punjab cricket team
-
పంజాబ్ జట్టుకు టీమిండియా క్రికెటర్ గుడ్‌బై
టీమిండియా వెటరన్ క్రికెటర్ మన్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. పంజాబ్ జట్టుతో తన పద్నాలుగేళ్ల బంధం ముగిసిందని తెలిపాడు. ఇకపై తాను దేశవాళీ క్రికెట్లో త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు వెల్లడించాడు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.పరుగుల వరదపంజాబ్లోని జలంధర్‌లో 1991లో జన్మించిన మన్దీప్ సింగ్‌కు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ. ఈ క్రమంలో బ్యాటర్‌గా ఎదిగిన అతడు.. 2010 అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే ఏడాది.. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసిన మన్దీప్ సింగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 14 వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇందులో 19 సెంచరీలు, 81 అర్ధ శతకాలు ఉండటం విశేషం. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రమంలో 2016లో టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్న మన్దీప్ సింగ్.. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పంజాబ్‌కు టైటిల్ అందించిన కెప్టెన్టీమిండియా తరఫున మూడు టీ20 మ్యాచ్‌లు ఆడి 87 పరుగులు చేశాడు. అదే ఏడాది చివరిసారిగా భారత్‌కు ఆడిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. పంజాబ్ కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఈ క్రమంలో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో పంజాబ్‌కు టైటిల్ అందించిన 32 ఏళ్ల మన్దీప్ సింగ్.. తన కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లు శనివారం ప్రకటించాడు. అందుకే జట్టును వీడుతున్నా కాగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయాలని భావిస్తోందని.. అందుకే జట్టుకు తన సేవలు ఇక అవసరం లేదని మన్దీప్ అన్నాడు. ఈ ఏడాది త్రిపుర జట్టుతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలిపాడు. కాగా మరో పంజాబీ బ్యాటర్ జీవన్‌జ్యోత్ సింగ్ కూడా ఈసారి త్రిపురకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. -
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా పంజాబ్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023 విజేతగా పంజాబ్ జట్టు నిలిచింది. సోమవారం మొహాలీ వేదికగా జరిగిన ఫైనల్లో బరోడాను ఓడించిన పంజాబ్.. తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేయగల్గింది. బరోడా బ్యాటర్లలో అభిమన్యు సింగ్(61), కెప్టెన్ కృనాల్ పాండ్యా(45) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో అదరగొట్టగా.. కౌల్, బ్రార్, మార్కండే తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో అన్మోల్ప్రీత్ సింగ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు చేశాడు. అతడితో పాటు వాదేరా(61) పరుగులతో ఆఖరిలో అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. బరోడా బౌలర్లలో కృనాల్ పాండ్యా, సోపారియా, సేథ్ చెరో వికెట్ పడగొట్టారు. -
సిక్సర్ తో సెంచరీ కొట్టిన యువీ
మొహాలి: టీమిండియా సీనియర్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ రంజీట్రోఫీలో సత్తా చాటాడు. గ్రూపు 'బి' లీగ్ లో గుజరాత్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఈ పంజాబ్ బ్యాట్స్ మన్ సెంచరీతో చెలరేగాడు. 151 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. సిక్సర్ తో సెంచరీ పూర్తి చేయడం విశేషం. 233 బంతుల్లో 187 పరుగులు చేసి అవుటయ్యాడు. పంజాబ్ 608 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ పై పంజాబ్ కు 141 పరుగుల ఆధిక్యం దక్కింది. మనన్ వోహ్రా(104) సెంచరీకి తోడు మనదీప్ సింగ్(63), కౌల్(74) అర్ధ సెంచరీలతో రాణించడంతో పంజాబ్ పటిష్ట స్థితిలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 467 పరుగులు చేసింది.