలు తగ్గుముఖం పడితే రక్షణ గోడ నిర్మాణానికి అనువుగా ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారని.. రక్షణ గోడను పంపుహౌస్ పొడవునా నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. -
Kaleshwaram Project: లక్ష్మీ పంపుహౌస్‌లో ఆరు మోటార్లకు భారీ నష్టం?
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో వరదకు మునిగిన మోటార్లలో ఆరింటికి భారీగా నష్టం కలిగినట్టు తెలుస్తోంది. గత నెల 14న భారీ వర్షాలకు పంపుహౌస్ అంతా వరదతో నిండిపోవడం తెలిసిందే. ఆ సమయంలో పంపుహౌస్‌లోని భారీ పీవోటీ క్రేన్లు రెండు, రెండు లిఫ్ట్‌లు, ఫుట్‌పాత్ ఐరన్ నిచ్చెనలు కూలి మోటార్లపై పడ్డట్లు సమాచారం. రక్షణ గోడ 12, 13, 14, 15, 16, 17 వరకు మొత్తం ఆరు మోటార్ల మీద కూలిపోయినట్టు సమాచారం. దీంతో అవి «అక్కడక్కడా ధ్వంసమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. మోటార్ల మరమ్మతుల కోసం ఇంజనీరింగ్ అధికారులు డిజైన్లు తయారు చేస్తున్నట్లు సమాచారం. 11 రోజులుగా నీటి తోడకం పనులు సాగుతున్నాయి. మంగళవారం మోటార్లు బయటికి తేలాయి. బురద, ఇతర పనుల కోసం కాళేశ్వరం సిరొంచ, అర్జునగుట్ల పరిధి నుంచి కూలీలను తీసుకువస్తున్నారు. వరద నీరు 20 రోజులుగా నిల్వ ఉండడంతో పనికి వచ్చిన కూలీలు జ్వరాలు, అలర్జీల బారిన పడుతున్నారు. పంప్‌హౌస్‌లోకి వరదకు విష పురుగులు కొట్టుకొచ్చి మృతి చెందడంతో దుర్గంధం వెదజల్లుతున్నట్టు తెలిసింది. -
పొద్దంతా కూలి పని.. అందరూ నిద్రపోయాక అసలు పని మొదలుపెడతారు
సాక్షి,హుజూరాబాద్: పొద్దంతా వ్యవసాయ పొలాల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. ఎక్కడెక్కడ వ్యవసాయ మోటార్లు ఉన్నాయి.. ఏఏ ప్రాంతాలు దొంగతనాలకు అనుకూలంగా ఉన్నాయి.. అనేది అంచనా వేసుకుంటున్నారు. చీకటిపడి, అందరూ నిద్రపోయాక తమ పనిని సులువుగా కానిచ్చేస్తారు. వ్యవసాయ బావులు, కెనాల్ కాలువలకు ఏర్పాటుచేసిన మోటార్లను చోరీచేసి హైదరాబాద్ తీసుకెళ్లి అమ్మేస్తారు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటారు. ఇలా చోరీ చేసిన మోటార్లను అమ్మేందుకు తరలిస్తూ.. తని ఖీల్లో పట్టుపడిన అంతర్జిల్లా దొంగల ముఠాను ఇల్లందకుంట పోలీసులు అరెస్ట్‌చేయగా.. ఇందుకు సంబంధించిన వివరాలు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డితో కలిసి హుజూరాబాద్ పోలీసు స్టేషన్లో సోమవారం వెల్లడించారు. డీసీపీ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన ఒర్సు మహేశ్, వరికుప్పల నరసింహ, ఒర్సు భరత్, మరో ఇద్దరు మైనర్లు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. జల్సాలకు అలవాటు పడిన వీ రు వచ్చేసొమ్ము సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇళ్లలో దొంగతనాలు చేస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుందని, వ్యవసాయమోటార్లు అయితే ఎలాంటి సమస్య ఉండదని భావించారు. కొద్దిరోజులుగా హుజూరాబాద్ ప్రాంతంలో పొద్దంతా రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రి సమయ ంలో రైతులు వ్యవసాయం నిమిత్తం ఎస్సారెస్పీ కె నాల్కు బిగించిన మోటార్లను దొంగలించసాగారు. తనిఖీల్లో చిక్కి.. హుజూరాబాద్ డివిజన్ ప్రాంతంలో ఇటీవల చోరీచేసిన మోటార్లు ఓ చోట భద్రంగా దాచారు. సోమవారం ఎనిమిది మోటార్లు అమ్మేందుకు కారు, ట్రాలీఆటోలో హైదరాబాద్ బయల్దేరారు. ఇదే సమయంలో ఇల్లందకుంట ఎస్సై తిరుపతి తన సిబ్బందితో కలసి మండల కేంద్రంలోని చౌరస్తాలో తనిఖీలు చేస్తున్నారు. కారు, ట్రాలీలోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో విచా రించేందుకు ప్రయత్నించగా.. పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వాహనాలు, ఎనిమిది మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఇప్పటికే హుజూరా బాద్‌లో మూడు, ఇల్లంతకుంట ఒకటి, ఎల్కతుర్తిలో ఒక కేసు ఉందని, ఇప్పటి వరకు వీరు 38 మోటార్లు దొంగలించారని, అందరినీ రిమాండ్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐలు వీరబత్తిని శ్రీనివాస్, ఎర్రళ్ల కిరణ్æ, సురేశ్, ఎస్సై తిరుపతి, పీసీలు మోహన్, మహేందర్, సూర్యను డీసీపీ అభినందించారు. చదవండి: భిక్షాటన చేస్తుంటే చేరదీసి స్కూల్‌కి పంపారు.. రెండు నెలల తర్వాత.. -
40 కిలోమీటర్ల ప్రయాణం, ఖర్చు 10పైసలే
ట్రెండ్ మారుతోంది. ఆ ట్రెండ్‌కు తగ్గట్లు మారకపోతే వెనకబడిపోతాం. అది మనుషులైనా..వస్తువులైనా. ప్రపంచ దేశాల్లో ఆర్ధిక సంక్షోభం, దానికితోడు పెరిగిపోతున్న పెట్రో ధరలతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గుచూపుతున్నారు. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. వారి ఇష్టాలకు అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల్ని తయారు చేసే పనిలో పడ్డాయి. 10 పైసల ఖర్చుతో తాజాగా నహాక్ మోటార్స్ సంస్థ గరుడ, జిప్పీ పేర్లతో కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. సంప్రదాయ పద్దతిలో పెడల్స్ తొక్కుతూ ఈ సైకిల్‌పై ప్రయాణం చేయవచ్చు. అదే విధంగా పెడల్స్ తొక్కకుడా బ్యాటరీ సాయంతో వెళ్లిపోవచ్చు. ఈ సైకిల్లో లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చారు. వీటిని ఒక్క సారి చార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల ప్రయాణం చేయచ్చని కంపెనీ హామీ ఇస్తోంది. బ్యాటరీ ఛార్జింగ్‌కి అతి తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటుందని, ఒకసారి ఛార్జింగ్ చేస్తే అక్షరాల 10 పైసలకు మించి విద్యుత్ ఖర్చు అవదని కంపెనీ చెబుతోంది. ధర ఇలా ప్రస్తుతం మా ర్కెట్లో గరుడ మోడల్ ధర 31,999 రూపాయలు ఉండగా జిప్పీ ధర రూ. 33,499గా నిర్ణయించినట్లు నహాక్ మోటార్ తెలిపింది. . -
సాగుకు మీటర్లు.. రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి!!
వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించక తప్పేటట్లు లేదు. ఎలాగైనా విద్యుత్ సంస్కరణలను అమల్లోకి తేవాలని పట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఈ మేరకు ఒత్తిడి తెస్తోంది. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులకు, డిస్కమ్‌లకు కేంద్ర విద్యుత్ కార్పొరేషన్ల నుంచి ప్రతినెలా అందుతున్న రుణాలను తాజాగా నిలిపివేసింది. యథావిధిగా ఈ రుణాలు పొందాలంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని, విద్యుత్ వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి తేల్చిచెప్పింది. ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటే... రైతు వినియోగించిన విద్యుత్తుకు (బిల్లుకు) సమానమైన నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసుకోవచ్చని కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు– 2020 చెబుతోంది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను బిగిం చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి పెంచింది. వ్యవ సాయంతో సహా అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరిగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అంగీకారం తెలపాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఒత్తిడిని తీవ్రం చేసింది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలను గట్టెక్కిం చేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో భారీ ఎత్తున సంస్కరణల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గతేడాది విద్యుత్ సవరణ బిల్లు–2020ను ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీలను అనుమతించడం, వినియోగదారులకు నేరుగా నగదు బదిలీ(డీబీటీ) ద్వారా విద్యుత్ రాయితీలు అందించడం, ప్రతి వినియోగదారుడికి విద్యుత్ మీటర్‌ను ఏర్పాటు చేయడం, పెరుగుతున్న విద్యుత్ సరఫరా వ్యయానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లులను పెంచడం వంటి సంస్కరణలను ఈ బిల్లు ద్వారా కేంద్రం ప్రతిపాదించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును రాష్ట్రంలో అమలు చేయబోమని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. బిల్లులోని పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ సైతం రాశారు. మీటర్లతో రుణాలకు మెలిక.. ఈ బిల్లుపై అభిప్రాయ సేకరణ జరిపిన కేంద్ర ప్రభుత్వం త్వరలో దీనిని చట్టసభల్లో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు ఈ బిల్లు అమలు కోసం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే పలు ప్రాజెక్టులకు, డిస్కమ్‌లకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)ల నుంచి ప్రతి నెలా తీసుకుంటున్న రుణాలు ఆపేసింది. రుణాల చెల్లింపులను పునరుద్ధరించడానికి విద్యుత్ వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సైతం మీటర్లు ఏర్పాటు చేయాలన్న షరతులను అంగీకరించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కోరినట్టు రాష్ట్ర విద్యుత్ సంస్థల అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మీటర్ లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్ ఇవ్వరాదని, ఈ మీటర్లు స్మార్ట్ ప్రీపెయిడ్ అయి ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గతంలోనే పేర్కొంది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు ఏవైనా మినహాయింపులు అవసరమైతే తప్పనిసరిగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సరైన కారణాలు తెలిపి అనుమతి పొందాలని ఈ నిబంధనల్లో పొందుపర్చింది. ప్రస్తుత పరిణామాలు చూస్తే భవిష్యత్తులో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించక తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయానికి మీటర్లు బిగించడానికి కానున్న వ్యయాన్ని తామే భరిస్తారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. నగదు బదిలీకి మీటర్ తప్పనిసరి.. ప్రస్తుతం రాష్ట్రంలో 25 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అవుతున్న ఖర్చును ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీల రూపంలో అందిస్తోంది. వ్యవసాయ విద్యుత్ రాయితీలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల విద్యుత్ బిల్లులు కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు రూ.10 వేల కోట్ల రాయితీలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2020 అమల్లోకి వస్తే నేరుగా ప్రభుత్వం డిస్కంలకు విద్యుత్ రాయితీలు ఇవ్వడానికి వీలు ఉండదు. భవిష్యత్తులో వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించి... వారి నుంచి ముందస్తుగా బిల్లులు వసూలు చేయాలని కేంద్రం కోరుతోంది. ఎంత మొత్తం డబ్బుకు రీచార్జి చేసుకుంటే అంతకు సరిపడా విద్యుత్ సరఫరా అవుతుందన్న మాట. వినియోగదారులు చెల్లించిన బిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న రాయితీలను నేరుగా వారికి నగదు బదిలీ రూపంలో చెల్లించాలని విద్యుత్ బిల్లులో కేంద్రం పేర్కొంది. బిల్లు రాకకు ముందే వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయవచ్చని కేంద్రం ఈ నిబంధనను సమర్థించుకుంటోంది. ఉచిత విద్యుత్ వినియోగించే రైతులు... ఎవరు ఎంత విద్యుత్ వినియోగించారో తెలుసుకుని బిల్లులు వేయాలంటే తప్పనిసరిగా ప్రతి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు మీటర్‌ను బిగించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అప్పుడే విద్యుత్ బిల్లులోని నిబంధనల ప్రకారం సంబంధిత రైతుల ఖాతాలకు ప్రభుత్వం రాయితీలు బదిలీ చేయడానికి అవకాశం కలగనుంది. వినియోగం లెక్కలు తేలాలని.. ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్‌లో 30 శాతం వాటా వ్యవసాయ విద్యుత్‌దేనని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి శాస్త్రీయత లేదు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో పాటు వ్యవసాయ ఫీడర్లకు సైతం మీటర్లు లేకపోవడంతో వాస్తవానికి వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతుందో చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు ట్రాన్స్మిషన్ నష్టాలు, వాణిజ్యపర నష్టాల (ఏటీ అండ్సీ)ను తగ్గించి చూపడానికి డిస్కంలు వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్ గణాంకాలను అడ్డగోలుగా పెంచేసి చూపుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి ఏటా రూ.వందలు, వేల కోట్ల నష్టాలను వ్యవసాయ విద్యుత్ ఖాతాలో వేసేస్తున్నాయని విమర్శలున్నాయి. ఈ అడ్డగోలు లెక్కలకు అంతం పలకానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు మీటర్‌ను బిగించి... 100 శాతం నెట్ మీటరింగ్ సాధించాలని చాలా కాలంగా రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తోంది. తాజాగా గత కొన్నిరోజులుగా ఈ ఒత్తిడి మరింత తీవ్రమైందని అధికారులు పేర్కొంటున్నారు. -
నీట మునిగిన ‘కేఎల్ఐ’ మోటార్లు
