punishment to kid
-
భయం పెట్టాలని చేతులు కాల్చింది
నెల్లూరు,నాయుడుపేటటౌన్: కొడుక్కి భయం పెట్టాలని ఓ తల్లి ఏడేళ్ల కొడుకు చేతులపై వాతలపెట్టిన ఘటన పట్టణంలోని మునిరత్నంనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని గుంటూరువారితోటకు చెందిన బోంతపూడి ధనలక్ష్మి పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ను ప్రేమవివాహం చేసుకుంది. వీరికి 5వ తరగతి చదువుతున్న పవన్, రెండో తరగతి చదువుతున్న ప్రభాకర్, ఒకటో తరగతి చదువుతున్న రోజా అనే ముగ్గురు పిల్లలున్నారు. సురేష్ నాయుడుపేట పట్టణంలో నివాసముంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ భార్యాపిల్లలను పోషించేవాడు. రెండునెలల క్రితం భార్యాభర్తల మధ్య కలహాలు చెలరేగి సురేష్ ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో ధనలక్ష్మి కూలి పనులకు వెళుతూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో వారంరోజుల క్రితం ప్రభాకర్ తరచూ ఇంటిపక్కన ఉన్న పిల్లలతో గొడవకు దిగడమే కాకుండా మలవిసర్జనను పక్క ఇళ్లలో పడవేస్తున్నట్లుగా పొరుగింటి వారు వివాదానికి దిగారు. దీంతో కొడుక్కి భయపెట్టాలని ధనలక్ష్మి అట్లకాడను కాల్చి ప్రభాకర్ రెండు చేతులపై వాతలు పెట్టింది. అయితే చేతులకు పెద్దఎత్తున బొబ్బలు లేసి చీముపట్టి ఉండటాన్ని స్థానికులు బుధవారం గుర్తించి విచారించారు. అంతేకాకుండా బాలుడికి సరైన వైద్యచికిత్స సైతం అందించకుండా ఇంటి వద్ద వదిలేసి ధనలక్ష్మి ఉదయం వెళ్లి సాయంత్రం వస్తుండటంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై అక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త సూపర్వైజర్ ఉమామహేశ్వరికి విషయం తెలియజేసింది. ఆమె మునిరత్నంనగర్కు వెళ్లి ప్రభాకర్ పరిస్థితి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లితో పాటు బాలుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కుమారుడికి భయం పెట్టేందుకే కాల్చానని ఇంత గాయమవుతుందని తెలియదని ధనలక్ష్మి వాపోయింది. తన కోపం కారణంగానే భర్త కూడా వెళ్లిపోయాడని చెప్పడంతో వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బాలుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. -
కుమార్తెను గదిలో బంధించిన తల్లి
సారవకోట : మండలంలోని వెంకటా పురం గ్రామానికి చెందిన కె.అమూ ల్య(11)ను తల్లి సరోజిని చీకటి గదిలో బంధించి వెళ్లిపోయింది. గదిలో ఊపిరాడకపోవడంతో కేకలు వేసింది. వీటిని గమనించిన స్థానికులు గదికి ఉన్న వెంటిలేటరును తొలగించి బాలికను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వీరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలిక నుంచి సమాచారం సేకరించారు. ప్రస్తుతం కోటబొమ్మాళిలో 6వ తరగతి చదువుతోంది. ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. తల్లికి ఫోన్ చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించామన్నారు. -
దారుణం... మూడేళ్ల బాలుడికి షాక్ ఇచ్చింది!
ఆర్మీ మాజీ మహిళా ఆఫీసర్ దారుణంగా ప్రవర్తించింది. మూడేళ్ల బాబు తెలియక చేసిన చిన్న పనికి కరెంట్ షాక్ ఇవ్వడంతో పాటు చేతిలో ఉన్న వస్తువుతో కొట్టింది. లన్నా మోనాఘన్(34) అనే మహిళ తొమ్మిదేళ్లు ఆర్మీలో సేవలు అందించింది. అయితే మోనాఘన్ డ్రెస్ బటన్లను మూడేళ్ల వయసున్న ఓ బాలుడు విప్పడానికి ప్రయత్నించాడు. ఆడుకుంటూ వచ్చిన పక్కింటి వారి బాబు చేసిన పనికి మహిళా ఆఫీసర్ ఆవేశానికి లోనైంది. బాలుడ్ని శిక్షించాలనుకుంది. కుక్కలకు తగిలించే ఓ కిట్ ను తీసుకుని చిన్నారికి చుట్టింది. బ్యాటరీతో పనిచేసే కిట్ తో బాలుడికి కొన్ని సెకన్లపాటు కరెంట్ షాక్ ఇచ్చింది. అంతటితో అగకుండా బాలుడ్ని చల్లని నీళ్లలో పడేసింది. గతేడాది జరిగిన ఘటనపై తాజాగా విచారణ జరిగింది. ఈడిన్ బర్గ్ హైకోర్టు జడ్జి ఆమెపై నమోదైన 5 ఆరోపణలపై జులైలో తదుపరి విచారణ జరిగిన తర్వాత శిక్ష ఖరారు చేస్తామన్నారు. తాను చేసిన తప్పులను మోనాఘన్ అంగీకరించింది. తీవ్ర ఆవేవంలో తాను అలా చేశానని చెప్పింది. పోలీసుల కస్డడీలో ఉన్న మోనాఘన్ ప్రస్తుతం గర్భవతి అని అందుకే ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని మొదటి తప్పుగా క్షమించి వదిలేయాని ఆమె తరఫు లాయర్ వాదించారు. మూడేళ్ల పసివాడిపై జరిగిన దాడి కనుక నిందితురాలికి కచ్చితంగా శిక్ష పడుతుందని అక్కడి వారు భావిస్తున్నారు.