లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్‌పై దాడిచేసి, మొత్తం 13 ప్రాణాలు పోయేందుకు కారణమైన ఉగ్రవాదులు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. వీళ్లు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు అయి ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా ముంబై ఉగ్రదాడుల సమయంలో లష్కరే తాయిబా వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ దాడులు చేసిన విషయం తెలిసిందే.
అదే దారిలో మరోసారి లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఇప్పుడూ ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. మొత్తం ఉగ్రవాదులందరూ 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్నవారేనని అంటున్నారు. వారిలో ఒక తీవ్రవాది హతం కాగా, మరో తీవ్రవాదికి తీవ్ర గాయాలయ్యాయి. 2007 తర్వాత పంజాబ్‌లో ఉగ్రవాద ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. దీనానగర్ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలను అధికారులు పూర్తిగా బంద్ చేశారు. పంజాబ్ రాజధాని చండీగఢ్ నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో ఈ దీనానగర్ ఉంది. తీవ్రవాదుల ఎన్కౌంటర్లో పంజాబ్ పోలీసు కమాండోలు ముమ్మరంగా పాల్గొన్నారు.