సాక్షి, నాగర్‌కర్నూల్/కొల్లాపూర్ రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) మొదటి లిఫ్ట్ మోటార్లు నీట మునిగాయి. కొల్లాపూర్ నియోజకవర్గం కృష్ణానది తీరంలోని ఎల్లూరు వద్ద కేఎల్ఐ మొదటి లిఫ్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం 1, 3వ మోటార్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మూడో మోటార్ నీటిని ఎత్తిపోసే పైపులైన్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల సర్జ్‌పూల్ పక్కనే గల భూగర్భంలోని ఐదు మోటార్లు నీట మునిగాయి. లీకేజీ ఏర్పడి నీరు మోటార్లకు వస్తుండగా అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు మొదటి మోటార్‌ను, సాయంత్రం 3.40 గంటలకు మూడో మోటార్‌ను ప్రారంభించారు. మూడో మోటార్ ఆన్‌చేసిన 10 నిమిషాల తర్వాత ఆ మోటార్ కింద ఉన్న బేస్మెంట్ బ్లాస్ట్ కావడం వల్ల నీళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. లిప్ట్‌లోని 45 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చాయి. లిఫ్ట్‌లోని ఎనిమిది అంతస్తులతో పాటు ప్యానల్ బోర్డు సహా నీట మునిగాయి. ఈ విషయంపై కేఎల్ఐ ఎస్ఈ అంజయ్యను వివరణ కోరగా.. మోటార్లు లీక్ కావడం వల్ల నీరు వచ్చిందని, డీ వాటరింగ్ చేస్తామని వివరించారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతే వెల్లడిస్తామని తెలిపారు. కాగా కేఎల్ఐ మొదటి లిఫ్ట్ వద్ద 2015లో కూడా ఇదే విధంగా మోటార్లు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి రాత్రి 10 గంటల సమయంలో ఘటన జరిగిన ఎల్లూరు వద్ద కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీంచారు. సాంకేతిక లోపం వల్లే.. మంత్రి నిరంజన్ రెడ్డి కొల్లాపూర్ రూరల్: కేఎల్ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్ట్‌లో సాంకేతిక లోపం వల్ల వరద నీరు వచ్చి ఐదు పంపులు మునిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సమస్యపై ప్రస్తుతం ఎలాంటి పరిష్కారం దొరకదని, నీటిని డీవాటరింగ్ చేస్తే తప్ప.. విషయం చెప్పడానికి వీలుకాదని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి మునిగిపోయిన పంపులను ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాగునీటి కోసం మిషన్‌భగీరథ పథకం అవసరం నిమిత్తం మధ్యాహ్నం 2.54 నిమిషాలకు మొదటి లిఫ్ట్‌లోని మొదటి పంపును ప్రారంభించారు. 3.45 నిమిషాలకు మూడో పంపును ప్రారంభించిన వెంటనే పెద్ద ఎత్తున మోటార్ల శబ్ధం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ సమస్యను సాంకేతిక లోపంగా గుర్తించామని పేర్కొన్నారు. -
ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు
ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు యంత్రం అందుబాటులో ఉంటుంది. రైతులు ఆన్లైన్ ద్వారా లేదా వలంటీర్ల ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్ సర్వే ద్వారా ఎక్కడ బోరు తవ్వాలన్నది శాస్త్రీయంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాతే బోరు బావి తవ్వుతారు. ఆ సర్వే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కోసారి ఎంత సర్వే చేసినా నీరు పడకపోవచ్చు. అందుకే రెండో బోరు కూడా వేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే ఉన్న బోరు ఒక వేళ ఫెయిల్ అయితే, అక్కడ కూడా రైతులకు బోరు వేయి స్తాము. వారు దరఖాస్తు చేసుకుంటే చాలు. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అర్హులైన రైతులందరి పొలాల్లో ఉచితంగా బోర్లు వేయడంతో పాటు చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో బోర్లు వేయిస్తామని చెప్పామని, కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటారు కూడా ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం దాదాపు మరో రూ.1,600 కోట్లు వ్యయం అవుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా అమలు చేస్తామన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, వారికి ఏనాడూ అన్యాయం చేయదని చెప్పారు. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ‘వైఎస్సార్ జలకళ’ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, ఎంపీ, అధికారులు తదితరులు మాట నిలబెట్టుకుంటున్నాను ► రైతు కోసం మన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో మాట నిలబెట్టుకుంటున్నాం. నా 3,648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశాను. వారికి తోడుగా ఉంటానని మాట ఇచ్చాను. ► నాడు ఇచ్చిన మాట ప్రకారం 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాలు.. మొత్తంగా 163 నియోజకవర్గాల్లో ఇవాళ బోరు యంత్రాలు ప్రారంభిస్తున్నాం. ► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లనే ఇది సాధ్యం అవుతోంది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల బోర్లు తవ్వడమే కాకుండా, వాటికి కేసింగ్ పైపులు కూడా వేస్తాం. ఈ పథకంపై వచ్చే 4 ఏళ్లలో రూ.2,340 కోట్లు ఖర్చు చేస్తామని గర్వంగా చెబుతున్నాము. మరో అడుగు ముందుకు.. ► నాడు 2004లో నాన్నగారు రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఇవాళ మరో అడుగు ముందుకు వేస్తూ, రైతులకు ఉచితంగా బోరు బావి తవ్విస్తున్నాము. తద్వారా లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుంది. మెట్ట ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయి. ► రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మోటార్లు (పంపు సెట్లు) ఉన్నాయి. వాటి సగటు సామర్థ్యం 7.5 హెచ్‌పీ. అంటే గంటకు 5 యూనిట్ల విద్యుత్ కావాలి. రోజుకు 9 గంటల సరఫరా అంటే ఒక్క రోజుకు మొత్తం 45 యూనిట్లు. ఇవాళ ఒక్కో యూనిట్ ధర రూ.6.87. ఆ విధంగా నెలకు ఒక్కో రైతుకు బోరు ద్వారా రూ.9,274 మేర ప్రయోజనం కలుగుతుంది. ఫీడర్ల కెపాసిటీ పెంచాం ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి, ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.8,655 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ మొత్తం చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా బకాయి పెట్టింది. అయినా చిరునవ్వుతో చెల్లించాం. ► రైతులకు పగలే ఉచితంగా 9 గంటలు విద్యుత్ ఇవ్వడం కోసం 85 శాతం ఫీడర్ల కెపాసిటీ పెంచాం. తగిన మౌలిక వసతులు కల్పించాం. రానున్న రోజుల్లో మిగతా ఫీడర్ల సామర్థ్యం కూడా పెంచుతాం. ఇందు కోసం గత 16 నెలలుగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం. నాణ్యమైన విద్యుత్ కోసమే ► ఉచిత విద్యుత్‌కు మీటర్ల ఏర్పాటుపై విచిత్ర వాదనలు చేస్తున్నారు. లోడు తెలుసుకుని మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలి పోకుండా జాగ్రత్త పడడం కోసమే మీటర్లు బిగించాలని నిర్ణయించాం. లోడు, ఓల్టేజీ ఎంతో స్పష్టంగా తెలిసినప్పుడు ఫీడర్ల కెపాసిటీ పెంచి, నాణ్యమైన విద్యుత్‌ను రైతుకు ఒక హక్కుగా ఇస్తాం. ► రైతులు తమ చేతుల మీదుగా ఆ బిల్లులు కడతారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు నేరుగా అందిస్తుంది. అప్పుడు రైతులు నాణ్యమైన విద్యుత్ కోసం డిమాండ్ చేయవచ్చు. ► రైతుల ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు రూ.2.50 మాత్రమే. అందువల్ల 30 ఏళ్లు క్వాలిటీ పవర్ ఇస్తాం. రైతుల కోసం ఎన్నెన్నో.. ► గత ప్రభుత్వం వదిలి పెట్టి పోయిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సేకరణ బకాయిలు చెల్లించాం. ► రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 సహాయం చేస్తున్నాం. సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బీమా ప్రీమియమ్ అమలు చేస్తున్నాం. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50కే సరఫరా చేస్తున్నాం. గత ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. ► ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. అక్కడి నుంచే నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా చేస్తున్నాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు చేశాం. ► రాబోయే రోజుల్లో ఈ–క్రాపింగ్ ద్వారా రైతుల పొలం వద్దే పంటల కొనుగోలు జరుగుతుంది. ఆర్బీకేల వద్ద గోదాములు, క్వాలిటీ నిర్ధారణ కోసం అసైన్డ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తాం. ఈ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటవుతాయి. మండల కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రతి గ్రామంలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, జి.