దారుణం... మూడేళ్ల బాలుడికి షాక్ ఇచ్చింది!
ఆర్మీ మాజీ మహిళా ఆఫీసర్ దారుణంగా ప్రవర్తించింది. మూడేళ్ల బాబు తెలియక చేసిన చిన్న పనికి కరెంట్ షాక్ ఇవ్వడంతో పాటు చేతిలో ఉన్న వస్తువుతో కొట్టింది. లన్నా మోనాఘన్(34) అనే మహిళ తొమ్మిదేళ్లు ఆర్మీలో సేవలు అందించింది. అయితే మోనాఘన్ డ్రెస్ బటన్లను మూడేళ్ల వయసున్న ఓ బాలుడు విప్పడానికి ప్రయత్నించాడు. ఆడుకుంటూ వచ్చిన పక్కింటి వారి బాబు చేసిన పనికి మహిళా ఆఫీసర్ ఆవేశానికి లోనైంది. బాలుడ్ని శిక్షించాలనుకుంది. కుక్కలకు తగిలించే ఓ కిట్ ను తీసుకుని చిన్నారికి చుట్టింది. బ్యాటరీతో పనిచేసే కిట్ తో బాలుడికి కొన్ని సెకన్లపాటు కరెంట్ షాక్ ఇచ్చింది. అంతటితో అగకుండా బాలుడ్ని చల్లని నీళ్లలో పడేసింది. గతేడాది జరిగిన ఘటనపై తాజాగా విచారణ జరిగింది.
ఈడిన్ బర్గ్ హైకోర్టు జడ్జి ఆమెపై నమోదైన 5 ఆరోపణలపై జులైలో తదుపరి విచారణ జరిగిన తర్వాత శిక్ష ఖరారు చేస్తామన్నారు. తాను చేసిన తప్పులను మోనాఘన్ అంగీకరించింది. తీవ్ర ఆవేవంలో తాను అలా చేశానని చెప్పింది. పోలీసుల కస్డడీలో ఉన్న మోనాఘన్ ప్రస్తుతం గర్భవతి అని అందుకే ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని మొదటి తప్పుగా క్షమించి వదిలేయాని ఆమె తరఫు లాయర్ వాదించారు. మూడేళ్ల పసివాడిపై జరిగిన దాడి కనుక నిందితురాలికి కచ్చితంగా శిక్ష పడుతుందని అక్కడి వారు భావిస్తున్నారు.