ట్రెండ్ మారుతోంది. ఆ ట్రెండ్‌కు తగ్గట్లు మారకపోతే వెనకబడిపోతాం. అది మనుషులైనా..వస్తువులైనా. ప్రపంచ దేశాల్లో ఆర్ధిక సంక్షోభం, దానికితోడు పెరిగిపోతున్న పెట్రో ధరలతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గుచూపుతున్నారు. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసేందుకు ఇష‍్టపడుతున్నారు. వారి ఇష్టాలకు అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల్ని తయారు చేసే పనిలో పడ్డాయి.
10 పైసల ఖర్చుతో
తాజాగా నహాక్ మోటార్స్ సంస్థ గరుడ, జిప్పీ పేర్లతో కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సంప్రదాయ పద్దతిలో పెడల్స్ తొక్కుతూ ఈ సైకిల్‌పై ప్రయాణం చేయవచ్చు. అదే విధంగా పెడల్స్ తొక్కకుడా బ్యాటరీ సాయంతో వెళ్లిపోవచ్చు. ఈ సైకిల్‌లో లిథియం అయాన్ బ్యాటరీలను అమర్చారు. వీటిని ఒక్క సారి చార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల ప్రయాణం చేయచ్చని కంపెనీ హామీ ఇస్తోంది. బ్యాటరీ ఛార్జింగ్‌కి అతి తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటుందని, ఒకసారి ఛార్జింగ్ చేస్తే అక్షరాల 10 పైసలకు మించి విద్యుత్ ఖర్చు అవదని కంపెనీ చెబుతోంది.
ధర ఇలా
ప్రస్తుతం మా ర్కెట్‌లో గరుడ మోడల్ ధర 31,999 రూపాయలు ఉండగా జిప్పీ ధర రూ. 33,499గా నిర్ణయించినట్లు నహాక్ మోటార్ తెలిపింది. .
Comments
Please login to add a commentAdd a comment