జయరాం, సీదిరి అప్పలరాజు, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం రైతులకు ఎంతో మేలు ఎందరో సీఎంల వద్ద ఎమ్మెల్యేగా పని చేశాను. కానీ ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలు నిలబెట్టుకున్న సీఎంను తొలిసారి చూస్తున్నాను. ఏ రాష్టంలో కూడా ఈ స్థాయిలో పథకాలు అమలు చేయడం లేదు. వైఎస్సార్ జలకళ పథకం కింద ఇవాళ 2 లక్షల బోర్లు తవ్వబోతున్నాం. అన్ని జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతులకు ఈ పథకం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిజంగా ఇది రైతు ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకంపై ప్రశంసలు ఉచితంగా బోర్లు వేయించడమే కాకుండా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని చెప్పడం సంతోషంగా ఉందని పలువురు రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని సీఎం జగన్ సోమవారం ప్రారంభించిన అనంతరం వివిధ జిల్లాల నుంచి రైతులు నేరుగా సీఎంతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఎంతో ఉపయోగం నేను చిన్న రైతును, రెండున్నర ఎకరాల మెట్ట భూమి ఉంది. ఆ భూమిలో కొద్దిపాటి పంటలు వేసుకుని జీవిస్తున్నాను. ఈ మూడు నెలల తర్వాత మా పంటలకు నీరుండదు. అప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు మీ నిర్ణయం వల్ల మా లాంటి రైతు లెందరికో ఎంతో ఉపయోగం. బోర్లు వేయించడమే కాకుండా మా లాంటి వాళ్లకు మోటార్లు కూడా ప్రభుత్వమే బిగిస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రైతులందరి తరఫున మీకు కృతజ్ఞతలు. – సింహాచలం నాయుడు, కొమరాడ మండలం, విజయనగరం ఆనందంగా ఉంది నేను గతంలో కూలి పనికి వెళ్లే దాన్ని. నాకు ప్రభుత్వమే 2.70 ఎకరాల భూమి ఇచ్చింది. ఇందులో కరువు పనుల కింద చెట్లు, రాళ్లు తీసి ఇచ్చారు. మామిడి మొక్కలు కూడా ఇచ్చారు. నాకు రైతు భరోసా కూడా వచ్చింది. మీ పథకాల పుణ్యమా అని నా ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు ఉచితంగా బోర్ వేసి, మోటార్ బిగిస్తామంటే చాలా సంతోషంగా ఉంది. – లక్ష్మీదేవి బాయి, దండరాయిపల్లి తండా, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం మీ దయతో చిన్న రైతునవుతున్నా నాకు కొద్ది పాటి పొలం ఉంది. అయితే దీని వల్ల లాభం లేకపోవడంతో ఉపాధి హమీ పనులతో బతుకుతున్నాం. ఇప్పుడు మీరు ఉచితంగా బోరు తవ్వించి.. ఉచితంగా మోటారు బిగించి.. ఉచితంగా విద్యుత్ కూడా ఇస్తామని చెబుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు జీవితకాలం రుణపడి ఉంటాం. ఇది నిజంగా రైతు ప్రభుత్వం. నేను ఎప్పటికీ ఉపాధి కూలీగా మిగిలిపోతానేమో అనుకున్నా. కానీ మీ దయతో చిన్న రైతుగా మారుతున్నాను. – గురుస్వామి, పులిచర్ల మండలం, చిత్తూరు దేశం అంతా మీ వైపు చూస్తోంది వైఎస్సార్ జలకళ ద్వారా మీరు రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారనడంలో సందేహం లేదు. మీరు రెండు అడుగులు కాదు.. మూడు అడుగులు ముందుకు వేశారు. అడక్కుండానే మీరు రైతులకు వరాలిస్తున్నారు. మీరు అధికారంలోకి రాగానే వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. రైతు పక్షపాతిగా ఉన్న మీ ప్రభుత్వం పదికాలాల పాటు కొనసాగాలి. దేశం అంతా మీ వైపు చూస్తోంది. – డి.ఏసుపాదం, తిరువూరు మండలం, కృష్ణా -
బాహుబలులన్నీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని గాయత్రి (ప్యాకేజీ–8) పంప్‌హౌస్‌లోని బాహుబలి మోటార్ల న్నింటికీ పరీక్షలు పూర్తయ్యాయి. నిర్ణీత రెండు టీఎంసీల మేర గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా గాయత్రి పంపింగ్ కేంద్రం సిద్ధమైంది. అతితక్కువ సమయం లో పంపింగ్ కేంద్రాన్ని నిర్మించ డంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ కొత్త రికార్డు సృష్టించింది. ఎల్లంపల్లి దిగువన ఉన్న నందిమేడారం పంప్‌హౌస్ పరిధిలో 124.5 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే మోటార్లను ఏర్పాటు చేస్తుండగా, దాని దిగువన గాయత్రి పంప్‌హౌస్‌లో మోటార్ల సామర్థ్యం మరో 15 మెగావాట్ల మేర ఎక్కువగా అంటే 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మొత్తంగా 7 మోటార్లను ఏర్పాటు చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. ఒక్కో మోటారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. వ్యాసం 22 మీటర్లు, బరువు 650 టన్నులుగా ఉంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తుంది. ఈ పంప్‌హౌస్‌లో మొదటి పంప్‌హౌస్‌కు ఈ ఏడాది ఆగస్టు 11న మొదటి మోటార్‌ను ప్రారంభిం చగా, అదేనెల 14న రెండు, 20న మూడు, 31న నాలుగు, సెప్టెంబర్ 18న ఐదు, అక్టోబర్ 19న ఆరు మోటార్లను ప్రారంభించారు. శనివారం మిగిలిన ఏడో మోటార్‌ను ఈఎన్ సీ నల్లా వెంకటేశ్వర్లు, ఎత్తిపోతల పథ కాల సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మోటార్ దిగ్విజయంగా నడవడంతో ఇక్కడ నూటికి నూరు శాతం మోటార్లన్నీ సిద్ధమైనట్లయింది. నెలాఖరుకు పూర్తి స్థాయిలో.. ఇక ఇప్పటికే లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి(అన్నారం)లలో మోటార్లు వెట్రన్లు పూర్తి చేసుకుని రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ మేఘా ఇంజనీరింగ్ సంస్థే పూర్తి చేసింది. ఇక సుందిళ్ల (పార్వతి)లో తొమ్మిది మోటార్లలో ఎనిమిది మాత్రమే సిద్ధమయ్యాయి. దీన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఇక ప్యాకేజీ–6లో మరో మోటార్‌కు వెట్‌రన్ నిర్వహించాల్సి ఉండగా, దానికి నెలాఖరున పూర్తి చేయనున్నారు. ఇవన్నీ పూర్తయితే తొలిదశలో కాళేశ్వరం ఎత్తిపోతలు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లే. -
‘సాగర్’ నీటిచౌర్యం
‘సాగర్’ నీరు చౌర్యానికి గురవుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలోని రైతులు అక్రమంగా మోటార్లను ఏర్పాటు చేసుకుని సాగర్ నీటిని తరలించుకుంటున్నారు. ఈ నీటితో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సుమారు 1500లకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీంతో మన జిల్లాలో రైతులు సాగుచేస్తున్న చివరి ఆయకట్టు పంటలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. మండుతున్న ఎండలకు సాగర్ నీరు ఆవిరవడంతోపాటు నీటిచౌర్యంతో ప్రాజెక్టులో నీరు ఖాళీ అవుతోంది. నిజాంసాగర్(జుక్కల్) : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి చౌర్యం సాగుతోంది. ఓ వైపు పూడిక.. మరోవైపు నీటిచౌర్యంతో రెండు పంటలకు అందాల్సిన ప్రాజెక్ట్ నీరు.. ఒక పంటకే ఖాళీ అవుతోంది. నిజాంల కాలంలో మంజీర నదిపై 30 టీఎంసీల సామర్థ్యం తో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. అయితే ప్రాజెక్టులో పూడిక కారణంగా ప్రస్తుతం 17.8 టీఎంసీల సామర్థ్యానికి పడిపోయింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్మించినప్పటికీ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో నీరు నిల్వ ఉంటుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలోని పలు గ్రామాల్లో రైతులకు సాగుభూములున్నాయి. దీంతో అక్కడి రైతులు సాగర్ నీటిపై దృష్టి పెట్టారు. క్యాచ్మెంట్ ఏరియాలోని నీటిని తరలిస్తూ.. నాన్‌కమాండ్ ప్రాంతంలో బీడువారిన భూములను సాగులోకి తెస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారు. సాగర్ నీటితో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పాపన్నపేట, శంకరంపేట, కల్హేర్ మండలాల్లోని పలు గ్రామాల రైతులు పంటలు సాగుచేస్తున్నారు. అక్రమంగా వ్యవసాయ పంపుసెట్లను బిగిస్తూ.. కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని తరలిస్తున్నారు. సుమారు 1,500పైగా ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. తరలిపోతున్న జలాలు.. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అక్రమంగా మోటార్ల వినియోగంతో నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు తరలిపోతుంది. మండుతున్న ఎండలకు తోడు నీటిచౌర్యంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో రోజురోజుకు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. క్యాచ్మెంట్ ఏరియాలోని రైతులు రోజుకు 200 నుంచి 300 క్యూసెక్కుల వరకు నీటిని తరలిస్తున్నారు. వారు సాగుచేస్తున్న పంటలకు అక్రమంగా నీటిని తరలించడంతో సాగర్ చివరి ఆయకట్టు వరకు పంటలకు నీరందడం కష్టంగా మారింది. అక్రమ మోటార్లను తొలగిస్తాం.. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అక్రమ మోటార్ల ఉంటే. వాటిని వెంటనే తొలగిస్తాం. నీటి చౌర్యానికి పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని వినియోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – దత్తాత్రి, డిప్యూటీ ఈఈ -
‘మోటార్ల’పై నియంత్రణ!
సాక్షి, హైదరాబాద్: ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు కాల్వల పరిధిలోని మోటార్లను నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లకు మంగళవారం నీటి పారుదల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాల్వల పరిధిలోని 180 కి.మీ. మేర పో లీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో పర్యవేక్షించాలని ఆదేశించింది. మోటార్ల పరిస్థితిని సమీక్షించి, తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎస్సారెస్పీ పరిధిలో 3 వేలకు పైగా మోటార్లు ఉండటంతో చివరి ఆయకట్టు రైతులకు నీరందటం లేదు. దీంతో రైతులు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్సారెస్పీ పైఆయకట్టు పరిధిలో విద్యుత్ ను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
తోడేస్తున్నారు..!
నల్లగొండ : నిరంతర విద్యుత్ సరఫరా రైతాంగాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. గతంలో రెండు విడతలుగా వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసిన రోజులతో పోలిస్తే నిరంతర విద్యుత్ సరఫరా ఒడిదుడుకులు ఎదుర్కొటోంది. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా వివిధ కేటగిరీలకు చెందిన వర్గాలకు మేలు జరుగుతోంది కానీ, వ్యవసాయరంగాన్ని మాత్రం ఇరకాటంలోకి నెట్టేస్తోంది. నిరంతర విద్యుత్ తాకిడికి వ్యవసాయ మోటార్లు బోరున మొత్తుకుంటున్నాయి. ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించకుండా నీటి వాడకాన్ని బట్టి పంపుసెట్లు ఆన్‌చేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. కానీ ఒకే సమయంలో పంపుసెట్లన్నీ పనిచేస్తుండటంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపైన పడుతోంది. గతంలో రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేసిన రోజుల్లో వ్యవసాయ ఫీడర్లను రెండు గ్రూపులుగా విభజించి, పగలు, రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా చే శారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్ అమల్లోకి వచ్చిన తర్వాత రైతులు పగటిపూటనే ఎక్కువ వినియోగిస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ అంతగా ఉండటం లేదు. నిరంతర్ విద్యుత్ అమల్లోకి వచ్చిన 12 రోజుల్లో విద్యుత్ డిమాండ్ ఓసారి పరిశీలిస్తే....ఈ నెలలో జిల్లాకు కేటాయించిన విద్యుత్ కోటా 18.30 మిలియన్ యూనిట్లు కాగా...వినియోగం రోజుకో రకంగా ఉంటోంది. ఈ నెల ఒకటో తేదీన 26.911 మిలియన్ యూనిట్లు, 4 తేదీన 26.33 ఎం.యూ, 7వతేదీన 25. 02 ఎం.యూ, 12న 24.55 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడకం జరిగింది. కోటాకు మి ంచి సగటున 6.25 ఎం.యూ పెరిగింది. ఉదయం 8 గంటల నుంచే... నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటి నుంచి పగటి పూటనే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 11, 12 గంటల వరకు విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. ఉదాహరణకు ఈ నెల 12న ఉదయం 8 గంటలకు 1068 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తే రాత్రి 11 గంటల సమయంలో 808 మెగావాట్లకు తగ్గిపోయింది. కోతల్లేని విద్యుత్ కారణంగా వ్యవసాయంతో పాటు, పరిశ్రమలకు కూడా మేలు జరుగుతోంది. పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ వాడకం రికార్డు స్థాయికి చేరింది. నల్లగొం డ, హుజూర్నగర్, భువనగిరి ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థలు అత్యధికంగా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ కోటాకు మించి వినియోగం పెరిగింది. నల్లగొండ డివిజన్‌కు కేటాయించిన కోటా 3.04 మిలియన్ యూనిట్లు కాగా, వాడకం 4.30 ఎం.యూ. అదేవిధంగా హుజూర్ నగర్ డివిజన్‌కు కేటాయించిన కోటా 4.56 ఎం.యూ కాగా వాడకం 5.12 ఎం.యూ, భువనగిరి డివిజన్ కోటా 3.18 ఎం.యూకు గాను రూ.4.63 ఎం.యూకు చేరింది. అడుగంటిన జలం... జిల్లాలో సాధారణంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు తోడు, నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 3,85,105 ఉన్నాయి. వీటిల్లో 3,61,165 కనెక్షన్లకు ఆటోస్టార్టర్లు ఉంచారు. స్టార్టర్లు లేని కనెక్షన్లు 23,940 ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ పగటి పూటనే ఎక్కువగా ఉన్నందున భూగర్భ జలాలు క్రమేపీ తగ్గుతూ వస్తోన్నాయి. భూగర్భ జల వనరుల శాఖ నివేదిక ప్రకారం నల్లగొండ జిల్లాలో నవంబర్‌లో భూగర్భ జల మట్టాలు 8.64 అడుగుల లోతులో ఉండగా డిసెంబర్లో 9.17 అడుగులకు పడిపోయాయి. అంటే నీటిమట్టం 0.53 అడుగులకు తగ్గింది. సూర్యాపేట జిల్లాలో నవంబర్‌లో 8.11 అడుగులు ఉండగా డిసెంబర్లో 8.82 అడుగులకు పడిపోయాయి. 0.71 అడుగులకు నీటి మట్టాలు తగ్గాయి. యాదాద్రి జిల్లాలో నవంబర్‌లో 9.58 అడుగులకు నీటి మట్టాలు ఉండగా, డిసెంబర్లో 10.13 అడుగులకు పడి పోయాయి. 0.55 అడుగుల లోతుకు నీటి మట్టాలు తగ్గాయి. అవసరం మేరకు విద్యుత్ వాడుకోవాలి నిరంతర విద్యుత్ వద్దని, పాత పద్ధతిలోనే విద్యుత్ ఇవ్వాలని రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. బోరుబావులు, ఆయకట్టు రైతుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రైతులు అవసరం మేరకు విద్యుత్ వాడుకోవాలి. నిరంతరం విద్యుత్ వద్దని చెప్పకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే మోటార్లు నడుపుకోవాలని సూచిస్తున్నాం. రైతులు స్వచ్ఛందంగా ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతం వ్యవసాయ పనులు సీజన్ కావడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ నెల మొదటి వారంలో ఉన్నంత డిమాండ్ ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరా యాలు లేవు. కృష్ణయ్య, ఎస్ఈ -
మోటార్ నడవకున్నా.. ‘మీటర్’ మోత!
ఎత్తిపోతల పథకాలపై కనీస చార్జీలు, లోడ్ చార్జీల పేరుతో డిస్కంల బాదుడు - మోటార్లు ఏడాదిలో నడుస్తున్నవి గరిష్టంగా 90 రోజులే - చార్జీలు మాత్రం 365 రోజులకు వసూలు సాక్షి, హైదరాబాద్: మన ఇంట్లోని కూలర్‌ను ఎండాకాలంలో మూడు నెలల పాటు వాడతాం, తర్వాత పక్కన పెడతాం.. కానీ కూలర్ ఉందని చెప్పి.. కనీస చార్జీల పేరిట ఏడాదంతా వసూలు చేస్తే..? అదేంటి మరీ దుర్మార్గం.. అంటారు కదా? ప్రస్తుతం నీటి పారుదల శాఖ పరిధిలోని ఎత్తిపోతల పథకాల విషయంలో జరుగుతున్నది ఇదే! రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల మోటార్లు ఏడాదిలో పనిచేసేది 90 రోజులే అయినా.. కనీస చార్జీల పేరిట డిస్కంలు ముక్కుపిండి మరీ 365 రోజులకు బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఏటా నీటి పారుదల శాఖ రూ.1,750 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటే... అందులో ఇలా అదనంగా చెల్లిస్తున్న బిల్లు ఏకంగా రూ.350 కోట్ల వరకు ఉండటం గమనార్హం. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు పూర్తయితే విద్యుత్ అవసరాలు భారీగా పెరుగుతాయి. అప్పుడు ఇలా కనీస చార్జీల పేరిట వేసే మోత ఏకంగా రూ.వేల కోట్లకు పెరిగే అవకాశముంది. వినియోగం పెరిగిన కొద్దీ మోతే మోటార్లు నడవని రోజుల్లోనూ డిస్కమ్‌లు బిల్లు వేస్తుండటంతో.. నీటి పారుదల శాఖ రూ.350 కోట్లను అదనంగా చెల్లించాల్సి వచ్చినట్లు అంచనా. ఇక ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే భారీగా జరిమానా వసూలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోనే రూ.2.79 కోట్ల మేర ఆలస్య రుసుము వసూలు చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే నిర్మాణంలోని ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే.. ఈ విద్యుత్ మోత, కనీస చార్జీల బాదుడు భారీగా ఉంటుందని నీటిపారుదల శాఖ లబోదిబోమంటోంది. వాడకున్నా వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వాటిల్లో కొన్ని పూర్తయి ప్రారంభంకాగా, మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 12,075 మెగావాట్ల వరకు విద్యుత్ అవసరమని అంచనా. ప్రస్తుతం అలీసాగర్, గుత్ప, ఉదయ సముద్రం, దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి తదితర 14 ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. వీటికి 1,338 మెగావాట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతుండగా.. యూనిట్‌కు రూ.6.40 చొప్పున బిల్లు చెల్లిస్తున్నారు. మొత్తంగా గతేడాది చెల్లించిన బిల్లు దాదాపు రూ. 1,750 కోట్లు. కానీ జల వనరుల్లో నీళ్లు లేని సందర్భాల్లో పంపులు, మోటార్లు నడవకున్నా.. డిస్కంలు లోడ్ చార్జీలు, కనీస చార్జీల పేరిట భారీగా బిల్లులు వేస్తున్నాయి. ► గతేడాది దేవాదుల ప్రాజెక్టు నుంచి కేవలం 8 టీఎంసీల నీటినే ఎత్తిపోశారు. దాదాపు ఆరేడు నెలల పాటు ఈ ప్రాజెక్టు పంపులు వాడనేలేదు. అయినా ఏకంగా రూ.200 కోట్ల మేర విద్యుత్ బిల్లు రావడం గమనార్హం. ► కల్వకుర్తి ప్రాజెక్టులో గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అసలు మోటార్లే నడవకున్నా.. కనీస చార్జీల కింద రూ. 27 లక్షలు వసూలు చేశారు. మొత్తంగా 13.97 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా.. రూ.88.39 కోట్ల మేర బిల్లు వచ్చింది. ఎనర్జీ ఆడిటింగ్ ఎక్కడ? ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అవుతున్న ఖర్చులను తగ్గించుకునేలా ఎనర్జీ ఆడిటింగ్ చేయాలని గతంలో నీటి పారుదల శాఖ, ట్రాన్స్‌కో నిర్ణయించాయి. ఒక కమిటీని కూడా వేశాయి. కానీ తర్వాత ఏదీ ముందుకు కదలలేదు. ఇక కనీస చార్జీల తొలగింపుపై డిస్కంలతో ప్రభుత్వం చర్చించినా ఫలితం లేదు. చార్జీల తొలగింపు అంశం తమ పరిధిలో లేదని, దాన్ని ఈఆర్సీ తేల్చాలని డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై ఈఆర్సీకి లేఖ రాయనున్నట్లు ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు, విద్యుత్ అవసరాలు.. మొత్తం ఎత్తిపోతల పథకాలు : 19 అవసరమైన విద్యుత్ (మెగావాట్లలో) : 12,075 ప్రస్తుతం పనిచేస్తున్నవి (కొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి) : 14 వీటికి ఏటా వినియోగం అవుతున్న విద్యుత్ (మెగావాట్లలో) : 1,338 గతేడాది చెల్లించిన విద్యుత్ బిల్లులు (రూ. కోట్లలో) : 1,750 కనీస చార్జీలు, లోడ్ చార్జీల పేరిట వసూలు చేసింది (అంచనా కోట్లలో) : 350 వచ్చే ఏడాదికి అవసరమయ్యే విద్యుత్ (మెగావాట్లు) : 3,470 మోటార్లు నడవకున్నా పడే భారం (అంచనా కోట్లలో) : 1,250 భవిష్యత్తులో 12 వేల మెగావాట్లకు పడే భారం (అంచనా కోట్లలో) : 4,800 -
నిరంతర విద్యుత్ వద్దు
సిరిసిల్ల జిల్లాలో రైతుల రాస్తారోకో సిరిసిల్ల రూరల్: వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా వద్దని, 12 గంటలు చాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కి చెందిన రైతులు బుధవారం సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేట క్రాస్‌రోడ్డు వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సుమారు 60 మంది రైతులు స్థానిక ‘సెస్’ కార్యాల యానికి తరలి వచ్చారు. ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. నిరంతర సరఫరా తో పంపుసెట్లు ఏకధాటిగా నడిచి బావు ల్లో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని, తద్వారా మోటార్లు కాలి పోతున్నా యని ఆవేదన చెందారు. ఇది చిన్న, సన్నకారు రైతులకు విఘాతం కలిగిస్తోం దని చెప్పారు. 12 గంటల పాటు విడతల వారీగా అందిస్తే సరిపోతుందని విన్నవించారు. అనంతరం సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. -
దేవ.. దేవ
ప్రశ్నార్థకంగా మారనున్న దేవాదుల ఎత్తిపోతల పథకం భవిష్యత్ ఏజెన్సీ కక్కుర్తితో పాడవుతున్న మోటార్లు అనుభవం లేని ఇంజనీర్ల పర్యవేక్షణ నిర్దేశిత పంపింగ్ లక్ష్యానికి ఆటంకాలు సాక్షి, వరంగల్ : దేవాదుల ఎత్తిపోతల పథకం మోటార్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కంపెనీ నిర్వాకం వల్ల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. మోటార్ల నిర్వహణ బాధ్యతలను సొంతగా ఎలాంటి అనుభవం లేని సంస్థకు సాగునీటి శాఖ అప్పగించింది. ఎక్కువ ఆదాయం రావాలనే ఉద్దేశంతో ఈ సంస్థ అనుసరిస్తున్న వైఖరి మొత్తం ప్రాజెక్టు మనుగడకే ఇబ్బందులు కలిగించేలా ఉంది. బ్రెజిల్ మోటార్లు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం బ్రెజిల్ నుంచి భారీ మోటార్లను దిగుమతి చేసుకున్నారు. అయితే, భారీ మోటార్ల వారం టీ గడువు ముగిసింది. ఈ మేరకు నిర్వహణ, మరమ్మతుల ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మోటార్లలో సాంకేతిక సమస్యలు వస్తే బ్రెజిల్‌కు చెందిన ఇంజనీర్ల బృందం మరమ్మతు చేయాలి. కానీ అక్కడి నుంచి వచ్చే ఇంజనీర్ల బృందం... మోటార్లను మరమ్మతు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తే ఇక వాటి ని బ్రెజిల్‌కు తరలించాల్సిందే. తద్వారా మరమ్మతుకు ఖర్చు ఎక్కువ కావడమే కాకుం డా చాలా సమయం పడుతుంది. మరమ్మతుల కోసం మోటార్లను బ్రెజిల్ తీసుకు వెళ్తే దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో ఇబ్బం దులు ఏర్పడుతాయి. వర్షాభావ ప్రాంతాలకు నీరు అందించడంలో అవాంతరాలు వస్తాయి. ఇలా కాకుండా మోటార్ల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటే భారీ మరమ్మతులను నియంత్రించేందుకు వీలవుతుంది. మోటార్ల నిర్వహణ కాంట్రాక్టు పొందిన సంస్థ మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సా గునీటి శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మోటార్లను నడిపే విషయంలో నిపుణులను నియమించుకుంటే చిన్నస్థాయి సమస్యలకు వెంటనే అరికట్టొచ్చు. అయితే, కాంట్రాక్టు పొందిన సంస్థ మాత్రం దీనికి విరుద్ధంగా తక్కువ వేతనం ఇచ్చి జూనియర్ ఇంజనీర్లను నియమించి వారికి భారీ మోటార్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. కూలెంట్ అయిల్ లేక... నెల క్రితం భీంఘన్ పూర్ పంప్‌హౌజ్‌లోని నీటిని పంపింగ్ చేస్తున్న సమయంలో మోటార్లలోని కాయిల్స్ కాలిపోయినట్లు తెలిసింది. సరిపడా కూలెంట్ అయిల్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని, ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని కాంట్రాక్టు సంస్థకు అధికారులు చెప్పినట్లు తెలిసింది. నెల గడిచినా ఇప్పటికీ మోటార్లు రిపేరు చేయలేదని అధికారులు అంటున్నారు. ఏటూరునాగారంలోని దేవాదుల ఇన్ టేక్ వెల్ వద్ద ఉన్న ఇలాంటి మరో మోటారును తమకు తెలియకుండానే తీసుకొచ్చి భీంఘన్ పూర్ వద్ద అమర్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాయిల్స్ కాలిపోయిన మోటారును మరమ్మతు కోసం పుణకు తరలించినట్లు తెలిసింది. దేవాదుల ప్రాజెక్టులోని భారీ మోటార్లను తరలించాలంటే భారీ నీటిపారుదల శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏటూరునాగారం ఇన్ టేక్ వెల్ మోటారును ఎవరికీ తెలియకుండానే కాంట్రాక్టు సంస్థ భీంఘన్ పూర్‌కు తరలించినట్లు తెలిసింది. ఇలా తరలించే క్రమంలో మోటారు కింద పడిపోయినట్లు సాగునీటి శాఖ సిబ్బంది చెబుతున్నారు. -
ఆ మోటార్లు ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?
-
ఒకటికే.. ఇంకో పక్షం!
కొల్లాపూర్ మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీఎల్‌ఐ) ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్ వద్ద గత నెలలో నీట మునిగిన మోటార్ల మరమ్మతు పనులు ఇంకా పక్షం రోజులు పట్టే అవకాశం ఉంది. పనులు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ ఇంకా సమయం పట్టేలా ఉంది. కనీసం ఒక మోటార్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి నీటిని పంపింగ్ చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా పనులు ముమ్మరమయ్యాయి. అయితే ప్రభుత్వం, అధికారులు ఆశించిన ఫలితం సాధించేందుకు ఇంకా పక్షం రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎలాగైనా ఈ నెల మొదటి వారంలోనే పనులు పూర్తి చేసి ఒక పంపునకు ట్రయల్న్ ్రనిర్వహించాలని అధికారులు భావించినా.. అవి ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. కొనసాగుతున్న పనులు లిఫ్ట్‌లోని ఒకటో పంపునకు బీహెచ్ఈఎల్ కంపెనీ ప్రతినిధులు నిపుణులైన ఇంజనీర్లచే పనులు చేయిస్తున్నారు. మోటార్లలోకి వెళ్లిన నీటిని ఇప్పటికే తొలగించారు. నీటి ఆవిరిని, తేమను పూర్తిస్థాయిలో తొలగించేందుకు మిషనరీతో హీట్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను పంపుహౌస్‌లో ఏర్పాటు చేశారు. ఈ పనులు కొన్నిరోజులుగా కొనసాగుతున్నాయి. అయితే ఒకటో మోటార్లో నీటి ఆవిరిని, తేమను పూర్తిస్థాయిలో తొలగించే ప్రక్రియ ఇంకా పూర్తి కావడం లేదు. మిషనరీ వాల్యూస్ వచ్చాక హీట్ చేసే ప్రక్రియను ఆపివేసి మిగతా పనులు చేపట్టాలనే యోచనలో బీహెచ్ఈఎల్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. పనులను పటేల్ కంపెనీ ప్రతినిధులతోపాటు ప్రాజెక్టు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒకటో మోటార్‌కు త్వరితగతిన ట్రయల్న్ ్రనిర్వహించాలని అధికారులు, కంపెనీల నిర్వాహకులు భావిస్తున్నా అవి ఆచరణ సాధ్యం కావడం లేదు. మరమ్మతు పనులు పూర్తయ్యేసరికి మరో పది లేదా 15రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఓ అధికారి వెల్లడించారు. మరమ్మతు పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రబీ పంటకు నీరందేనా? ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులు రబీ పంట సాగు చేసుకోవచ్చని రెండు, మూడు రోజుల్లో లిఫ్టులోని మొదటి పంపు మరమ్మతు పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మూడురోజుల క్రితం ప్రకటించారు. ఎంజీఎల్‌ఐ కాలువల కింది పంటలకు సాగునీరందుతుందని ఆయన హామీ ఇచ్చారు. అధికారులు కూడా ఈ దిశగా పనులు సాగిస్తున్నా మరమ్మతుల్లో మాత్రం జాప్యం జరుగుతుంది. రబీ సాగుకు మరో పక్షం రోజుల్లోనైనా కచ్చితంగా మోటార్‌ను విజయవంతంగా రన్ చేసి నీటి పంపింగ్ చేస్తే ఎటువంటి ఢోకా ఉండదు. కానీ మరమ్మతుల్లో మరికొంత జాప్యం జరిగితే పంటల సాగుకు ఇబ్బందులు తలెత్తడం ఖాయం. రైతాంగ సమస్యను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎల్లూరు లిఫ్ట్‌లోని మొదటి పంపునకు త్వరితగతిన మరమ్మతులు పూర్తిచేయాలని రైతాంగం కోరుతున్నారు. -
ఎత్తిపోయిన ఎత్తిపోతల పథకం
వెల్దుర్తి : మండలంలోని కుకునూర్ హల్దీవాగులో 20 ఏళ్ల క్రితం రూ. 31 లక్షలు ఖర్చు చేసి ఎత్తి పోతల పథకాన్ని నిర్మించినా, అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, లబ్ధిదారుల అవగాహన లోపం అన్నీ కలగలిపి ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం లక్ష్యాన్ని నీరుగార్చారు. ఫలితంగా 181 మంది రైతు కూలీల బతుకులకు ఆసరా లేకుండాపోయింది. కూలీలను రైతులను చేయాలని భూమి లేని ఎస్సీలను రైతులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం కుకునూర్ హల్దీవాగు ఒడ్డున ఉన్న 181 ఎకరాల సీలింగ్ భూమిని కుకునూర్, పంతుల్‌పల్లి, బస్వాపూర్ గ్రామాలకు చెందిన 181 మంది రైతులకు పంపిణీ చేసింది. నిరుపేద రైతులు ఈ భూముల్లో పంటలు పండించి అభివృద్ధి చెందడం కోసం 1992లో అప్పటి రామాయంపేట ఎమ్మెల్యే అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి కృషి ఫలితంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం రాయితీపై రూ. 22 లక్షలు మంజూరు చేయించారు. ఆ డబ్బులతో 116 ఎకరాలను చదును చేశారు. అంతేకాకుండా విద్యుత్ శాఖకు అవసరమైన డబ్బును కూడా ఎస్సీ కార్పొరేషన్ చెల్లించడంతో అధికారులు ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఐడీసీ సహకారంతో హల్దీవాగులో ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండు బావులు తవ్వి రింగులు వేశారు. ఈ బావుల్లో 7.5 హెచ్‌పీ మోటర్లను బిగించి నీటి సరఫరా కోసం చదును చేసిన భూముల్లో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇక బతుకులు బాగుపడతాయని రైతులంతా భావించారు. కానీ సాగు సలహాలు ఇచ్చేవారు కరువవడంతో రైతులు ఆ పొలాన్నీ వృథా ఉంచేశారు. అలా కొన్ని రోజులు గడిచే సరికి విలువైన పైపులను దొంగలు ధ్వంసం చేయడంతో పాటు కొన్ని పైపులను ఎత్తుకెళ్లారు. అలాగే విద్యుత్ వైర్లు, ప్యానల్ బోర్డులు, స్టాటర్లు, 7.5 హెచ్‌పీ మోటర్లను సైతం చోరులు అపహరించారు. సంవత్సరాలు గడచిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం చెట్లు, ముళ్ల పొదలతో అటవీ ప్రాంతంగా మారింది. ప్రస్తుతం దళితులకు మూడెకరాలు పంపిణీ చేస్తామంటున్న కేసీఆర్ సర్కార్ బీడుగా మారిన భూములను చదును చేసి సాగునీటి సౌకర్యం కల్పిస్తే సాగుకు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాయని, తద్వారా తమ బతుకులు బాగుపడతాయని రైతులు కోరుతున్నారు. బోర్లు వేస్తే సాగు చేసుకుంటాం తమకు ప్రభుత్వం పంపిణీ చేసిన 181 ఎకరాల్లో బోర్లు వేసి మోటర్లు బిగిస్తే కలిసికట్టుగా శ్రమించి పంటలు సాగు చేసుకుంటామని రైతులు తెలిపారు. ప్రతి పది ఎకరాలకు ఓ బోరు వేసి, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు సాగుకు సలహాలు, సూచనలు ఇస్తే సిరులు పండిస్తామని రైతులు చెబుతున్నారు. -
మోటార్లు.. మీటర్లు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మున్ముందు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేస్తుందా..? అత్యధికంగా భూగర్భ జలాల వినియోగంపై ఆధారపడిన జిల్లా రైతుల మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో నల్లగొండది రెండోస్థానం. జిల్లా మొత్తం విద్యుత్ వినియోగంలో 40శాతం వాటా వ్యవసాయ రంగానిదే. ఇక్కడ 3,11,132 విద్యుత్ పంపుసెట్లు ఉన్నాయి. అంటే, జిల్లా రైతాంగం ఎంతగా విద్యుత్ వినియోగంపై ఆధారపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టును మినహాయిస్తే, పెద్దగా ఇరిగేషన్ సౌకర్యం లేదు. ఈ కారణంగానే బోర్లు, బావులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఏ రకంగా చూసినా, జిల్లా రైతులసాగు పూర్తిగా విద్యుత్‌తో ముడిపడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆందోళనకు కారణమవుతోంది. రాజాపేట మండలం రఘునాథపురంలో ఎనిమిది మంది రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం వివాదాస్పదమవుతోంది. వర్షాభావ పరిస్థిలకు తోడు విద్యుత్ కోతలు ఇప్పటికే రైతులను వేధిస్తున్నాయి. లోఓల్టేజీ సమస్య సరేసరి. జిల్లాకు కేటాయించింది రోజుకు 17.62మిలియన్ యూనిట్లు కాగా, సోమవారం ఒక్క రోజే 18.72 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వాడేశారు. కాగా, వ్యవసాయ పంపుసెట్లపై ఆధారపడి వేసిన మెట్ట పంటలు చేతికి వస్తాయా..? రావా అన్న ఆందోళనా ఉంది. ఇదే తరుణంలో విద్యుత్ అధికారులు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెబుతున్న ఉచిత విద్యుత్‌కు అర్థం ఏం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో ఉచిత విద్యుత్ సౌకర్యం పొందుతున్న రైతులు 3,06,588 మంది. కాగా, ఇదే కేటగిరీలో బిల్లులు చెలిస్తున్న రైతులు మరో 4,544 మంది ఉన్నారు. గత ఏడాది ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద రూ.290.78కోట్లు వెచ్చించారు. ఇంతగా ఉచిత విద్యుత్‌పై ఆధారపడిన రైతుల గురించి ఆలోచించకుండా ప్రయోగాత్మకంగానైనా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అమర్చడం విమర్శలపాలైంది. కాగా, ఇరవై నాలుగు గంటల ఫీడర్పై కనెక్షన్లుండి, ఎక్కువగా వినియోగిస్తున్నందునే మీట ర్ల బిగించామని విద్యుత్ అధికారులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులకే పరిమితం అవుతుందా..? మెల్లమెల్లగా ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ విస్తరిస్తుందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. బిల్లులు చెల్లించాల్సిందే ..! రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన గంగ లింగయ్య, టి.నర్సింహ, జి.నరహరి, శ్రీరాంరెడ్డి తదితర 8 మంది రైతుల వ్యవసాయ పంపుసెట్లకు ఇటీవల ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ మీటర్లు బిగించారు. వీరిలో రైతుల్లో చాలా మంది పశుగ్రాసం వేశారు. మీటర్లు ఎక్కువ విద్యుత్ వినియోగించినట్లు నమోదు చేశాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్నామని.. ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తామంటే ఉచిత విద్యుత్ అన్న పదానికి అర్థం ఎక్కడని వీరు ప్రశ్నిస్తున్నారు. -
కరెంటోళ్లు.. కదలరు..మెదలరు!
ఇల్లంతకుంట, న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారు. కరెంటు సరఫరాలో లోపాలు తలెత్తినప్పు డు సిబ్బంది పట్టించుకోకపోవడంతో రైతులే ప్రాణాలకు తెగించి సరిచేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద నిర్వహణ లోపాలతో పాటు వాటిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో నిండుప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేస్తూ ఆ తర్వాత వాటి గురించి మరిచిపోతున్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నట్లు చెప్పి తాత్కాలికంగా తప్పించుకుంటున్నారు. కానీ.. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ట్రాన్స్‘ఫార్మర్ల’వైపు చూస్తే ఒట్టు.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో కుంటలు, చెరువుల్లోకి నీరు చేరడంతో పాటు వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు పెరిగాయి. నీటి లభ్యత దృష్ట్యా రైతులు రబీలో అంచనాలకు మించి వరిపంట సాగు చేశారు. అయితే కరెంటు సరఫరా రోజురోజుకు అధ్వానంగా మారడంతో రైతుల ఆశలు ఆరంభంలో అడుగంటుతున్నాయి. కరెంటు వచ్చే సమయాల్లో ట్రాన్స్ఫార్మర్లలో మరమ్మతుల వల్ల మోటార్లు నడవడం లేదు. రైతులు పొలాలను పారించుకోవడానికి మరమ్మతు చేసుకోబోయి ప్రమాదాలబారినపడుతున్నారు. విద్యుత్ సిబ్బంది తరచూ ఆయా గ్రామాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను సందర్శించి పరికరాలను మార్చడం, రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రమాదాలపై అవగాహన కల్పించడం మరిచిపోయారు. వ్యవసాయ బావులకు సర్వీస్ చార్జీలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్న అధికారులు.. ట్రాన్స్ఫార్మర్ల వద్ద లోపాలను పసిగట్టి సరిచేకపోవడం శోచనీయమని రైతులు మండిపడుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ గ్రామాల్లో రైతులు ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులు చేసుకుంటున్నారు. ఆన్ ఆఫ్ స్విచ్‌లతో పాటు ఎర్తింగ్ సక్రమంగా లేక ఫ్యూజులు వేసే విషయంలో అవగాహన కరువై రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.